MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Gadgets
  • Smart Wallet: ఇక పర్స్ పోతుందనే భయమే ఉండదు.. యాంటీ లాస్ట్ అలర్ట్‌తో స్మార్ట్ వాలెట్

Smart Wallet: ఇక పర్స్ పోతుందనే భయమే ఉండదు.. యాంటీ లాస్ట్ అలర్ట్‌తో స్మార్ట్ వాలెట్

Smart Wallet: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా స్మార్ట్‌గా మారుతున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ట్యాగ్8 డాల్ఫిన్ బ్లూటూత్ స్మార్ట్ వాలెట్ ఒక‌టి. అధునాత‌న ఫీచ‌ర్లున్న ఈ వాలెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 20 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పర్స్ పోయినా వెంటనే గుర్తించే స్మార్ట్ ట్రాకింగ్
Image Credit : Amazon.in, Gemini AI

పర్స్ పోయినా వెంటనే గుర్తించే స్మార్ట్ ట్రాకింగ్

ఇది కేవలం డబ్బు, కార్డులు పెట్టుకునే సాధారణ పర్స్ మాత్రమే కాదు. పోయిన పర్స్‌ను గుర్తించడంలో సహాయపడే బ్లూటూత్ ట్రాకర్, కార్డులను రక్షించే RFID టెక్నాలజీ, యాంటీ-లాస్ట్ అలర్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ వాలెట్. ముఖ్యంగా మహిళల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. ఈ స్మార్ట్ వాలెట్‌లో బ్లూటూత్ లో ఎనర్జీ (BLE) ఆధారిత ట్రాకర్‌ను అమర్చారు. దీన్ని Android లేదా iPhoneలో DOLPHIN Tracker యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెంటనే అలర్ట్
Image Credit : Amazon.in

వెంటనే అలర్ట్

ఒకవేళ పర్స్ మీ మొబైల్‌కు నిర్ణయించిన దూరం దాటితే వెంటనే ఫోన్‌లో అలర్ట్ వస్తుంది. దీంతో పర్స్‌ను మరిచిపోయి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పర్స్ పూర్తిగా కనిపించకుండా పోయినా యాప్‌లో అది చివరిసారిగా ఎక్కడ ఉందో చూపిస్తుంది. ట్రాకర్ మళ్లీ పరిధిలోకి వచ్చిన వెంటనే దాని స్థానాన్ని గుర్తించేందుకు కూడా ఈ వ్యవస్థ సహాయపడుతుంది.

35
కార్డులకు పూర్తి భద్రత.. డేటా దొంగతనానికి చెక్
Image Credit : Amazon.in

కార్డులకు పూర్తి భద్రత.. డేటా దొంగతనానికి చెక్

ఈ వాలెట్‌లో RFID బ్లాకింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ప్రస్తుతం కొన్ని డిజిటల్ పరికరాల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డుల్లోని సమాచారాన్ని అనుమతి లేకుండా స్కాన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి డేటా చోరీని ఈ టెక్నాలజీ అడ్డుకుంటుంది. దీంతో మీ కార్డుల్లోని వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. డబ్బుతో పాటు డిజిటల్ సమాచారానికి కూడా రక్షణ కల్పించడం ఈ వాలెట్ ప్రత్యేకత.

45
స్టైలిష్ డిజైన్‌తో పాటు ఎక్కువ స్టోరేజ్‌ సామర్థ్యం
Image Credit : Amazon.in

స్టైలిష్ డిజైన్‌తో పాటు ఎక్కువ స్టోరేజ్‌ సామర్థ్యం

ఈ స్మార్ట్ వాలెట్‌ను ప్రీమియం లెదర్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. బయటకు చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, లోపల అవసరమైన అన్ని వస్తువులు సౌకర్యంగా పెట్టుకునేలా విశాలమైన స్థలం కల్పించారు. నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు, నాణేలు, లైసెన్స్, ఐడీ కార్డులు వంటి ముఖ్యమైన వస్తువులను విడివిడిగా భద్రపరచుకునేలా అనేక కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. రోజువారీ వినియోగానికి అనువుగా ఉండటంతో పాటు వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా దీని డిజైన్‌ను రూపొందించారు.

55
దీర్ఘకాల బ్యాటరీ.. మహిళలకు అద్భుతమైన గిఫ్ట్
Image Credit : Amazon.in

దీర్ఘకాల బ్యాటరీ.. మహిళలకు అద్భుతమైన గిఫ్ట్

ఈ వాలెట్‌లో ఉండే ట్రాకర్‌కు సుమారు మూడు సంవత్సరాల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. సాధారణ వినియోగంలో తరచూ బ్యాటరీ మార్చాల్సిన అవసరం ఉండదు. అలాగే ట్రాకర్ శక్తివంతమైన అలారం ద్వారా పర్స్ దూరమైన వెంటనే హెచ్చరిక ఇస్తుంది. అందువల్ల పర్స్ పోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, భద్రత వంటి అన్ని అంశాలు ఒకే ఉత్పత్తిలో ఉండటంతో ఇది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, దీపావళి, రాఖీ, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image3
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Related Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక జస్ట్ గంటలోనే ప్రయాణం. త్వరలోనే సాకారం..
Recommended image2
అహంకారం త‌ల‌కెక్కితే కాలం గుణపాఠం చెబుతుంది.. అన్నీ ఉన్న‌ప్పుడే నువ్వెంటో తెలిపే క‌థ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved