MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Gadgets
  • బంపర్ ఆఫర్ ! ఐఫోన్ 16 ప్లస్ పై ₹25,910 భారీ డిస్కౌంట్‌

బంపర్ ఆఫర్ ! ఐఫోన్ 16 ప్లస్ పై ₹25,910 భారీ డిస్కౌంట్‌

iPhone 16 Plus Big Discount Offer: సూపర్ ఫీచర్లతో వచ్చిన ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 16 ప్లస్ పై ₹25,910 భారీ తగ్గింపు ఉంది. ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ తో బెస్ట్ డీల్స్ ఉన్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 23 2025, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐఫోన్ 16 ప్లస్ పై ₹25,910 వరకు బంపర్ తగ్గింపు ఆఫర్
Image Credit : Getty

ఐఫోన్ 16 ప్లస్ పై ₹25,910 వరకు బంపర్ తగ్గింపు ఆఫర్

దీపావళి సేల్ ముగిసినా, రిలయన్స్ డిజిటల్‌లో ఇంకా ఒక గోల్డెన్ ఆఫర్ కొనసాగుతోంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. మొదట లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర ₹89,900గా నిర్ణయించగా, ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ స్పెషల్ ఆఫర్‌లో కేవలం ₹67,990కే లభిస్తోంది. అంటే ₹21,910 వరకు నేరుగా తగ్గింపు లభిస్తుంది.

అదే కాకుండా యాక్సిస్ బ్యాంకు (Axis Bank) క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ పై కొనుగోలు చేస్తే అదనంగా ₹4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మొత్తం తగ్గింపు ₹25,910 వరకు చేరుతుంది. ఈ ఆఫర్‌ద్వారా ఐఫోన్ 16 ప్లస్ ను కేవలం ₹63,900కి పొందే అవకాశం లభిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎక్స్చేంజ్ ఆఫర్ తో మరింత తగ్గింపు
Image Credit : Getty

ఎక్స్చేంజ్ ఆఫర్ తో మరింత తగ్గింపు

రిలయన్స్ డిజిటల్, కొత్త ఫోన్ కొనే కస్టమర్లకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చితే, డివైస్ మోడల్, కండిషన్‌ను బట్టి ₹26,000 వరకు అదనపు లాభాలు అందిస్తోంది. దీని వల్ల మొత్తం సేవింగ్స్ మరింత పెరుగుతాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకు మాత్రమే లభిస్తాయి కాబట్టి, ఐఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

36
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు
Image Credit : Getty

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ లో 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ ( Super Retina XDR OLED) డిస్ప్లే ఉంది. ఇది ఎండలో కూడా అద్భుతమైన విజిబిలిటీని ఇస్తుంది. ఫోన్‌లో ఆపిల్ తాజా A18 చిప్‌సెట్ ఉపయోగించారు. ఆపిల్ ఏఐ (Apple Intelligence) ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ చిప్ వేగం, పవర్ ఎఫిషియెన్సీ, గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ కూలింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

46
ఐఫోన్ 16 ప్లస్ కెమెరా, ఫోటోగ్రఫీ పనితీరు ఎలా ఉంది?
Image Credit : Apple YouTube

ఐఫోన్ 16 ప్లస్ కెమెరా, ఫోటోగ్రఫీ పనితీరు ఎలా ఉంది?

ఫోటో, వీడియోల కోసం ఐఫోన్ 16 ప్లస్ లో శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ రెండు లెన్స్‌లు కలిపి హై డెఫినిషన్ ఫోటోలు తీసుకోవడంతో పాటు వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 12MP రెసల్యూషన్ కలిగి ఉంది. ఫేస్ టైమ్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం బెస్ట్ పనితీరును చూపిస్తుంది.

56
ఐఫోన్ 16 ప్లస్ బ్యాటరీ, డిజైన్, భద్రతా ఫీచర్లు
Image Credit : our own

ఐఫోన్ 16 ప్లస్ బ్యాటరీ, డిజైన్, భద్రతా ఫీచర్లు

ఐఫోన్ 16 ప్లస్ 4674mAh బ్యాటరీతో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఉండటంతో మీకు లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. IP68 రేటింగ్ ఉన్నందున ఈ ఫోన్ నీరు, దుమ్ము, ధూళి నుండి రక్షణ పొందుతుంది. కొత్త థర్మల్ డిజైన్ గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. దీంతో మీరు నాన్ స్టాప్ గా ఫోన్ ను ఉపయోగించవచ్చు.

ఐఫోన్ 16 ప్లస్ మోడల్ బ్లాక్, వైట్, పింక్, టియల్ అల్ట్రామెరైన్ వంటి ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

66
దీపావళి తర్వాత ఐఫోన్ 16 ప్లస్ పై సూపర్ డీల్
Image Credit : Apple YouTube

దీపావళి తర్వాత ఐఫోన్ 16 ప్లస్ పై సూపర్ డీల్

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ పై రిలయన్స్ డిజిటల్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్, దీపావళి తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి అద్భుతమైన అవకాశంగా మారింది. ₹25,910 వరకు మొత్తం తగ్గింపు, ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్.. ఇలా అన్నీ కలిపి ఈ డీల్‌ను మార్కెట్లో అత్యంత ఆకర్షణీయంగా మార్చాయి.

కెమెరా, పనితీరు, బ్యాటరీ లైఫ్ విషయంలో టాప్ క్లాస్ ఫీచర్లు, తక్కువ ధరలోనే కావాలనుకునే వారికి ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
హైదరాబాద్
ఇ-కామర్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image3
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Related Stories
Recommended image1
టయోటా హైరైడర్‌కు కొత్త లుక్ ! స్పోర్టీ స్టైలింగ్ తో ఎయిరో ఎడిషన్
Recommended image2
OnePlus 15: ఆపిల్, శాంసంగ్ కు గట్టిపోటీ.. వన్‌ప్లస్ 15 ధర, ఫీచర్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved