Sabudana: సాబుదానా వీళ్లకు మాత్రం మంచిది కాదు.. దీన్ని ఒకవేళ తింటే ఈ సమస్యలు తప్పవు
Sabudana: సాబుదానాను చాలా మంది ఎంతో ఇంష్టంగా తింటుంటారు. నిజం చెప్పాలంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంతమందికి మాత్రం కాదు. దీన్ని తినడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాబుదానా ఎవరు తినకూడదు?
సాబుదానా మంచి హెల్తీ ఫుడ్. దీనిలో పిండి పదార్థాలు మెండుగా ఉంటాయి. దీన్ని తింటే మన శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. దీనిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో స్వీట్ రెసిపీలతో పాటుగా ఎన్నో రకాల ఆహారాలను చేసుకుని తింటుంటారు. కానీ కొంతమందికి సాబుదాన అస్సలు మంచిది కాదు. సాబుదానా వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అసలు ఎవరు సాబుదానాను ఎవరు తినకూడదు? తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సాబుదానాను ఎవరు తినకూడదు?
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు
మూత్రపిండాల్లో రాళ్లు,ఇతక కిడ్నీ వ్యాధులు ఉన్నవారు సాబుదానాను అస్సలు తినకూడదంటారు. ఎందుకంటే దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీల్లోని రాళ్లను మరింత పెంచుతుంది. అలాగే దీనిలో ఫైబర్ తక్కువగా, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాబుదానా కిడ్నీలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి మీకూ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఉపవాసం అయినా ఏ సమయంలో అయినా సాబుదానాను తినకపోవడమే మంచిది.
షుగర్ ఉన్నవారు
షుగర్ ఉన్నవారు కూడా సాబుదానాను తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అలాగే దీనిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది డయాబెటీస్ ను కంట్రోల్ చేయలేదు.
షుగర్ ఉన్నవారికి ఇది అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మీరు నవరాత్రి ఉపవాసం ఉన్నట్టైతే దీన్ని మాత్రం తినకండి. మీరు తినాలనుకుంటే రాగి పిండి, బుక్వీట్ వంటివి తినండి. ఇవి వెంటనే రక్తంలో చక్కెరను పెంచవు.
జీర్ణ సమస్యలు ఉన్నవారు
సబుదానా తేలికగా, తేలికగా అనిపించినా ఇది జీర్ణ క్రియ నెమ్మదిగా ఉన్నవారికి కడుపు అసౌకర్యం ఉన్నవారికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.కానీ ఫైబర్ తక్కువగా ఉంటుంది.
కాబట్టి దీన్ని జీర్ణ సమస్యలు ఉన్నవారు తింటే అపానవాయువు, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఈ సమస్యలు ఉంటే మరింత ఎక్కువ అవుతాయి.
బీపీ తక్కువగా ఉన్నవారు
బీపీ తక్కువగా ఉన్నవారు కూడా సాబుదానాను తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ మీకు ఇప్పటికే రక్తపోటు తక్కువగా ఉంటే గనుక మీ బీపీ మరింత తగ్గుతుంది. దీనివల్ల మీకు బలహీనత, మూర్చ, మైకం వంటి సమస్యలు వస్తాయి. బీపీ తక్కువగా ఉన్నవారు ఉపవాసంలో ఉప్పు, నీళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు
బరువు తగ్గాలనుకునే వారు కూడా సాబుదానాను తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, ఫైబర్ తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీటిని తింటే బరువు పెరగడమే తప్ప తగ్గడమంటూ ఉండదు. దీన్ని తిన్నా మీకు వెంటనే ఆకలి అవుతుంది. దీన్ని ఎక్కువగా తింటే తొందరగా బరువు పెరుగుతారు.