MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: హిట్ మ్యాన్‌కు లాస్ట్ వార్నింగ్.. ఇంగ్లాండ్‌లో కొడితే ఓకే.. లేదంటే ప్యాకప్? బీసీసీఐ షాకింగ్ ప్లాన్

Rohit Sharma: హిట్ మ్యాన్‌కు లాస్ట్ వార్నింగ్.. ఇంగ్లాండ్‌లో కొడితే ఓకే.. లేదంటే ప్యాకప్? బీసీసీఐ షాకింగ్ ప్లాన్

Rohit Sharma: ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌ రోహిత్ శర్మకు అగ్నిపరీక్ష మారింది. ఈ 3 మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయితే టీమ్ నుండి డ్రాప్ చేసేందుకు బీసీసీఐ రెడీ అయినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. రోహిత్ శర్మ ఐసీసీ వరల్డ్ కప్ 2027 టోర్నీ ఆడతాడా లేదా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 14 2026, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోహిత్ శర్మ కెరీర్ ఎండ్ అయిపోయినట్లేనా? గంభీర్ మార్క్ స్కెచ్
Image Credit : X/@BCCI

రోహిత్ శర్మ కెరీర్ ఎండ్ అయిపోయినట్లేనా? గంభీర్ మార్క్ స్కెచ్

టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఇంగ్లాండ్‌తో మంగళవారం నుంచి జరగబోయే వన్డే సిరీస్ చాలా కీలకంగా మారింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ గనుక ఫెయిల్ అయితే, అతడిని జట్టు నుంచి శాశ్వతంగా పక్కన పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధంగా ఉన్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

39 ఏళ్ల రోహిత్ శర్మపై ప్రస్తుతం విపరీతమైన ప్రెజర్ ఉంది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో అతను కచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సెలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడరని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రొటేషన్ పాలసీ.. సీనియర్లకు తప్పని ముప్పు?
Image Credit : ANI

రొటేషన్ పాలసీ.. సీనియర్లకు తప్పని ముప్పు?

టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు ఏడాది పొడవునా పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు. అందుకే వారి స్థానాల్లో సరైన బ్యాకప్ ప్లేయర్లను రెడీ చేసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఇందులో భాగంగానే సీనియర్ ప్లేయర్లను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి రొటేట్ చేసేందుకు వారు మానసికంగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. గత నెల జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలోనే ఈ ప్లాన్ అమలు చేయాలని చూశారు. రోహిత్‌కు రెస్ట్ ఇచ్చి, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో గిల్ మూడో నంబర్‌కు వెళ్లగా, రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా వచ్చారు.

35
రేసులోకి యశస్వి జైస్వాల్.. గంభీర్ గ్రీన్ సిగ్నల్?
Image Credit : Getty

రేసులోకి యశస్వి జైస్వాల్.. గంభీర్ గ్రీన్ సిగ్నల్?

ఆ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అదిరిపోయే సెంచరీ కొట్టి సెలెక్టర్ల మనసు గెలుచుకున్నాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్‌లో జైస్వాల్ ఫిట్‌గా ఉన్నాడు. ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఫామ్ దెబ్బతింటే, అతని స్థానంలో జైస్వాల్‌ను ఓపెనర్‌గా పర్మనెంట్ చేసే ఆలోచనలో గంభీర్ అండ్ కో ఉన్నారు.

అయితే ఇదే తరహా ప్రెజర్ విరాట్ కోహ్లీపై కూడా ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ శుభ్‌మన్ గిల్ మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, కోహ్లీ, రోహిత్ ల ఎక్స్‌పీరియన్స్ టీమ్‌కు చాలా ప్లస్ అవుతుందని చెప్పాడు. ముఖ్యంగా ఆర్‌సీబీ స్టార్ కోహ్లీతో తాను 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్, టీమ్ కాంబినేషన్స్ గురించి ఇప్పటికే డిస్కస్ చేశానని గిల్ వెల్లడించాడు.

45
ఇంగ్లాండ్‌లో రోహిత్ రికార్డులు సూపర్.. కానీ
Image Credit : Getty

ఇంగ్లాండ్‌లో రోహిత్ రికార్డులు సూపర్.. కానీ

రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టగానే ఫామ్‌లోకి రావడం కాదు, సిరీస్ మొదటి మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. అయితే ఇంగ్లాండ్‌లో రోహిత్‌కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. అక్కడ అతను 1428 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 64.91 కాగా, స్ట్రైక్ రేట్ 90.78గా ఉంది. ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ పాత రికార్డులు రోహిత్‌కు కాస్త ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, ప్రస్తుత ఫామ్, బీసీసీఐ పెట్టిన డెడ్‌లైన్ అతడికి కత్తిమీద సాములా మారాయి.

55
నాయర్ సపోర్ట్.. బుమ్రా, కుల్దీప్‌ల రీఎంట్రీ
Image Credit : Getty

నాయర్ సపోర్ట్.. బుమ్రా, కుల్దీప్‌ల రీఎంట్రీ

మరోవైపు మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ రోహిత్ శర్మకు సపోర్ట్‌గా నిలిచాడు. రోహిత్ రాకతో ఇండియా బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ అవుతుందని జియోస్టార్‌తో అన్నాడు. షార్ట్ పిచ్ బాల్స్‌ను రోహిత్ చాలా ఈజీగా ఆడతాడని, అతని ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇంగ్లాండ్ టీమ్ తమ బౌలింగ్ స్ట్రాటజీని మార్చుకోవాల్సి వస్తుందని చెప్పాడు.

అలాగే జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీపై మాట్లాడుతూ.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమని, ఈ మూడు మ్యాచ్‌లలో బుమ్రాను రెండు మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడించకూడదని సూచించాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ తగినంత సెక్యూరిటీ ఇస్తే, ఇంగ్లాండ్ కండిషన్స్‌లో అతను మరింత ప్రమాదకరంగా మారుతాడని నాయర్ అభిప్రాయపడ్డాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రోహిత్ శర్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? నెట్ ప్రాక్టీస్‌లో బయటపడ్డ అసలు సీన్ !
Recommended image2
IND vs ENG: కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved