OnePlus 15: ఆపిల్, శాంసంగ్ కు గట్టిపోటీ.. వన్‌ప్లస్ 15 ధర, ఫీచర్లు ఇవే
OnePlus 15 : వన్‌ప్లస్ 15 విడుదలకు సిద్ధంగా ఉంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ, 165Hz OLED డిస్‌ప్లేతో రాబోతోంది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర, ఇతర స్పెక్స్, ఫీచర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

వన్‌ప్లస్ 15 ఎప్పుడు విడుదల కానుంది?
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15 ను అక్టోబర్ 27న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం సాయంత్ర 4:30 గంటలకు వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ ఏస్ 6 సిరీస్ ను కూడా పరిచయం చేయనుంది.
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబో (Weibo) లో వన్‌ప్లస్ 15 లాంచ్ వివరాలను ప్రకటించారు. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలోని షాపింగ్ సైట్లు ఒప్పో ఈ షాప్ (Oppo e-Shop), జేడీ మాల్ (JD Mall) తదితర వెబ్‌సైట్లలో ప్రీ-రిజర్వేషన్‌కు అందుబాటులో ఉన్నాయి.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ తో వస్తున్న వన్‌ప్లస్ 15
వన్‌ప్లస్ 15లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Qualcomm Snapdragon 8 Elite Gen 5) ప్రాసెసర్ ఉంటుంది. ఇది 3nm క్లాస్ 64-బిట్ ఆక్టా-కోర్ ఒరియన్ సిలికాన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త చిప్‌సెట్ 4.6GHz పీక్ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇది అంతకుముందు మోడల్‌తో పోలిస్తే 20% ఎక్కువ పనితీరు, 35% మెరుగైన పవర్ సామర్థ్యం కలిగి ఉందని సంస్థ తెలిపింది.
దీంతో ఫోన్‌లో గేమింగ్ పనితీరు గణనీయంగా మెరుగవుతుందనీ, సుమారు 1 గంట 48 నిమిషాల అదనపు గేమింగ్ టైమ్ లభిస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది. తాజా అడ్రినో జీపీయూ తో ఇది 23% మెరుగైన గ్రాఫిక్ పనితీరు, 25% మెరుగైన రే ట్రేసింగ్ అందించనుంది.
వన్‌ప్లస్ 15 డిజైన్, డిస్‌ప్లే, కొత్త సాండ్ స్టోర్మ్ వేరియంట్
వన్‌ప్లస్ 15లో 6.82-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఇది థర్డ్ జెన్ బీవోఈ ఫ్లెక్సిబుల్ ఓరియంటల్ OLED టెక్నాలజీతో వస్తుంది. వన్‌ప్లస్ ప్రకారం, ఈ డిస్‌ప్లే అంతకుముందు మోడల్‌తో పోలిస్తే 13% ఎక్కువ బ్రైట్ గా, 11.8% మెరుగైన కలర్ అక్యురసీ, 30% ఎక్కువ లైప్ అందిస్తుంది.
ఈసారి వన్‌ప్లస్ 15లో ప్రత్యేకమైన ‘Sand Storm’ వేరియంట్ కూడా ఉంటుంది. ఇది aerospace-grade nano ceramic metal-based alloyతో తయారవుతుంది. ఇది టైటానియం కంటే 134% బలంగా, స్టెయిన్‌లెస్ స్టీల్ కంటే 223% గట్టిగా, అల్యూమినియం కంటే 344% బలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది ఇప్పటివరకు తయారైన అత్యంత మన్నికైన వన్‌ప్లస్ ఫోన్‌గా నిలుస్తుంది.
వన్‌ప్లస్ 15 కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 15లో 50MP ప్రధాన లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్, f/2.8 అపర్చర్), 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌లు ఉన్నట్టు సమాచారం. ఫ్రంట్ కెమెరా 32MP ఉంటుంది.
బ్యాటరీ పరంగా, ఈ ఫోన్ 7,000mAh సామర్థ్యంతో వస్తుంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 15 చైనా వెర్షన్‌లో కలర్ ఓఎస్ 16 (Android 16 ఆధారిత), గ్లోబల్ వెర్షన్‌లో ఆక్సిజన్ ఓఎస్ 16 (OxygenOS 16)తో రాబోతోంది.
వన్‌ప్లస్ 15 గ్లోబల్ మార్కెట్, భారత్ లో లాంచ్ ఎప్పుడు?
వన్‌ప్లస్ 15 మొదటగా చైనాలో విడుదల కానుంది. ఆ తర్వాత భారత సహా ఇతర గ్లోబల్ మార్కెట్లకు అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్లను జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేస్తుంది. కానీ ఈసారి 2025 డిసెంబర్ ముగిసేలోపు భారత్‌లో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఫోన్ ఎంట్రీ వేరియంట్ ధర ₹70,000 నుండి ₹75,000 మధ్య ఉండవచ్చని అంచనా. ఆపిల్, షావోమీ, శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లతో వన్‌ప్లస్ 15 పోటీపడనుంది.
మొత్తంగా వన్‌ప్లస్ 15 శక్తివంతమైన చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన డిస్‌ప్లే, మన్నికైన బాడీతో అత్యంత ప్రీమియం ఫోన్‌గా నిలిచే అవకాశం ఉంది. అక్టోబర్ 27న జరగబోయే లాంచ్ ఈవెంట్ లో అధికారికంగా అన్ని వివరాలు వెల్లడికానున్నాయి.