MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మీరు కొన్న గోధుమ పిండికి కల్తీ అయ్యిందా? లేదా ? అని ఎలా తెలుసుకోవాలంటే?

మీరు కొన్న గోధుమ పిండికి కల్తీ అయ్యిందా? లేదా ? అని ఎలా తెలుసుకోవాలంటే?

మనం తినే ప్రతి ఫుడ్ కల్తీ అవుతూనే ఉంది. కానీ మనకు ఏవి కల్తీ అయ్యాయో, ఏవి కాలేదో గుర్తించడం తెలియదు. కానీ కల్తీ వాటిని తింటే మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి గోధుమ పిండి కల్తీ అయ్యిందా? కాలేదా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 08 2024, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ రోజుల్లో జొన్న రొట్టె కంటే గోధుమ చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. నిజానికి గోధుమ చపాతీలు కూడా ఆరోగ్యానికి మంచివే. గోధుమ పిండిలో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. రోజూ గోధుమ చపాతీని తినడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. 

అయితే గోధుమ పిండి కూడా కల్తీ అవుతుందన్న ముచ్చట మీకు తెలుసా? అవును చాలా మంది గోధుమ పిండిలో పొట్టును కలుపుతారు. దీనివల్ల పిండి నాణ్యత తగ్గుతుంది. అలాగే ఈ పిండిలో పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి.

నిజానికి ఈ గోధుమ పొట్టులో ఫైబర్ కంటెంట్ ఉంటుది. కానీ దీనిలో నాణ్యత లేని పొట్టునే కలుపుతారు. దీనివల్ల చపాతీల రుచి తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అందుకే గోధుమ పిండి కల్తీ జరిగిందా? లేదా?అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పిండిలో పొట్టును ఎందుకు కలుపుతారు?

 మీకు తెలుసా? స్వచ్ఛమైన గోధుమ పిండి కంటే పొట్టే చాలా తక్కువ ధర ఉంటుంది. అందుకే వ్యాపారులు గోధుమ పిండిలో దీనిని కలుపుతారు. ఈ పొట్టు వల్ల పిండి బరువు పెరుగుతుంది. అలాగే వారి ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే కల్తీ పిండి కూడా స్వచ్ఛమైన పిండి లాగే కనిపిస్తుంది. అందుకే దీనిని గుర్తించడం చాలా కష్టం. కానీ ఈ పద్దతిలో సరఫరాదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుతారు. 
 

34

పిండిలో పొట్టును ఎలా గుర్తించాలి?

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం.. గోధుమ పిండి స్వచ్ఛతను చెక్ చేయడానికి ఒక సులువైన మార్గం ఉంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ముందుగా ఒక గ్లాసులో నీళ్లను తీసుకుని అందులో కొంచెం గోధుమ పిండిని వేయండి.

స్వచ్ఛమైన పిండిలో పొట్టు కొంచమే నీటి పైన తేలుతూ కనిపిస్తుంది. కానీ అదే పిండిలో చాలా పొట్టు నీళ్లపై తేలుతున్నట్టైతే అది కల్తీ జరిగిందని అర్థం. ఇలాంటి పిండిలో పెద్ద మొత్తంలో పొట్టును కలిపారని అర్థం చేసుకోవాలి. 

44

జీర్ణక్రియను దెబ్బతీస్తుంది

పొట్టు ఎక్కువగా కలిపిన గోధుమ పిండి చపాతీలు తింటే మీ జీర్ణ సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు దీని ద్వారా మీకు చాలా తక్కువ పోషకాలు అందుతాయి. ఇలాంటి పిండితో చేసిన చపాతీ రుచి, ఆకృతి మారుతాయి. ఇలాంటి చపాతీ గట్టిగా, కొద్దిగా చేదుగా ఉంటుంది. 

ఎక్కువ మొత్తంలో పొట్టును తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అపానవాయువు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలకు సున్నితంగా ఉన్నవారికి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mustard Oil: అమెరికాలో ఆవనూనె వంటకు ఎందుకు వాడరు? మన దగ్గర ఎందుకు ఆ ఆంక్షలు లేవు?
Recommended image2
Chicken : స్కిన్డ్ చికెన్ vs స్కిన్ లెస్ చికెన్.. ఏది తినడం హెల్త్ కి బెటరో తెలుసా?
Recommended image3
Jaggery Storage: బెల్లం బూజు పడుతోందా? ఇలా చేస్తే ఏడాదైనా పాడవ్వదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved