Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Food
  • పైనాపిల్ ను ఇప్పుడు తింటేనే మంచిది

పైనాపిల్ ను ఇప్పుడు తింటేనే మంచిది

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీర మంటను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.  

Mahesh Rajamoni | Published : Jun 11 2023, 02:55 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

పైనాపిల్ ఎండాకాలంలో తినడానికి అనువైన పండు. పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పైనాపిల్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
 

25
Asianet Image

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని, ప్రాణాంతకమైన రోగాల నుంచి రక్షిస్తుందని, మంటను తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

35
Asianet Image

పైనాపిల్ లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి 6, కాపర్, థయామిన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, రిబోఫ్లేవిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ లో ఫాస్పరస్, జింక్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ విటమిన్ సి కి గొప్ప వనరు. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పోషకం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

45
Asianet Image

విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న పైనాపిల్ పండులో 452 కేలరీలు, 119 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 13 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల పోటిన్లు ఉంటాయి. పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎన్నోఅధ్యయనాలు పైనాపిల్ లోని బ్రోమెలైన్ తో సహా సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచిస్తున్నాయి. పైనాపిల్ ను బ్రేక్ ఫాస్ట్ గా లేదా ఈవెనింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

55
Asianet Image

బరువు తగ్గాలనుకునే వారికి కూడా పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది. పైనాపిల్ లో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆహారం
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories