థైరాయిడ్ ఉన్నవారు ఇవి తింటే మంచిది
కేవలం షుగర్ పేషెంట్లు మాత్రమే కాదు.. థైరాయిడ్ పేషెంట్లు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే థైరాయిడ్ ఉన్నవారికి కొన్ని ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే థైరాయిడ్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యం బేషుగ్గా కూడా ఉంటుంది.

థైరాయిడ్
సమయానికి తినడానికి సమయం కూడా లేనంత బిజీగా ఉంటున్నారు ఈ కాలం మనుషులు. ఈ బిజీవల్లే నేటి కాలంలో చాలా మంది లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు నేటికాలంలో సర్వసాధారణమైపోయాయి. దీనికి అసలు కారణం చెడు ఆహారాలను తినడం. అలాగే శారీరక శ్రమ అసలే లేకపోవడం. మీకు తెలుసా? మనం తినే ఆహారం సరిగ్గా లేనప్పుడు మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది.
థైరాయిడ్
ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో పాటుగా థైరాయిడ్ కూడా సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ వ్యాధి చాలా చిన్న సమస్యగా కనిపించినా దీనివల్ల శరీరం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ ఉన్నవారు మెడిసిన్ వాడటంతో పాటుగా మంచి పౌష్టికాహారాన్ని తినాలి. అలాగే జీవనశైలి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడంతో పాటుగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవేంటంటే
థైరాయిడ్ ను అదుపులో ఉంచే ఆహారాలు
అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు
అయోడిన్ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి చాలా చాలా అవసరం. మీకు తెలుసా? ఎవరి శరీరంలో అయితే అయోడిన్ తక్కువగా ఉంటుందో వారికి హైపోథైరాయిడిజం వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ సాయంత్రం వేళ థైరాయిడ్ పేషెంట్లు గుడ్లు, చేపలు, పెరుగు వంటివి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి
పచ్చి కొబ్బరి టేస్టీగా ఉండటంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు ఇది థైరాయిడ్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొబ్బరిని తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. ఇందుకోసం మీరు పచ్చి కొబ్బరిని అలాగే తినొచ్చు. కావాలనుకుంటే లడ్డూ, చట్నీ కూడా తినొచ్చు. పచ్చి కొబ్బరి మన జీవక్రియను సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఆపిల్ పండు
ఆపిల్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఒక మెడిసిన్ లాగే పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది థైరాయిడ్ పేషెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ ఒక అరటిపండును తింటే థైరాయిడ్ రిస్క్ తగ్గుతుంది. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. అంతేకాదు ఇది బ్లడ్ షుగర్ ను నార్మల్ గా ఉంచడానికి సహాయపడుతుంది.
ఉసిరి
ఉసిరిని తింటే మనం ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొచ్చు. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది థైరాయిడ్ పేషెంట్లకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం థైరాయిడ్ ఉన్నవాళ్లు ఉసిరికాయ పొడిని తేనెలో కలిపి ఉదయాన్నే తినొచ్చు. లేదా ఉసిరికాయ రసాన్ని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగొచ్చు. లేదా ఉసిరిని అలాగే తినొచ్చు.
ఆకుపచ్చ కూరగాయలు
థైరాయిడ్ ను కంట్రోల్ చేయడానికి ఆకుపచ్చని కూరగాయలు కూడా ఉపయోగపడతాయి. ఈ గ్రీన్ వెజిటేబుల్స్ మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే థైరాయిడ్ తగ్గుతుంది. అలాగే థైరాయిడ్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు ఇవి మీ శరీరంలో పోషకాల లోపాన్ని కూడా లేకుండా చేస్తాయి.
థైరాయిడ్ ఉంటే వేటిని తినకూడదు
థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు కొన్నింటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ప్రాసెస్ చేసిన ఆహారాలను లిమిట్ లోనే తినాలి. అలాగే కేకులు, కుకీలు, చిప్స్ వంటివి అస్సలు తినకూడదు.