బీపీ తగ్గాలంటే ఈ కూరగాయలను తినండి
అధిక రక్తపోటు సమస్య మనం అనుకున్నంత చిన్న సమస్యేం కాదు. ఎందుకంటే దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల కూరగాయలను తింటే అధిక రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
blood pressure
ఒకప్పుడు ఈ అధిక రక్తపోటు సమస్య 40,50 ఏండ్లు పై బడిన వారికి మాత్రమే వచ్చేది. ఇదిప్పుడు పిల్లలు, యుక్తవయసు వారు కూడా ఈ రోగం బారిన పడుతున్నారు. దీన్ని చిన్న సమస్యే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అధిక రక్తపోటు వల్ల మన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఈ హైబీపీ గుండెపోటు, స్ట్రోక్ వంటి రోగాలకు దారితీస్తుంది. మానసిక ఒత్తిడి, మారిన జీవనశైలి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్, ఊబకాయం, మద్యపానం వంటివి అలవాట్లు రక్తపోటు పెరగడానికి దారితీస్తాయి. ఈ అధిక రక్తపోటును నియంత్రించడానికి మీ రోజువారి ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల కూరగాయలు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
బచ్చలికూర
బచ్చలికూర పోషకాలకు మంచి వనరు. బచ్చలికూరను తింటే మనలో ఐరన్ లోపం పోతుంది. కాల్షియం అందుతుంది. ఒక్కటేమిటీ ఈ ఆకు కూర మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. ఈ కూరలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ లు మెండుగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే హైబీపీ పేషెంట్లు దీన్ని తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
beetroot juice
బీట్ రూట్
బీట్ రూట్ మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ జాబితాలో బీట్ రూట్ రెండో స్థానంలో ఉంది. బీట్ రూట్ లో నైట్రేట్స్ ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడానికి మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
క్యారెట్లు
క్యారెట్లు కళ్లకే కాదు మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో బీటా కెరోటిన్, ఫైబర్ లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కూడా అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం మీరు క్యారెట్ రసాన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. క్యారెట్ అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అధిక రక్తపోటును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, దగ్గును, గొంతునొప్పిని తగ్గించడానికి, లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
Tomatoes
టమాటాలు
టమాటాలు లేని కూర అసలే ఉండదు. కానీ ఇవి మనకు చేసే మేలు చాలా తక్కువ మందికే తెలుసు. 100 గ్రాముల టమాటాల్లో 237 మిల్లీగ్రాముల పొటాషియం కంటెంట్ ఉంటుంది. అంతేకాదు టమాటాల్లో లైకోపీన్ కూడా ఉంటుంది. అందుకే ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
బ్రోకలీ
బ్రకలీలో కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. బ్రోకలీలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.