MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?

iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?

iPhone: ఐఫోన్ కొనాలనకున్నారా? బడ్జెట్ సరిపోవడంలేదా..? మీ కోసమే సంచలన ధమాకా సేల్.. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో చాలా తక్కువ ధరకే ఐఫోన్ కలను సాకారం చేసుకోండి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2026, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే
Image Credit : Official websites

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే

భారతదేశంలో పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ (iPhone) కొనుగోలు చేయాలని ఆశపడేవారు ఆసక్తిగా ఎదురుచూసేది ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' (Big Billion Days) సేల్ కోసమే. ఐఫోన్ రేట్లు భారీగా ఉండటం.. బడ్జెట్ సహకరించకపోవడం వల్ల ఫోన్ కొనడాన్ని వాయిదా వేసుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఈ సేల్ ఒక పెద్ద వరప్రసాదం. ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15 (iPhone 15) తో పాటు ఐఫోన్ 16 (iPhone 16) మోడళ్లపై కంపెనీలు, ఈ-కామర్స్ దిగ్గజాలు ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లను ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. భారత మార్కెట్‌లో ఇవి విడుదలైనప్పటి ధరలతో పోలిస్తే... ఈ సెప్టెంబర్ లో జరగబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భారీ డిస్కాట్లు లభించబోతున్నట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఐఫోన్ 15 (iPhone 15):
Image Credit : Gemini

ఐఫోన్ 15 (iPhone 15):

ఆపిల్ కంపెనీ పరిచయం చేసిన డైనమిక్ ఐలాండ్, 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు టైప్-సి (USB Type-C) ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన హంగులతో వచ్చిన ఐఫోన్ 15 మోడల్‌కు.. ఇప్పటికీ టెక్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. రిలీజ్ నాటికి ఈ ఫోన్ ధర (Launch Price) 128GB వేరియంట్ ₹79,900 వేలు ఉండగా.. డిస్కౌంట్ పోగా ₹69,900కు లభిస్తోంది. ఇక ఈ ఫోన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ₹54,999 (ఫ్లాట్ డిస్కౌంట్)కి వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు దీనితో పాటు బ్యాంక్ ఇచ్చే ఆఫర్లు, కంపెనీ ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను కస్టమర్లు ఏకంగా ₹49,999 కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన లాంచ్ ధరతో పోలిస్తే వినియోగదారులు దాదాపు ₹30,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related image2
Washing Machine: టాప్ లోడ్.. ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ లిక్విడ్స్ మధ్య తేడా ఏంటి? విడి విడిగా ఎందుకు వాడాలి?
34
ఐఫోన్ 16 (iPhone 16):
Image Credit : Official websites

ఐఫోన్ 16 (iPhone 16):

ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI Features), సరికొత్త A18 చిప్‌సెట్, ప్రత్యేక కెమెరా కంట్రోల్ బటన్ తో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన లేటెస్ట్ ఐఫోన్ 16 పై కూడా ఫ్లిప్‌కార్ట్ అనూహ్యమైన ఆఫర్లను అందిస్తోంది. విడుదలైన కొద్ది కాలంలోనే ఈ స్థాయి డిస్కౌంట్ రావడం అత్యంత అరుదు.రిలీజ్ నాటి ధర (Launch Price) ₹79,900 (128GB వేరియంట్) ఉండగా.. బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రైస్ మాత్రం ₹58,999 (లిస్టెడ్ సేల్ ప్రైస్) కు దొరికే అవకాశం ఉంది. ఇక ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి ఈ మోడల్‌ను ₹51,999 ధరకే కొనుగోలు చేయవచ్చని సమాచారం. ఈ లెక్కన మార్కెట్‌లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఐఫోన్ 16 పై ఏకంగా ₹27,000 పైగా ఆదా చేసుకునే అరుదైన అవకాశం దక్కబోతోంది.

44
గోల్డెన్ ఆఫర్ మిస్ అవ్వకండి..
Image Credit : Amazon

గోల్డెన్ ఆఫర్ మిస్ అవ్వకండి..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులకు పలు రకాల ఆదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారు ఎటువంటి అదనపు వడ్డీ లేకుంటే నెలవారీ సులభ వాయిదాలలో (EMI) ఫోన్‌ను పొందే సౌలభ్యం ఉంది.అంతే కాదు మీ వద్ద ఉన్న పాత ఆండ్రాయిడ్ లేదా పాత ఐఫోన్ వర్కింగ్ కండిషన్‌లో ఉంటే, దానికి మార్కెట్ కంటే ఎక్కువ ఎక్స్చేంజ్ వ్యాల్యూ లభిస్తుంది. 

ఇక HDFC, ICICI లేదా Axis వంటి ప్రముఖ బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ డిస్కౌంట్లు దక్కుతాయి.పాత మోడల్ స్మార్ట్‌ఫోన్ల నుండి ఆపిల్ ఐఫోన్ కి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి రిలీజ్ ధరలతో పోలిస్తే దాదాపు సగం ధరకే లభించే ఈ పండుగ సేల్ ఒక సవర్ణ అవకాశం! అయితే సెప్టెంబర్ లో జరగబోయే  ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Recommended image2
Samsung Galaxy S27 Series: శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు.. ఐఫోన్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్!
Recommended image3
Smart Wallet: ఇక పర్స్ పోతుందనే భయమే ఉండదు.. యాంటీ లాస్ట్ అలర్ట్‌తో స్మార్ట్ వాలెట్
Related Stories
Recommended image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image2
Washing Machine: టాప్ లోడ్.. ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ లిక్విడ్స్ మధ్య తేడా ఏంటి? విడి విడిగా ఎందుకు వాడాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved