- Home
- Sports
- Cricket
- IND A vs SL A: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక ప్లేయర్స్.. దంబుల్లా మ్యాచ్‌లో మామూలు రచ్చ కాదు ఇది!
IND A vs SL A: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక ప్లేయర్స్.. దంబుల్లా మ్యాచ్‌లో మామూలు రచ్చ కాదు ఇది!
Vaibhav Sooryavanshi fight : ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం భారత్, లంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఎందుకు ప్లేయర్లు గొడవపడ్డారు? ఏం జరిగింది?

ఉత్కంఠ పోరు.. చివరకు టై
ట్రై సిరీస్ లో సిరీస్‌లో భాగంగా దంబుల్లా లో శ్రీలంక ఏ, భారత్ ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ల మధ్య ఫైట్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు 49.2 ఓవర్లలో 265 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక ఏ జట్టు కూడా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి సరిగ్గా 265 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే, ఈ లోపే మ్యాచ్‌లో ఎన్నో వివాదాలు నడిచాయి. శ్రీలంక ఇన్నింగ్స్ ఆఖరి బంతికి వివాదాస్పద రన్ వచ్చింది. బ్యాటర్ షాట్ ఆడకపోయినా, బంతి ప్యాడ్‌కు తగిలి వెళ్లినా అంపైర్లు రన్ ఇచ్చారని ఇండియన్ కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో చాలా సేపు వాదించాడు.
వెలుతురు సమస్య.. సూపర్ ఓవర్ సస్పెన్స్
మ్యాచ్ టై అయిన తర్వాత మైదానంలో వెలుతురు తగ్గిపోవడంతో అసలు సూపర్ ఓవర్ జరుగుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ పెరిగింది. రూల్స్ ప్రకారం కండిషన్స్ బాగుంటేనే సూపర్ ఓవర్ ఆడాలి. దీనిపై తిలక్ వర్మ అంపైర్లతో సీరియస్ డిస్కషన్స్ పెట్టాడు. చివరకు ఇరు జట్ల కెప్టెన్లు ఒప్పుకోవడంతో సూపర్ ఓవర్‌కు అంపైర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టేడియంలో ఉన్న అభిమానుల అందరిలోనూ టెన్షన్ మొదలైంది.
నో బాల్ రచ్చ.. లంక ఇన్నింగ్స్‌లో ట్విస్టులు
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ 16 రన్స్ చేసింది. అయితే ఈ ఆరు బంతుల్లోనూ భారీ డ్రామా నడిచింది. అర్షద్ ఖాన్ వేసిన ఒక బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించగా భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో ఒక భారీ సిక్స్ కొట్టి ప్రెజర్ పెంచాడు. ఇక ఆఖరి బంతికి అవిష్క అవుట్ అవ్వడంతో ఇండియన్ ప్లేయర్స్ సంబరాలు చేసుకుంటూ గ్రౌండ్ వీడటం మొదలుపెట్టారు.
కానీ అంపైర్లు దాన్ని నో బాల్‌గా ప్రకటించడంతో అంతా మళ్లీ వెనక్కి రావాల్సి వచ్చింది. దీంతో లంక స్కోరు 16కు చేరింది. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో విప్రజ్ నిగమ్ పిచ్ డేంజర్ జోన్‌లోకి రెండుసార్లు పరిగెత్తడంతో భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ పడింది. ఇది కూడా మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
చేతులెత్తేసిన టీమిండియా యంగ్ స్టార్స్
గెలవడానికి 17 రన్స్ టార్గెట్‌తో ఇండియా తరఫున సూపర్ ఓవర్ ఆడటానికి వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్జ్ క్రీజులోకి వచ్చారు. లంక బౌలర్ కుగాతాస్ మాతులాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సూర్యాంశ్ మొదటి మూడు బంతుల్లో కేవలం 3 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత స్ట్రైక్‌లోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఒక బౌండరీ, రెండు రన్స్ తీసినా లాస్ట్ బాల్‌కు యార్కర్ పడటంతో మిస్ అయ్యాడు.
దీంతో భారత్ సూపర్ ఓవర్‌లో కేవలం 9 రన్స్ మాత్రమే చేసి, 7 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు మెయిన్ మ్యాచ్‌లో సూర్యాంశ్ షెడ్జ్ (66 బంతుల్లో 72), విప్రజ్ నిగమ్ (49 బంతుల్లో 51) హాఫ్ సెంచరీలతో రాణించి 8వ వికెట్‌కు 104 రన్స్ జోడించినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు వైభవ్ 14 బంతుల్లో 21 రన్స్ చేయగా, తిలక్ వర్మ 23, రుతురాజ్ గైక్వాడ్ 32 రన్స్ చేశారు. టోర్నీలో భారత్‌కు ఇది రెండో ఓటమి.
గ్రౌండ్‌లోనే తోపులాట.. సూర్యవంశీ ఫైట్
సూపర్ ఓవర్‌లో లంక గెలవగానే ఆ దేశ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ ముందుకొచ్చి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో లంక ప్లేయర్ విషన్ హలంబా గె, వైభవ్ దగ్గరకు వచ్చి ప్రొవోక్ చేస్తూ ఏదో అన్నాడు. దీంతో కోపం తట్టుకోలేకపోయిన యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అతడితో వాగ్వాదానికి దిగి, లంక ప్లేయర్‌ను గట్టిగా వెనక్కి తోసేశాడు.
హలంబా గె కూడా వైభవ్‌ను నెట్టాడు. గొడవ పెద్దదవుతున్న సమయంలో సూర్యాంశ్ షెడ్జ్ వెంటనే ఎంట్రీ ఇచ్చి వైభవ్‌ను పక్కకు లాక్కెళ్లాడు. మైదానం వీడి వెళ్తున్నప్పుడు కూడా వైభవ్ లంక ప్లేయర్స్ వైపు వేలు చూపిస్తూ కోపంగా మాట్లాడటం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుని కూల్‌గా మ్యాచ్‌ను ముగించారు.
🚨 HEATED ARGUMENT BETWEEN VAIBHAV AND SRI LANKA 🚨
Sri Lankan Players : This is not an IPL, this Int'l cricket 🧐
Vaibhav Sooryavanshi : This is not the end of the tournament, just a normal match 🤪
Sri Lankan started this and Vaibhav ended it 😳pic.twitter.com/QDNbFftd0t— Ajay Jadeja (@AjayJadeja171) June 15, 2026

