MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
  • Home
  • Life
  • Food
  • Kitchen tips: ఇలా చేస్తే ఇడ్లీ, దోశ పిండి అస్సలు పులిసిపోదు!

Kitchen tips: ఇలా చేస్తే ఇడ్లీ, దోశ పిండి అస్సలు పులిసిపోదు!

మనం ఇంట్లో ఎక్కువగా చేసే టిఫిన్లలో ఇడ్లీ, దోశ ముందు వరుసలో ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగా తింటారు. తొందరగా జీర్ణం అవుతాయి కాబట్టి వారంలో రెండు, మూడుసార్లు ఈ టిఫిన్లనే చాలామంది చేస్తుంటారు. అయితే  వేసవి కాలంలో ఇడ్లీ, దోశ పిండి తొందరగా పులిసిపోతుంటుంది. మరి ఎక్కువ రోజులు ఈ పిండిని ఫ్రెష్ గా ఎలా ఉంచుకోవాలో ఇక్కడ చూద్దాం

2 Min read
Author : Kavitha G
Published : Apr 24 2025, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా చాలామంది ఇడ్లీ, దోశ బ్యాటర్ ను ఎప్పుడూ స్టాక్‌లో ఉంచుకుంటారు. కానీ ఎండాకాలంలో మాత్రం ఈ బ్యాటర్ ను నిల్వ చేయడం కాస్త కష్టమైన పని. ఇంకా ఫ్రిజ్ లేకపోతే ఒక్క రోజులోనే దాని పని అయిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాటర్ పులియకుండా ఏం చేయాలి?

బ్యాటర్ పులియకుండా ఏం చేయాలి?

సాధారణంగా ఇడ్లీ, దోశ బ్యాటర్ మూడు రోజుల వరకు పులిసిపోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. కొందరి ఇళ్లలో వారం రోజులైనా పులిసిపోదు. అది ఎలాగో మీకు తెలుసా? అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

35
పిండి పులిసిపోకుండా ఇలా చేయండి!

పిండి పులిసిపోకుండా ఇలా చేయండి!

-బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టకుండా 3 నుంచి 4 గంటలు మాత్రమే నానబెట్టండి. ఎక్కువసేపు నానబెడితే బ్యాటర్ త్వరగా పులిసిపోతుంది.

- మినప్పప్పు త్వరగా నానిపోతుంది కాబట్టి ఒక గంట మాత్రమే నానబెడితే సరిపోతుంది.

- పిండిని రుబ్బుకునే ముందు గ్రైండర్‌ను శుభ్రంగా కడగాలి. లేకపోతే ముందు రుబ్బిన పిండి పులుపు గ్రైండర్‌లో ఉండిపోతుంది.

45
పప్పు రుబ్బుతున్నప్పుడు...

పప్పు రుబ్బుతున్నప్పుడు...

- పిండిని ఎక్కువసేపు రుబ్బకూడదు. చాలామంది బ్యాటర్ రుబ్బుతున్నప్పుడు వంటింట్లో ఇతర పనులు చేస్తూ ఉంటారు. అలా ఎక్కువసేపు రుబ్బితే గ్రైండర్ వేడెక్కుతుంది. ఆ వేడి వల్ల బ్యాటర్ త్వరగా పులిసిపోతుంది.

- మినప్పప్పును రుబ్బుతున్నప్పుడు తరచుగా నీళ్లు చిలకరిస్తే 20-25 నిమిషాల్లోనే పొంగుతుంది. అలాగే బియ్యాన్ని కూడా సరైన సమయంలో రుబ్బుకోవాలి.

- కొందరు బియ్యం, మినప్పప్పును కలిపి రుబ్బుతారు. కానీ బ్యాటర్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే బియ్యం, మినప్పప్పును విడివిడిగా రుబ్బుకోవాలి. కలిపి రుబ్బకూడదు.

55
ఉప్పు ఎప్పుడు వేయాలో తెలుసా?

ఉప్పు ఎప్పుడు వేయాలో తెలుసా?

- బ్యాటర్ రుబ్బుతున్నప్పుడు చేతులతో కాకుండా ప్లాస్టిక్ లేదా చెక్క గరిటెను ఉపయోగించండి. చేతులతో రుబ్బితే శరీర వేడి వల్ల త్వరగా పులిసిపోతుంది.

- రుబ్బిన తర్వాత ఉప్పు వేసి కలపకూడదు. ఉప్పు వేయకుండా మూత పెట్టి ఉంచండి. బ్యాటర్ రుబ్బిన తర్వాత 3 గంటలు బయట ఉంచి.. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టండి.

- అవసరమైనప్పుడు మాత్రమే తీసి ఉపయోగించండి. చేతులతో కాకుండా గరిటెతో తీసుకోండి. తీసిన బ్యాటర్ లో ఉప్పు వేసుకోండి.

- ఫ్రిజ్ లేకపోతే పెద్ద గిన్నెలో బ్యాటర్ ను పెట్టి, దానిలో చిన్న గిన్నెను ఉంచండి. దీనివల్ల అది త్వరగా పులియదు. బ్యాటర్ రుబ్బిన తర్వాత అరటి ఆకుతో మూత పెట్టాలి. ఇలా చేస్తే రెండు రోజులు పిండి పులియకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved