MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Football
  • Ronaldo Controversy: నోరుజారి బుక్కైన రొనాల్డో.. ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్‌కు అతను ప్లస్సా.. మైనస్సా?

Ronaldo Controversy: నోరుజారి బుక్కైన రొనాల్డో.. ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్‌కు అతను ప్లస్సా.. మైనస్సా?

Cristiano Ronaldo Controversy: ఫిఫా వరల్డ్ కప్ గురించి ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన కామెంట్స్‌పై విమర్శలు వస్తున్నాయి. 2026 వరల్డ్ కప్‌లో పోర్చుగల్ టీమ్‌లో 41 ఏళ్ల రొనాల్డో స్థానంపై అభిమానుల్లో కొత్త చర్చ జరుగుతోంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 16 2026, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫిఫా వరల్డ్ కప్ 2026: వివాదంలో పోర్చుగల్‌ స్టార్ రొనాల్డో
Image Credit : Getty

ఫిఫా వరల్డ్ కప్ 2026: వివాదంలో పోర్చుగల్‌ స్టార్ రొనాల్డో

ఫుట్‌బాల్ ప్లేయర్లకు వరల్డ్ కప్ ఆడటం అనేది ఒక ఎమోషన్. తమ దేశం తరఫున వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవడమే కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్‌గా భావిస్తారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బ్రెజిల్ వరల్డ్ కప్ టీమ్‌లో తన పేరు చూసుకుని స్టార్ ప్లేయర్ నైమర్ కన్నీళ్లు పెట్టుకోవడం మనందరికీ తెలిసిందే. ఇలాంటి ఎమోషనల్ మూమెంట్స్ ఫుట్‌బాల్ హిస్టరీలో చాలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో చేసిన కామెంట్స్ రచ్చ లేపుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వరల్డ్ కప్ అంటే అంత ఎమోషనా?
Image Credit : Getty

వరల్డ్ కప్ అంటే అంత ఎమోషనా?

కేవలం 1,55,826 జనాభా ఉన్న క్యూరసావో లాంటి చిన్న దేశం మొదటిసారి వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవ్వడం పెద్ద విషయం. జర్మనీ లాంటి బలమైన జట్టుతో ఆడినప్పుడు వారిపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ, జర్మనీ గోల్ కీపర్ మాన్యువల్ న్యూయర్‌ను దాటి క్యూరసావో ప్లేయర్లు తమ తొలి గోల్ సాధించారు.

ఆ మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోయినప్పటికీ, మొదటి గోల్ కొట్టగానే ఆ జట్టు కోచ్ డిక్ అడ్వొకాట్ ఎమోషనల్ అయ్యారు. మైదానంలో ప్లేయర్లు చూపించిన ధైర్యానికి ఆయన ఫిదా అయ్యారు. అలాగే, జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు జపాన్ కోచ్ హజిమే మోరియాసు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా వైరల్ అయింది. వరల్డ్ కప్ అంటే వాళ్లకు ఎంత ప్రాణమో ఈ సంఘటనలు చెప్తున్నాయి.

36
రొనాల్డో కామెంట్స్ రచ్చ
Image Credit : Getty

రొనాల్డో కామెంట్స్ రచ్చ

ఒకపక్క వరల్డ్ కప్ అంటే ప్లేయర్లు, కోచ్‌లు ఇంత ఎమోషనల్ అవుతుంటే.. పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవక ముందు, తన దేశానికి కప్పు అందించడమే తన కల అని రొనాల్డో చెప్పేవాడు. కానీ ఆ తర్వాత మాట మార్చాడు.

వరల్డ్ కప్ అంటే కేవలం 6-7 మ్యాచ్‌లు ఆడే టోర్నమెంట్ మాత్రమేనని, దాన్ని గెలవడం తన కల కాదని అన్నాడు. చిన్న దేశాలు సైతం వరల్డ్ కప్‌ను ప్రాణంగా భావిస్తున్న టైమ్‌లో.. రొనాల్డో చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జపాన్, క్యూరసావో కోచ్‌ల ఎమోషన్స్‌ను ఉదాహరణగా చూపుతూ రొనాల్డోను ట్రోల్ చేస్తున్నారు.

46
2026 వరల్డ్ కప్.. రొనాల్డో ప్లస్సా? మైనస్సా?
Image Credit : Getty

2026 వరల్డ్ కప్.. రొనాల్డో ప్లస్సా? మైనస్సా?

ఇప్పుడు అందరి దృష్టీ 2026 వరల్డ్ కప్‌పై పడింది. ఈ బుధవారం హ్యూస్టన్‌లో కాంగో డీఆర్ తో పోర్చుగల్ తన మ్యాచ్ ఆడబోతోంది. అయితే 41 ఏళ్ల రొనాల్డో టీమ్‌లో ఉండటం ప్లస్సా, మైనస్సా అనే దానిపై అభిమానుల్లో  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2024 యూరో కప్‌లో రొనాల్డో ఒక్క గోల్ కూడా చేయలేదు.

ఒక మేజర్ టోర్నమెంట్‌లో అతను గోల్ చేయకపోవడం అదే తొలిసారి. ఇక 2022 వరల్డ్ కప్‌లో కూడా కేవలం ఒకే ఒక్క పెనాల్టీ గోల్ చేశాడు. సౌత్ కొరియాతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ చేసినప్పుడు కోపగించుకున్నాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో అతన్ని బెంచ్‌కే పరిమితం చేశారు.

దీనిపై అభిమానులు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. "రొనాల్డో లేనప్పుడే పోర్చుగల్ టీమ్ బాగా ఆడుతోంది. సిస్టమ్‌కు తగ్గ వేరే ప్లేయర్లు ఉన్నారు" అని జాక్ మల్లియాస్ అనే అభిమాని అన్నాడు. మరో ఫ్యాన్ బియాట్రిస్ మిటాంకిన్ మాట్లాడుతూ.. "రొనాల్డో చాలా పెద్ద ప్లేయర్, అతనికి అభిమానులు ఎక్కువ. కానీ ఆ ఇగో అతని తలకెక్కి టీమ్‌కు నష్టం చేస్తుందేమో" అని ఆందోళన వ్యక్తం చేశాడు.

56
వయసు కేవలం నంబర్ మాత్రమే
Image Credit : ANI

వయసు కేవలం నంబర్ మాత్రమే

విమర్శలు ఉన్నప్పటికీ రొనాల్డో ఫామ్ తక్కువేం కాదు. 2025 యూఈఎఫ్ఏ (UEFA) నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ టైటిల్ గెలవడంలో అతను కీ రోల్ ప్లే చేశాడు. అందులో 8 గోల్స్ చేశాడు. ముఖ్యంగా స్పెయిన్‌తో జరిగిన ఫైనల్లో ఈక్వలైజర్ గోల్ కొట్టాడు.

అలాగే అల్-నస్ర్ క్లబ్ తరఫున 28 గోల్స్ చేసి, తన తొలి సౌదీ ప్రో లీగ్ టైటిల్‌ను కూడా అందించాడు. "వరల్డ్ కప్ లాంటి ప్రెజర్ మ్యాచ్‌లలో అతని ఎక్స్‌పీరియన్స్ చాలా అవసరం. పెనాల్టీ కిక్స్ కొట్టడానికి అతను ఉండాలి" అని రాబ్ స్టికల్ అనే ఫ్యాన్ సపోర్ట్ చేశాడు. ఎర్నెస్టో విలార్ అనే మరో అభిమాని మాట్లాడుతూ.. "వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. మెస్సీ, మోడ్రిచ్ లాంటి వాళ్లు కూడా టీమ్‌ను నడిపిస్తున్నారు. రొనాల్డో ఇప్పటికీ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉన్నాడు" అని అన్నాడు. రొనాల్డోకు ఇది వరుసగా ఆరో వరల్డ్ కప్ కావడం విశేషం. టోర్నీలోనే అత్యంత వయసున్న అవుట్‌ఫీల్డ్ ప్లేయర్ అతనే.

66
యంగ్ ప్లేయర్లకు అతనే ఇన్‌స్పిరేషన్
Image Credit : Asianet News

యంగ్ ప్లేయర్లకు అతనే ఇన్‌స్పిరేషన్

రొనాల్డో ఫిట్‌నెస్ చూసి అతని తోటి ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్‌కు ఆడే 26 ఏళ్ల పోర్చుగల్ మిడ్‌ఫీల్డర్ విటిన్హా మాట్లాడుతూ.. "అతనికి 41 ఏళ్లు, నాకు 26 ఏళ్లు. కానీ నేను అతనిలా ఫిట్‌గా లేను. అది నిజంగా నమ్మశక్యం కాని విషయం" అని అన్నాడు. టీమ్ మేనేజర్ రాబర్టో మార్టినెజ్ అయితే.. 2030 వరల్డ్ కప్‌లో 45 ఏళ్ల వయసులో కూడా రొనాల్డో ఆడే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చాడు. ఇక పిల్లలకైతే రొనాల్డో ఎప్పటికీ హీరోనే. టీమ్‌కు అవసరమైనప్పుడు అతను ఎప్పుడూ ముందుంటాడని ఒక 10 ఏళ్ల నెటిజన్ కామెంట్స్ చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
FIFA ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
Recommended image2
IND A vs SL A: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక ప్లేయర్స్.. దంబుల్లా మ్యాచ్‌లో మామూలు రచ్చ కాదు ఇది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved