MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • Aavakaya: ఆవకాయ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? అయితే ఈ తప్పు చేయోద్దు

Aavakaya: ఆవకాయ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? అయితే ఈ తప్పు చేయోద్దు

Aavakaya: అమ్మ, ఆవకాయ బోర్ కొట్టదు. కానీ మనమే దాని అసలు స్వభావాన్ని చంపేస్తున్నాం. ఆవకాయ తయారీలో పాతకాలపు సంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టేసి వాటి రుచిని నాశనం చేస్తున్నారు.  

2 Min read
Author : Nandini Arava
Published : Apr 18 2026, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమ్మ, ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టదు
Image Credit : Asianet News

అమ్మ, ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టదు

అమ్మ, ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టదు. తరాలు మారినా వాటికుండే గొప్పదనమే వేరు. మన తెలుగువారి ఇళ్లల్లో ఎన్ని కూరలున్నా చివరగా ఒక ముద్ద ఆవకాయ అన్నం లేకపోతే భోజనం పూర్తి కాదు. వేడివేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి కలుపుకుని తింటే.. అబ్బ చెప్తుంటేనే నోరూరిపోతుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు.. మామిడి కాయతో రకరకాల పచ్చళ్లు చేసుకుంటారు. మాగాయ, ఆవకాయ, పెసరావకాయ, తీపి ఆవకాయ...ఇలా బోల్డెన్ని వెరైటీస్ చేసుకుంటారు. జాడీల్లో పెట్టుకుని ఏడాది పొడవునా తింటారు. ఇంట్లో ఆవకాయ పెట్టారంటే అదో పండగలా ఉంటుంది. దానికి మంచిగా ఎండ తగలనిచ్చి, ఫెర్మెంట్ అయ్యాక అందులో ఉండే నూనె, కారాలు, ఉప్పు, ఆవపిండిలో ముక్కలు ఊరాక తింటే...ఎంత రుచిగా ఉంటుందో. ఎంత ఎక్కువ నిల్వ ఉంటే అంత రుచి దానికి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఊరగాయ విధానంలో ఎన్నో మార్పులు
Image Credit : pinterest

ఊరగాయ విధానంలో ఎన్నో మార్పులు

ఆవకాయ పెట్టిందే ఫెర్మెంట్ అయి గుడ్ బ్యాక్టీరియా తయారవ్వడానికి. కానీ, ఈ మధ్య కాలంలో మన ఊరగాయ విధానంలో ఎన్నో మార్పులు వచ్చేశాయి . ఒకప్పుడు వంటింటి గూట్లో ఉండేజాడీలు మాయపోయాయి. ఇప్పుడు పెట్టుకున్న ఆవకాయను డబ్బాల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. ఫ్రిడ్జ్ లో ఊరగాయలను పెడితే అవి వాటి రుచిని కోల్పోతాయి. ఫ్రిడ్జ్ లో పెట్టి మనమే అసలు రుచిని చంపేస్తున్నాం. 

35
రోజులు గడిచేకొద్దీ ఆవకాయకు ఆ ఘాటైన రంగు, రుచి
Image Credit : pinterest

రోజులు గడిచేకొద్దీ ఆవకాయకు ఆ ఘాటైన రంగు, రుచి

పాత కాలంలో మన నాన్నమ్మలు, అమ్మమ్మలు.. ఊరగాయలు పెట్టినప్పుడు ఫ్రిజ్‌లు లేవు. అయినా అవి ఏడాది పొడవునా పాడవకుండా ఉండేవి. దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. ఊరగాయలో మనం వాడే ఉప్పు, ఆవపిండి, నూనె.. ఇవి కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అవి సహజసిద్ధమైన 'ప్రిజర్వేటివ్స్'. నూనె ఒక పొరలా ఏర్పడి గాలి తగలకుండా చేస్తుంది. ఉప్పు బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఊరగాయ 'ఫెర్మెంటేషన్' అవుతుంది. ఈ ప్రక్రియ వల్లనే రోజులు గడిచేకొద్దీ ఆవకాయకు ఆ ఘాటైన రంగు, రుచి వస్తాయి.

45
ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది?
Image Credit : gemini

ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది?

చాలామంది రంగు మారుతుందనో, బూజు పడుతుందనో భయపడి ఊరగాయను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆ ముక్క నూనెను సరిగ్గా పీల్చుకోదు. ఫలితంగా మసాలాలన్నీ ముక్కకు పట్టకుండా విడివిడిగా ఉంటాయి. అంతేకాదు, ఫ్రిజ్ లోని తేమ వల్ల బయటకు తీసినప్పుడు ఊరగాయ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి, బయట ఉంచిన ఊరగాయలో ఉండే 'ప్రోబయోటిక్' గుణాలు ఫ్రిజ్‌లో ఉంచిన దానికంటే మెరుగ్గా ఉంటాయి.

55
నీరు తగలకూడదు
Image Credit : pinterest

నీరు తగలకూడదు

ఊరగాయ తీసేటప్పుడు వాడే చెంచా కచ్చితంగా పొడిగా ఉండాలి. ఒక్క చుక్క నీరు పడినా పచ్చడి పాడవుతుంది. జాడీలో పచ్చడి పైన కనీసం ఒక అంగుళం మేర నూనె తేలుతూ ఉండాలి. ఇది గాలి చొరబడకుండా చేస్తుంది. పెద్ద జాడీని పదే పదే తెరవకుండా, నెలకు సరిపడా పచ్చడిని చిన్న గాజు సీసాలోకి తీసుకుని వాడుకోవడం ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image2
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Recommended image3
Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Pickle Preservation: అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు పాటిస్తే.. ఏడాది పాటు ఊరగాయ నిల్వ
Recommended image2
Egg Pickle: కోడిగుడ్డు పచ్చడి ఇలా సింపుల్‌గా చేసేయండి, నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved