MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026: ఫ్రాన్స్ ఓడినా కైలియన్ ఎంబప్పేకి ఇంకా ఛాన్స్.. గోల్డెన్ బూట్ కోసం మెస్సీతో పోటీ

FIFA World Cup 2026: ఫ్రాన్స్ ఓడినా కైలియన్ ఎంబప్పేకి ఇంకా ఛాన్స్.. గోల్డెన్ బూట్ కోసం మెస్సీతో పోటీ

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీస్‌లో ఫ్రాన్స్ ఓడింది. కానీ, కెప్టెన్ కైలియన్ ఎంబప్పేకి గోల్డెన్ బూట్ గెలిచేందుకు మరో మ్యాచ్ రూపంలో లక్కీ ఛాన్స్ దక్కింది. గోల్డెన్ బూట్ కోసం మెస్సీతో పోటీ పడుతున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 15 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్రాన్స్ కల చెదిరింది.. కానీ ఎంబప్పే రేసులోనే !
Image Credit : Getty

ఫ్రాన్స్ కల చెదిరింది.. కానీ ఎంబప్పే రేసులోనే !

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. మూడోసారి వరల్డ్ కప్ టైటిల్ గెలవాలనే ఆ జట్టు కల చెదిరిపోయింది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్ 2-0 తేడాతో ఓడిపోయింది. దీంతో ఫ్రాన్స్ టోర్నీ నుంచి అవుట్ అయింది. కానీ ఆ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబప్పేకి మాత్రం ఒక గుడ్ న్యూస్ ఉంది.

ఫ్రాన్స్ ఓడిపోయినా, ఎంబప్పేకి గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ ఇంకా ఉంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ టీమ్ ఇంకొక మ్యాచ్ ఆడబోతోంది. ఆ మ్యాచ్‌లో ఎంబప్పే గనుక తన గోల్స్ సంఖ్యను పెంచుకుంటే, 2022 తర్వాత మళ్లీ 2026లో కూడా గోల్డెన్ బూట్ అవార్డును తన సొంతం చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెమీస్‌లో మ్యాజిక్ మిస్.. అయినా నంబర్-1
Image Credit : Getty

సెమీస్‌లో మ్యాజిక్ మిస్.. అయినా నంబర్-1

ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన కైలియన్ ఎంబప్పే, స్పెయిన్‌తో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. అయినప్పటికీ, గోల్డెన్ బూట్ రేసులో అతను అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీతో కలిసి ఇంకా నంబర్-1 ప్లేస్‌లోనే ఉన్నాడు.

అయితే సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత కూడా ఎంబప్పేకి గోల్స్ చేసే అవకాశం ఎలా వస్తుంది అనే డౌట్ చాలామందికి రావచ్చు. దానికి సమాధానం ఉంది. ఫ్రాన్స్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నా, వరల్డ్ కప్‌లో థర్డ్ ప్లేస్ కోసం జరిగే మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆడాల్సి ఉంటుంది.

35
బ్రాంజ్ మెడల్ ఫైట్.. జూలై 19న మ్యాచ్
Image Credit : Getty

బ్రాంజ్ మెడల్ ఫైట్.. జూలై 19న మ్యాచ్

27 ఏళ్ల కైలియన్ ఎంబప్పే ఇప్పటికే 2018లో ఒకసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అలాగే 2022 వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్ కూడా గెలుచుకున్నాడు. స్పెయిన్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్ పక్కన పెడితే, ఈ 2026 వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. టోర్నీలో 8 గోల్స్ చేసి మెస్సీకి గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఇప్పుడు ఫ్రాన్స్ టీమ్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ అంటే మూడో స్థానం కోసం జరిగే పోరు కోసం జూలై 19న గ్రౌండ్‌లోకి దిగనుంది. అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌లో ఓడిపోయే జట్టుతో ఫ్రాన్స్ తలపడుతుంది. టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌కు ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డు కోసం ఎంబప్పే ఈ మ్యాచ్‌లో టాప్ ప్లేస్‌ను కాపాడుకోవాలని చూస్తున్నాడు.

45
గోల్డెన్ బూట్ రేసులో టాప్ ఫైవ్ వీరే
Image Credit : AFP

గోల్డెన్ బూట్ రేసులో టాప్ ఫైవ్ వీరే

ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2026లో అత్యధిక గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్న ప్లేయర్స్ లిస్ట్ ఇలా ఉంది..

  1. కైలియన్ ఎంబప్పే (ఫ్రాన్స్) - 8 గోల్స్
  2. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) - 8 గోల్స్
  3. ఎర్లింగ్ హాలాండ్ (నార్వే) - 7 గోల్స్
  4. హ్యారీ కేన్ (ఇంగ్లాండ్) - 6 గోల్స్
  5. జూడ్ బెలింగ్‌హామ్ (ఇంగ్లాండ్) - 5 గోల్స్
55
ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ సెమీస్ హైలైట్స్
Image Credit : Getty

ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ సెమీస్ హైలైట్స్

స్పెయిన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ వరుస తప్పులతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఆ మ్యాచ్ హైలైట్స్ గమనిస్తే..

  • మ్యాచ్ 20వ నిమిషంలో ఫ్రాన్స్ డిఫెండర్ చేసిన పెద్ద తప్పు వల్ల స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది.
  • 22వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ మైకెల్ ఓయర్జబల్ ఆ పెనాల్టీని గోల్‌గా మార్చి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
  • హాఫ్ టైమ్ ముగిసే సరికి స్పెయిన్ 1-0 తో ముందంజలో ఉంది.
  • 58వ నిమిషంలో పెడ్రో పోరో సూపర్ ఫినిషింగ్‌తో స్పెయిన్‌ను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. దీంతో ఫ్రాన్స్ ఓటమి దాదాపు ఖాయమైంది.
  • 61వ నిమిషంలో లామిన్ యామల్ స్పెయిన్ తరపున మూడో గోల్ చేసినంత పని చేశాడు, కానీ రెఫరీ దాన్ని ఆఫ్ సైడ్‌గా ప్రకటించడంతో ఆ గోల్ రద్దయింది.
  • చివరికి స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
FIFA ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(53.0 ov)191/4
Day 2 - Session 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
Rohit Sharma: హిట్ మ్యాన్‌కు లాస్ట్ వార్నింగ్.. ఇంగ్లాండ్‌లో కొడితే ఓకే.. లేదంటే ప్యాకప్? బీసీసీఐ షాకింగ్ ప్లాన్
Recommended image2
Shubman Gill: కోహ్లీ వల్ల కాలేదు.. గిల్ చేసి చూపించాడు.. బర్మింగ్‌హామ్‌లో మనోడి నయా హిస్టరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved