- Home
- Technology
- Gadgets
- Moto Watch : మోటో వాచ్ 2 ఫిట్, బడ్స్ 2 అల్ట్రా వచ్చేశాయ్..100కు పైగా ఫిట్నెస్ మోడ్లు
Moto Watch : మోటో వాచ్ 2 ఫిట్, బడ్స్ 2 అల్ట్రా వచ్చేశాయ్..100కు పైగా ఫిట్నెస్ మోడ్లు
Moto Watch : స్మార్ట్‌వాచ్‌లో హెల్త్ కేర్.. ఇయర్‌బడ్స్‌లో అదిరిపోయే సౌండ్ ఎక్స్పీరియన్స్. ఇలా రెండు రకాలుగా ఉపయోగపడేలా మోటరోలా కొత్త గ్యాడ్జెట్లను తీసుకొచ్చింది. పోలార్ ఫిట్నెస్ టెక్నాలజీ, బోస్ ఆడియోతో వచ్చిన ఈ డివైజ్‌ల ప్రత్యేకతలేంటో చూద్దాం.
14

Image Credit : Moto
16 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మోటో వాచ్ 2 ఫిట్
తన ప్రీమియం సిగ్నేచర్ 27 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెండు కొత్త వేరబుల్స్‌ను ఇంటర్నేషనల్ మార్కెట్లో లాంచ్ చేసింది మోటరోలా. ఇందులో మోటో వాచ్ 2 ఫిట్ (Moto Watch 2 Fit) అనేది RTOS ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫిట్నెస్ ట్రాకర్. ఇది ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా వారం రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే, మోటో బడ్స్ 2 అల్ట్రా (Moto Buds 2 Ultra) హై-రిజల్యూషన్ ఆడియో కోడెక్స్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే ప్రీమియం TWS ఇయర్‌బడ్స్. ప్రముఖ ఫిట్నెస్ బ్రాండ్ 'పోలార్' (Polar) మోటో వాచ్ 2 ఫిట్‌కు కచ్చితమైన వర్కౌట్ గైడెన్స్ ఇస్తుండగా.. మోటో బడ్స్ 2 అల్ట్రాకు పాపులర్ 'బోస్' (Bose) సంస్థ సౌండ్ డిజైన్ ఆడియో ట్యూనింగ్ చేసింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
24
Image Credit : Moto
ధర, సేల్ వివరాలు
పాంటోన్ ట్రేసింగ్ గ్రే, పాంటోన్ ఎలిగెన్స్ అనే రెండు కేస్ స్టైల్స్‌లో మోటో వాచ్ 2 ఫిట్ ట్రాకర్ అందుబాటులో ఉంది. దీని స్ట్రాప్స్ పాంటోన్ స్ట్రాటిఫైడ్ సీ, పాంటోన్ పిజియన్, పాంటోన్ బాలెరీనా కలర్స్‌లో వస్తున్నాయి. ఇక మోటో బడ్స్ 2 అల్ట్రా ఇయర్‌బడ్స్ పాంటోన్ టెంపుల్ గ్రే, పాంటోన్ రిఫ్లెక్టింగ్ పాండ్ కలర్స్‌లో విడుదలయ్యాయి. మోటో వాచ్ 2 ఫిట్ ధర 119 యూరోల (మన కరెన్సీలో సుమారు రూ. 12,000) నుంచి ప్రారంభమవుతుంది. మోటో బడ్స్ 2 అల్ట్రా TWS ఇయర్‌బడ్స్ ధర 199 యూరోలు (సుమారు రూ. 21,000). రాబోయే వారాల్లో యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన దేశాల్లో ఇవి సేల్కు రానున్నాయి.
34
Image Credit : Moto
మోటో వాచ్ 2 ఫిట్: ఫీచర్లు
1.85 ఇంచుల OLED డిస్ప్లే, 390 x 450 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వచ్చిన బడ్జెట్ ఫిట్నెస్ ట్రాకర్ ఈ మోటో వాచ్ 2 ఫిట్. దీని అల్యూమినియం కేస్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ ఇచ్చారు. ఈ డివైజ్ RTOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వేర్ ఓఎస్ (WearOS) లాగా ఇందులో థర్డ్-పార్టీ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోలేం. ఇందులో 400mAh బ్యాటరీ ఉంది. 'ఆల్వేస్-ఆన్ డిస్ప్లే' ఆన్ చేస్తే 7 రోజులు, ఆఫ్ చేస్తే 12 రోజుల పాటు బ్యాటరీ వస్తుందని మోటరోలా చెబుతోంది. లో-పవర్ మోడ్‌లో అయితే ఏకంగా 16 రోజులు పనిచేస్తుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 24 గంటల రెగ్యులర్ వాడకానికి సరిపడా పవర్ వస్తుంది. ఇది 42.88 x 38.65 x 9.95 mm కొలతలు, కేవలం 28.1 గ్రాముల బరువుతో వస్తుంది.
44
Image Credit : Moto
మోటో బడ్స్ 2 అల్ట్రా: ఫీచర్లు
మోటో బడ్స్ 2 అల్ట్రాలో హైలైట్ ఫీచర్ ఆడియో ట్యూనింగ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీ. ఈ రెండింటినీ బోస్ (Bose) సంస్థ అద్భుతంగా డిజైన్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌లో నోలెస్ (Knowles) ఆర్మేచర్తో కూడిన 11 mm డైనమిక్ డ్రైవర్‌ను అమర్చారు. బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో పాటు LHDC 4, LHDC 5 లాంటి హై-రిజల్యూషన్ కోడెక్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే SBC, AAC ఆడియో కోడెక్స్‌కు కూడా సపోర్ట్ ఉంది. ఈ TWS ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటలు, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 37 గంటల పాటు ప్లేబ్యాక్ వస్తుంది. దీని కేస్ Qi 2 స్టాండర్డ్ వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ రెండూ IP57 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తున్నాయి.













