MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Smart Ring: మీ వేలికి ఈ రింగ్ ఉంటే... మీ వెంట ఓ డాక్ట‌ర్ ఉన్న‌ట్లే. ఫీచ‌ర్లు తెలిస్తే వెంట‌నే కొనేస్తారు

Smart Ring: మీ వేలికి ఈ రింగ్ ఉంటే... మీ వెంట ఓ డాక్ట‌ర్ ఉన్న‌ట్లే. ఫీచ‌ర్లు తెలిస్తే వెంట‌నే కొనేస్తారు

Smart Ring: ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఆ ట్రెండ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన గాడ్జెట్‌లలో Oura Ring 4 ఒకటి. ఇది చిన్న రింగ్‌లా కనిపించినా, ఇందులో అత్యాధునిక సెన్సర్లు ఉంటాయి. ఇంత‌కీ ఇది ఎలా ప‌నిచేస్తుందంటే.

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 29 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Oura Ring 4 అంటే ఏమిటి?
Image Credit : Amazon.in

Oura Ring 4 అంటే ఏమిటి?

Oura Ring 4 అనేది ఒక స్మార్ట్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ రింగ్. ఇది సాధారణ ఉంగరంలా వేళ్లకు ధరించవచ్చు. కానీ ఇందులో ఉన్న సెన్సర్లు మీ శరీరానికి సంబంధించిన కీలక డేటాను సేకరిస్తాయి. ఈ రింగ్ ఐఓస్‌, ఆండ్రాయిడ్ ఫోన్లతో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. మీరు ధరించిన తర్వాత, ఇది రోజంతా మీ శరీర స్థితిని గమనిస్తూ డేటాను Oura App‌లో చూపిస్తుంది. ఈ రింగ్ ముఖ్యంగా నిద్ర నాణ్యత (Sleep Tracking), హార్ట్ రేట్, రోజువారీ కార్యకలాపాలు, ఒత్తిడి స్థాయిల‌ను, శరీర పునరుద్ధరణ (Recovery), మహిళల ఆరోగ్య సూచికలు వంటి వాటిని ట్రాక్ చేస్తుంది.

25
ఈ స్మార్ట్ రింగ్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : Amazon.in

ఈ స్మార్ట్ రింగ్ ఎలా పనిచేస్తుంది?

Oura Ring 4లో ఉన్న సెన్సర్లు మీ వేళ్లలోని రక్త ప్రసరణను గమనించి ఆరోగ్య సమాచారం సేకరిస్తాయి. రింగ్‌లోని హార్ట్ రేట్ సెన్సర్లు మీ గుండె స్పందనను కొలుస్తాయి. మోషన్ సెన్సర్లు మీ రోజువారీ కదలికలు, వ్యాయామాన్ని గుర్తిస్తాయి. రాత్రి సమయంలో ఇది నిద్ర దశలను (deep sleep, light sleep, REM) విశ్లేషిస్తుంది. ఈ డేటా మొత్తం బ్లూటూత్‌ ద్వారా మీ మొబైల్‌లోని Oura Appకి చేరుతుంది. యాప్ ఆ డేటాను విశ్లేషించి మీకు స్కోర్లు, సూచనలు ఇస్తుంది. దీంతో మీరు మీ ఆరోగ్యం గురించి స్పష్టమైన అవగాహన పొందవచ్చు.

Related Articles

Related image1
Mini AC: కిర్రాక్ ఆఫ‌ర్‌.. రూ. 2 వేల‌కే ఏసీ. ఈ స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా
Related image2
TATA Tiago: క్ల‌చ్ నొక్కి నొక్కి కాలు నొప్పి పుడుతుందా.? ఈ కారు కొంటే బిందాస్‌.
35
Oura Ring 4 ముఖ్య ఫీచర్లు
Image Credit : Amazon.in

Oura Ring 4 ముఖ్య ఫీచర్లు

ఈ స్మార్ట్ రింగ్‌లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ముఖ్య‌మైన‌వి 30 కంటే ఎక్కువ బయోమెట్రిక్ డేటా ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకర్, మహిళల హెల్త్‌ ట్రాకింగ్. ఇందులో ఉన్న స్మార్ట్ సెన్సింగ్‌ టెక్నాలజీ మీ శరీరానికి అనుగుణంగా డేటాను విశ్లేషిస్తుంది. అందువల్ల ఇది చాలా క‌చ్చితమైన ఫలితాలు అందిస్తుంది. ధ‌ర విష‌యానికొస్తే అమెజాన్‌లో ఈ రింగ్ ధ‌ర రూ. 28,900గా ఉంది. కాగా నెల‌కు రూ. 3211 ఈఎమ్ఐతో కూడా ఈ రింగ్‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

45
బ్యాటరీ, డిజైన్, సౌకర్యం
Image Credit : Amazon.in

బ్యాటరీ, డిజైన్, సౌకర్యం

Oura Ring 4 ప్రత్యేకతల్లో ముఖ్యమైనది దీని డిజైన్. పూర్తిగా టైటానియం మెటల్‌తో తయారు చేశారు. చర్మానికి హానికరం కాని మెటీరియల్‌తో రూపొందించారు. ఇది తేలికగా ఉంటుంది. 24 గంటలు ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రింగ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 8 రోజులు వరకు నాన్‌స్టాప్‌గా ప‌నిచేస్తుంది. ఇందులో స్క్రీన్ లేకపోవడం వల్ల బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుంది. చేతులు కడిగేటప్పుడు లేదా వర్షంలో కూడా సమస్య ఉండ‌కుండా వాటర్ రెసిస్టెంట్‌తో రూపొందించారు.

55
సైజింగ్, మెంబర్‌షిప్, వారంటీ
Image Credit : Amazon.in

సైజింగ్, మెంబర్‌షిప్, వారంటీ

Oura Ring 4 కొనుగోలు చేసే ముందు సైజింగ్ కిట్ ఉపయోగించడం తప్పనిసరి. ఎందుకంటే ఈ రింగ్ సైజ్ సాధారణ రింగ్ సైజ్ తో పోలిస్తే వేరు ఉంటాయి. సైజింగ్ కిట్‌తో ముందుగా మీకు సరైన సైజ్ తెలుసుకోవచ్చు. సైజింగ్ కిట్ కొనుగోలు చేస్తే అమేజాన్ నుంచి రూ. 999 క్రెడిట్ లభిస్తుంది. మెంబర్‌షిప్ మొదటి నెల ఉచితం, తర్వాత నెలకు రూ. 599 చెల్లించాలి. ఏడాదికి రూ. 6999 ప్యాకేజీ కూడా ఉంది. ఈ మెంబర్‌షిప్ ద్వారా యాప్‌లో పూర్తి ఆరోగ్య విశ్లేషణ అందుతుంది. కంపెనీ 2 సంవత్సరాల లిమిటెడ్ వారంటీ ఇస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Samsung నుంచి అదిరిపోయే 2 కొత్త ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
LPG Cylinder Shortage : మీ కిచెన్ లో ఇవి ఉంటే చాలు.. గ్యాస్ సిలిండర్ లేకున్నా వండుకోవచ్చు
Recommended image3
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Related Stories
Recommended image1
Mini AC: కిర్రాక్ ఆఫ‌ర్‌.. రూ. 2 వేల‌కే ఏసీ. ఈ స‌మ్మ‌ర్‌లో కూల్ కూల్‌గా
Recommended image2
TATA Tiago: క్ల‌చ్ నొక్కి నొక్కి కాలు నొప్పి పుడుతుందా.? ఈ కారు కొంటే బిందాస్‌.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved