Milk: పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే ఏమౌతుందో తెలుసా?
Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. పాలను తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కానీ పాలను పదే పదే వేడి చేసి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే?
చాలా మంది ఇండ్లలో పిల్లలు, పెద్దలు ప్రతిరోజూ పాలను తాగుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో 24 గంటలూ పాలు ఉంటాయి. ప్యాకెట్ పాలు, ఆవు పాలు ఇలా వారి సౌకర్యాన్ని బట్టి ఇంట్లో తెచ్చిపెడుతుంటారు. ఇక ఇంట్లో ఎప్పుడూ పాలు ఉండటం వల్ల పాలను ఎప్పుడు పడితే అప్పుడు పాలను వేడి చేసుకుని తాగుతుంటారు. మళ్లీ ప్రిజ్ లో పెట్టేస్తుంటారు.
పాలను పదే పదే వేడి చేయడం మంచిదేనా?
పాలను మీరు ఉపయోగించి ప్రతిసారీ వేడి చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలను వేడి చేయడం వల్ల అవి పాడవవు. అందుకే వేడి చేస్తుంటాం అని చాలా మంది అంటుంటారు. కానీ పాలను మళ్లీ మళ్లీ మరిగించడం మంచిది కాదు.
పదే పదే వేడి చేసిన పాలను తాగడం వల్ల వచ్చే సమస్యలు
పాలను ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల వాటిలో కొన్ని హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి రక్త నాళాలను గట్టిపరుస్స్తాయి. ఇలా పాలను తాగితే ఎర్ర రక్తకణాలు గట్టిపడి వాటి స్థితిస్థాపకత దెబ్బతింటుంది. అంతేకాదు రక్త ప్రసరణ కూడా సరిగ్గా ఉండదు. దీంతో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి కాలెయ వాపు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి.
పాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే?
పాలను పదే పదే వేడి చేయడం, వాటిని చల్లార్చి తాగడం వల్ల పాలలో ఉండే పోషకాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. పాలను పదే పదే వేడి చేయడం వల్ల పాలలోని విటమిన్లు, ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ డి లు తగ్గుతాయి. ఇలాంటి పాలను తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలగదు.