MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Technology
  • Gadgets
  • Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !

Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !

Honor Win Turbo : హానర్ నుంచి 10,000mAh భారీ బ్యాటరీ, 8000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో హానర్ విన్ టర్బో మొబైల్ లాంచ్ అయింది. దీని అద్భుతమైన ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 30 2026, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గేమర్స్‌కు పండగే.. 16GB ర్యామ్, లీక్విడ్ కూలింగ్‌తో హానర్ విన్ టర్బో లాంచ్
Image Credit : X/raihanhan121

గేమర్స్‌కు పండగే.. 16GB ర్యామ్, లీక్విడ్ కూలింగ్‌తో హానర్ విన్ టర్బో లాంచ్

టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మార్కెట్లోకి ఒక పవర్‌ఫుల్ మొబైల్‌ను తీసుకొచ్చింది. అదే హానర్ విన్ టర్బో (Honor Win Turbo). సాధారణంగా ఫోన్లలో 6000mAh లేదా మహా అయితే 7000mAh బ్యాటరీని చూస్తుంటాం. కానీ ఈ ఫోన్‌లో ఏకంగా 10,000mAh బ్యాటరీని అమర్చారు. ఇంత హెవీ బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ మాత్రం చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉండటం విశేషం. హెవీ గేమర్స్, పవర్ యూజర్లను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు వున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డిస్‌ప్లే అదిరింది బాసూ.. ఎండలో కూడా క్రిస్టల్ క్లియర్
Image Credit : X/raihanhan121

డిస్‌ప్లే అదిరింది బాసూ.. ఎండలో కూడా క్రిస్టల్ క్లియర్

ఈ ఫోన్ డిస్‌ప్లే ఫీచర్లు చూస్తే ఎవరైనా అబ్బా అనాల్సిందే. ఇందులో 6.79-అంగుళాల 1.5K అమోలెడ్ ఓయాసిస్ ఐ ప్రొటెక్షన్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది కళ్లకు అస్సలు స్ట్రెయిన్ ఇవ్వదు. పైగా 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ నెక్స్ట్ లెవెల్ స్మూత్‌గా ఉంటాయి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఇందులో రికార్డ్ బ్రేకింగ్ 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. అంటే మండుటెండలో స్క్రీన్ చూసినా సరే, ఇండోర్‌లో చూసినట్లే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.

36
తగ్గేదే లేదనే పర్ఫార్మెన్స్.. గేమింగ్ రూమ్ రెడీ
Image Credit : X/raihanhan121

తగ్గేదే లేదనే పర్ఫార్మెన్స్.. గేమింగ్ రూమ్ రెడీ

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హానర్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ చిప్‌సెట్‌ను వాడారు. దీనికి తోడు Mali-G720 MC8 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. హెవీ గ్రాఫిక్స్ ఉన్న పబ్జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్స్ ఆడినా ఫోన్ అస్సలు లాగ్ అవ్వదు. ఇక ఆండ్రాయిడ్ 16 ఆధారిత లేటెస్ట్ మ్యాజిక్ ఓఎస్ 10 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. నెట్‌వర్క్ సరిగ్గా లేని బేస్‌మెంట్లు, లిఫ్టులు, హైస్పీడ్ ట్రైన్లలో కూడా సిగ్నల్ డ్రాప్ అవ్వకుండా ఇందులో ఒక స్పెషల్ C1+ RF చిప్‌ను కూడా అమర్చారు.

46
రెండు రోజులు నాన్‌స్టాప్.. పవర్ హౌస్ బ్యాటరీ
Image Credit : X/raihanhan121

రెండు రోజులు నాన్‌స్టాప్.. పవర్ హౌస్ బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్‌కు మెయిన్ పిల్లర్ దీని బ్యాటరీనే. 10,000mAh మెగా బ్యాటరీ ఇందులో ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా రెండు రోజుల పాటు ఛార్జింగ్ వైపు చూడక్కర్లేదు. కంపెనీ చెప్తున్న దాని ప్రకారం.. నాన్‌స్టాప్‌గా 14 గంటలకు పైగా గేమింగ్ లేదా 17 గంటల పాటు మ్యాప్స్ వాడుకోవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాదు, ఇందులో 27W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. అంటే మీ ఫోన్ నుంచి వేరే వాళ్ల ఫోన్‌ను లేదా బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ను పవర్‌బ్యాంక్‌లా ఛార్జ్ చేసుకోవచ్చు.

56
ఫొటోలు అదిరిపోవాల్సిందే.. OIS కెమెరా సెటప్
Image Credit : honor.com

ఫొటోలు అదిరిపోవాల్సిందే.. OIS కెమెరా సెటప్

కెమెరా లవర్స్ కోసం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది OIS ఫీచర్‌తో వస్తుంది. దీనివల్ల చేతులు కాస్త ఊగినా సరే ఫొటోలు, వీడియోలు బ్లర్ అవ్వకుండా షార్ప్‌గా వస్తాయి. దీనితో పాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరాను కేటాయించారు. ఫోన్ హీట్ ఎక్కకుండా ఉండటానికి 40,000 స్క్వేర్ మిమీ లిక్విడ్ కూలింగ్ ఏరియాను కూడా డిజైన్ చేశారు.

66
హానర్ విన్ టర్బో ధర ఎంతంటే?
Image Credit : Getty

హానర్ విన్ టర్బో ధర ఎంతంటే?

ఈ ఫోన్ కేవలం పవర్‌ఫుల్ మాత్రమే కాదు.. చాలా గట్టిది కూడా. దీనికి IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే ధూళి, వాటర్ హైప్రెషర్‌ను కూడా ఇది తట్టుకోగలదు. ఫోన్ కింద పడినా, చిన్నపాటి షాక్స్ తగిలినా ఏం కాకుండా SGS గోల్డ్ స్టాండర్డ్ ఫైవ్-స్టార్ సర్టిఫికేషన్ కూడా ఉంది.

ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి..

• 12GB RAM + 256GB వేరియంట్: 3299 యువాన్లు (మన కరెన్సీలో సుమారు ₹46,000)

• 12GB RAM + 512GB వేరియంట్: 3599 యువాన్లు (మన కరెన్సీలో సుమారు ₹50,000)

• 16GB RAM + 512GB వేరియంట్: 4199 యువాన్లు (మన కరెన్సీలో సుమారు ₹60,000)

బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి, భారత మార్కెట్లోకి రానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image3
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Related Stories
Recommended image1
SSC CGL 2026 : నిరుద్యోగులకు గడ్ న్యూస్.. 12,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు .. జీతం చూస్తే మైండ్ బ్లాకే
Recommended image2
Cheapest Tesla EV India: ఇండియాలోకి టెస్లా చీపెస్ట్ ఈవీ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved