బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా కాపాడే కూరగాయలు ఇవి..
డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే ఎన్నో సమస్యలొస్తాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతాయి. అవేంటంటే?
పుట్టిన పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే పరిస్థితి. ఈ డయాబెటీస్ కంట్రోల్ లో ఉండాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అవేంటంటే..
మునగాకులు
మునగాకులు కూడా డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకులను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
బచ్చలికూర
బచ్చలికూర కూడా మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. బచ్చలికూరలో ఫైబర్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బచ్చలికూరను తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
బ్రోకలీ
బ్రోకలీ మంచి పోషకాల వనరు. దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని మధుమేహులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది.
cucumber
కీరదోసకాయ
కీరదోసకాయను కూడా మధుమేహులు తినొచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కీరదోసకాయను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడమే కాకుండా.. శరీరం హైడ్రేట్ గా కూడా ఉంటుంది. ఇది ఎండాకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
టమాటాలు
టమాటాలను మనం ప్రతి ఒక్క కూరలో వేస్తుంటాం. ఫైబర్ పుష్కలంగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే టమాటాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే మధుమేహులు కూడా టమాటాలను రోజూ తినొచ్చు.
papaya
బొప్పాయి
పచ్చి బొప్పాయి, బొప్పాయి పండు, బొప్పాయి ఆకులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా బొప్పాయి మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది.