వన్ ప్లస్ నుంచి ఐక్యూ వరకు : నవంబర్‌లో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే
Upcoming Mobile Phones: నవంబర్‌లో విడుదల కావడానికి చాలా ఫోన్లు లైన్ లో ఉన్నాయి. ఐక్యూ , వన్ ప్లస్, రియల్ మీ, వివో, ఒప్పోలు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏఐ కెమెరా, అప్ గ్రేడ్ గేమింగ్ చిప్‌లతో రాబోతున్నాయి.

నవంబర్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్ల సీజన్ ప్రారంభం
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నవంబర్‌లో భారీ మార్పును చూడబోతోంది. దీపావళి ఆఫర్ల అనంతరం, ప్రముఖ మొబైల్ కంపెనీలు తమ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ ఫోన్లను భారత మార్కెట్ లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఫోన్లు కేవలం హై-పర్ఫార్మెన్స్ మీదేనే కాకుండా, ఏఐ కెమెరా, గేమింగ్ స్థాయి ప్రాసెసర్‌లపై కూడా దృష్టి పెట్టాయి.
ఇప్పటికే ఈ ఫోన్లలో కొన్నింటిని చైనాలో విడుదల చేశారు, ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం నవంబర్ నెలను టార్గెట్ చేస్తున్నారు.
OnePlus 15: అత్యాధునిక డిజైన్, పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు
వన్ ప్లస్ (OnePlus 15) కంపెనీ తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా వన్ ప్లస్ 15ను తీసుకొస్తోంది. ఇది 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం సెరామిక్ గార్డ్ గ్లాస్ ఉపయోగించారు.
ఇందులో క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Qualcomm Snapdragon 8 Elite Gen 5) ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 840 జీపీయూ (Adreno 840 GPU) చిప్ సెట్ ను వాడారు. దీని వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ రెండు స్మూత్‌గా పనిచేస్తాయి.
కెమెరా విభాగంలో మూడు 50MP లెన్స్‌లు ఉంటాయి. అవి ప్రైమరీ, అల్ట్రా వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్.
iQOO 15: గేమింగ్ కింగ్
ఐక్యూ 15 (iQOO 15) గేమింగ్, హై-పర్ఫార్మెన్స్ యూజర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 6.85 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ తో 6000 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు Q3 గేమింగ్ చిప్ కూడా ఇందులో ఉంటుంది, ఇది గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
కెమెరా విభాగంలో మూడు 50MP లెన్స్‌లు, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 7000mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
Realme GT 8 Pro: ఫ్లాగ్‌షిప్ కిల్లర్
రియల్ మీ తన జీటీ 8 ప్రో (Realme GT 8 Pro) తో తన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ట్యాగ్‌ను మళ్లీ నిరూపించేందుకు సిద్ధంగా ఉంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, R1 గేమింగ్ చిప్ ఇందులో ఉన్నాయి.
ఫోన్‌లో 2K ఫ్లాట్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కలిగి ఉంటుంది. కెమెరా విభాగంలో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది. 7000mAh బ్యాటరీతో వస్తోంది, అయితే ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.
Vivo X300 Pro: కెమెరా ఇన్నోవేషన్‌లో కొత్త మైలురాయి
వివో తన తన కెమెరా ఇన్నోవేషన్‌కు పేరుగాంచిన ఎక్స్ సిరీస్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వివో X300 Pro మోడల్ ను వచ్చె నెలలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో పాటు ARM G1-Ultra GPU వాడారు.
కెమెరా సెటప్‌లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా వైడ్ లెన్స్‌లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6510mAh బ్యాటరీ, 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ ఈ ఫోన్‌కు అదనపు బలం ఇస్తాయి.
Oppo Find X9 Pro: సూపర్ డిజైన్, కొత్త టెక్నాలజీ
ఒప్పో ఫైండ్ (Oppo Find) సిరీస్ ఎల్లప్పుడూ ప్రీమియం డిజైన్, అద్భుత టెక్నాలజీకి ప్రసిద్ధి. Find X9 Pro కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఇందులో 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, ARM G1-Ultra GPU ఫోన్‌కు మరింత శక్తినిస్తుంది.
కెమెరా విభాగంలో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. 7500mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
నవంబర్ లో కొత్త ఫోన్ల జాతర.. ఎందుకు ప్రత్యేకం?
ఈసారి లాంచ్ కానున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వేగం లేదా డిజైన్‌కే పరిమితం కావు. ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలు, గేమింగ్ చిప్‌లు, పెద్ద సామర్థ్యమున్న బ్యాటరీలతో ఇవి వినియోగదారులకు విభిన్న అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. ఐక్యూ, వన్ ప్లస్, వివో, ఒప్పో, రియల్ మీ.. ఇలా అన్ని ప్రముఖ కంపెనీలు నవంబర్‌లో తమ హై-ఎండ్ మోడళ్లను లాంచ్ చేయనున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం నవంబర్ నిజమైన “ఫ్లాగ్‌షిప్ సీజన్”గా మారనుంది.