MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair care: చలికాలంలో జుట్టుకు ఏ నూనె మంచిది? ఆవ నూనె, కొబ్బరి నూనె? నూనె రాయకపోయినా పర్లేదా?

Hair care: చలికాలంలో జుట్టుకు ఏ నూనె మంచిది? ఆవ నూనె, కొబ్బరి నూనె? నూనె రాయకపోయినా పర్లేదా?

Hair care: చలికాలంలో జుట్టు పొడిబారడం, దురద, చుండ్రు మొదలవుతాయి. దీంతో చాలామంది ఆవ నూనె, కొబ్బరి నూనె రాసుకుంటారు. అసలు వీటిలో జుట్టుకు ఏది మంచిది? నూనె పెట్టుకోకపోతే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

2 Min read
Author : Nandini Arava
Published : Nov 17 2026, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చలికాలంలో జుట్టుకు ఏ నూనె మంచిది?
Image Credit : Getty

చలికాలంలో జుట్టుకు ఏ నూనె మంచిది?

చలికాలంలో బయట ఉండే చల్లని గాలి, హీటర్ల వల్ల జుట్టులోని తేమను తగ్గిస్తాయి. దీంతో వెంట్రుకలు పొడిగా, పెళుసుగా మారతాయి. జుట్టు చిట్లిపోవడం, విపరీతంగా చిక్కులు పడటం, దువ్వేటప్పుడు విరిగిపోవడం జరుగుతుంటాయి. మాడు కూడా పొడిబారి దురద, పొట్టు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. ఇలాంటి సమయంలో నూనె రాసుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే అన్ని నూనెలు ఒకే విధంగా పనిచేయవు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొబ్బరి నూనెతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటి?
Image Credit : Getty

కొబ్బరి నూనెతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటి?

జుట్టుకు ఏ నూనె మంచిదనే విషయంపై నిపుణులు అధ్యయనం చేయగా..ఇందులో కొబ్బరి నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, మినరల్ ఆయిల్ ప్రభావాలను పరిశీలించారు. ఈ పరిశోధనలో కొబ్బరి నూనె మాత్రమే జుట్టులో ప్రోటీన్ నష్టాన్ని తగ్గించినట్లు గుర్తించారు. దెబ్బతిన్న, ఆరోగ్యంగా ఉన్న వెంట్రుకలు రెండింటిపైనా ఇది ప్రభావం చూపింది.

దీనికి కారణం కొబ్బరి నూనెలోని అణువులు. వెంట్రుక లోపలి పొర అయిన కార్టెక్స్ వరకు వెళ్తాయి. అదే మినరల్ ఆయిల్ జుట్టులోకి అంతగా వెళ్లదు. సన్‌ఫ్లవర్ ఆయిల్ అణువుల పెద్దదిగా ఉండటం వల్ల అది కూడా జుట్టు లోపలి పొరకు చేరలేదు.

జుట్టులో ప్రోటీన్ నష్టం తగ్గితే వెంట్రుకలు బలహీనపడి విరిగిపోతాయి. చలికాలంలో జుట్టు పెళుసుగా మారుతుంది కాబట్టి..కొబ్బరి నూనె వాడటం బెటర్.

35
ఆవ నూనె జుట్టుకు మంచిదేనా?
Image Credit : chat gpt

ఆవ నూనె జుట్టుకు మంచిదేనా?

ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆవ నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం సాధారణం. ముఖ్యంగా చలికాలంలో ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుందని చాలామంది అనుకుంటారు. అయితే జుట్టు ఆరోగ్యానికి సంబంధించి ఆవ నూనె మాత్రం వెంట్రుకల్లోకి ఫంగస్ చొరబడకుండా అడ్డుకోగలదు. అయితే కొబ్బరి, ఉసిరి నూనెలతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

అలాగే ఆవ నూనె తల చర్మం పొడిబారడం వల్ల వచ్చే పొట్టు సమస్యను తగ్గించడంలో కొంతవరకు సహాయపడవచ్చు. కానీ చుండ్రును పూర్తిగా నయం చేస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవు. కాబట్టి ఆవ నూనె వాడాలనుకునేవారు తక్కువ పరిమాణంలో, అవసరమైతే మరో నూనెతో కలిపి వాడటం మంచిది. ముందుగా చర్మంపై కొద్దిగా రాసి పరీక్షించుకోవాలి.

45
అసలు నూనె పెట్టుకోకపోతే ఏమవుతుంది?
Image Credit : social media

అసలు నూనె పెట్టుకోకపోతే ఏమవుతుంది?

జుట్టుకు నూనె పెట్టుకోవడం మంచిదే అయినప్పటికీ అది తప్పనిసరి కాదు. జిడ్డు తల చర్మం ఉన్నవారు, సున్నితమైన చర్మం కలిగినవారు నూనె పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు.

నిపుణులు ఏం చెబుతున్నారంటే...జుట్టుపై ఎక్కువ వేడి పెట్టకూడదు. హెయిర్ డ్రయ్యర్లు, స్ట్రెయిటెనర్లు వంటి హీట్ స్టైలింగ్ పరికరాల వాడకాన్ని తగ్గించాలి. జుట్టును గట్టిగా దువ్వకూడదు. తడిగా ఉన్నప్పుడు పూర్తిగా ఆరకముందే దువ్వడం కూడా తగ్గించాలి. జుట్టు కొంతవరకు ఆరిన తర్వాత సున్నితంగా దువ్వుకోవాలి. నూనెకు బదులుగా మంచి కండిషనర్ ఉపయోగించడం ద్వారా కూడా జుట్టులో తేమను నిలుపుకోవచ్చు. ముఖ్యంగా జుట్టు చివర్లకు కండిషనర్ రాయడం వల్ల పొడిబారడం, చిక్కులు పడటం తగ్గుతాయి.

55
చలికాలంలో జుట్టు సంరక్షణకు ఏం చేయాలి?
Image Credit : Getty

చలికాలంలో జుట్టు సంరక్షణకు ఏం చేయాలి?

జుట్టు పొడిగా, దెబ్బతిన్నట్లు ఉంటే తలస్నానం చేయడానికి ముందు వెంట్రుకల పొడవునా కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. తల చర్మం పొడిగా, దురదగా ఉంటే ఆవ నూనె వాడాలనుకునేవారు తక్కువ పరిమాణంలో ఉపయోగించవచ్చు. అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ముఖ్యం. దురద లేదా మంట వస్తే వెంటనే వాడటం ఆపేయాలి. మాడు జిడ్డుగా ఉండేవారు లేదా సున్నితమైన చర్మం కలిగినవారు నూనె పెట్టుకోకుండా జుట్టు చివర్లకు కండిషనర్ రాసుకోవచ్చు. అయితే తల చర్మంపై ఎర్రబడటం, నొప్పి, తగ్గకుండా పొట్టు రావడం వంటి సమస్యలు ఉంటే నూనెలతో ప్రయోగాలు చేయకుండా చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
మహిళలు
 
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(1.5 ov)1/0
SLSL
98
Day 1 - Session 2
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: పండుగలకు ఇలాంటి చీరలు అదిరిపోవడం ఖాయం
Recommended image2
Saree Designs: పండగ వేళ మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు
Recommended image3
Gold Ring: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!
Related Stories
Recommended image1
Stainless Steel: మన ఇంట్లో మెరిసే స్టీల్ పాత్రలు ఒరిజనలేనా? ఎలా గుర్తించాలి?
Recommended image2
Bathroom: బాత్రూమ్‌లో ఈ 7 వస్తువులు అస్సలు పెట్టకండి..ఉంటే వెంటనే తీసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved