MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • వీళ్లు మాత్రం క్యారెట్లు తినకూడదు

వీళ్లు మాత్రం క్యారెట్లు తినకూడదు

క్యారెట్లు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ వీటిని చలికాలంలో కొంతమంది అస్సలు తినకూడదు. ఎందుకు? వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 29 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సీజన్ కు తగ్గట్టు మన ఆహారపు అలవాట్లను ఖచ్చితంగా మార్చుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా చలికాలంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 

చలికాలంలో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలనే తినాలి. ఈ సీజన్ లో మార్కెట్ లో రకరకాల కూరగాయలు దొరుకుతాయి. ఇవన్నీ మన రోజువారి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. సీజనల్ కూరగాయల్లో విటమిన్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కూరగాయల్లో క్యారెట్లు ఒకటి. నిజానికి క్యారెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా, వారంలో మూడు నాలుగు సార్లు వండుకుని తింటుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

క్యారెట్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ.. వీటిని కొంతమంది మాత్రం అస్సలు తినకూడదు. అవును ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. కొంతమంది మాత్రం తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎవరు చలికాలంలో క్యారెట్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

37

చలికాలంలో క్యారెట్ ను ఎవరు తినకూడదు 

కడుపు సమస్యలున్న వారు

కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు చలికాలంలో క్యారెట్లను అస్సలు తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కడుపులో ఏదైన సమస్య ఉన్నవారు క్యారెట్లను తింటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్యారెట్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపునకు మంచిది కాదు. ఒకవేళ ఈ సీజన్ లో క్యారెట్లను తిన్నా తక్కువగా తినాలి. లేదంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

47

డయాబెటిస్ ఉన్నవారు

డయాబెటీస్ పేషెంట్లు చలికాలంలో క్యారెట్లను తినకపోవడమే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే క్యారెట్లలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అందుకే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే వీళ్లు క్యారెట్లను తినాలి. 

57

అలెర్జీ సమస్యలున్నవారు

చర్మ అలెర్జీ ఉన్నవారు కూడా క్యారెట్లను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొంతమందికి క్యారెట్లను తిన్నా అలెర్జీ వస్తుంది. దీనివల్ల శరీరంపై దద్దుర్లు ఏర్పడటం, దురద పెట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ మీకు కూడా ఈ సమస్య ఉంటే క్యారెట్లను తినకపోవడమే మంచిది. వీళ్లు క్యారెట్లను ఎప్పుడూ కూడా ఎక్కువగా తినకూడదు. 

67

పాలిచ్చే తల్లులు

ఆరోగ్య నిపుణుల  ప్రకారం.. పాలిచ్చే తల్లులు కూడా క్యారెట్లను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే క్యారెట్లను ఎక్కువగా తింటే తల్లిపాల రుచి మారుతుందట. అలాగే దీనివల్ల తల్లికి, బిడ్డకు సమస్యలు కూడా వస్తాయట. 

77

నిద్రలేమి సమస్యలున్నవారు:

నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.దీనివల్ల వీరు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేరు. ఇలాంటి వారు కూడా క్యారెట్లను ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్యారెట్లలోని పసుపు భాగం వేడిగా ఉంటుంది. ఇది మన కడుపులోకి వెల్లగానే కడుపులో మంట కలుగుతుంది. దీంతో మీకు నిద్రపట్టదు. అందుకే మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే దీన్ని చలికాలంలో తక్కువగా తినాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved