MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Vegetable Storage: కూరగాయలు ఇలా స్టోర్ చేస్తే.. సంవత్సరమంతా వాడుకోవచ్చు..!

Vegetable Storage: కూరగాయలు ఇలా స్టోర్ చేస్తే.. సంవత్సరమంతా వాడుకోవచ్చు..!

Vegetable Storage: వేసవిలో కూరగాయలు నిల్వ చేయడం చాలా కష్టం. తెచ్చిన రెండురోజులకే వాడిపోవడం, పాడవడం జరుగుతుంది. ఫ్రిజ్‌లో పెట్టినా నిల్వ ఉండవు. అలా కాకుండా పాతకాలం పద్ధతులు పాటిస్తే కూరగాయలు చాలా కాలం తాజాగా ఉంచుకోవచ్చు. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 24 2026, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తేమ లేకుండా చూసుకోవాలి
Image Credit : Pinterest

తేమ లేకుండా చూసుకోవాలి

కూరగాయలు త్వరగా పాడవడానికి కారణం..అందులో ఉండే తేమ. కూరగాయల్లోని తేమ బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగేలా చేస్తుంది. అందుకే ఈ తేమను తగ్గించడానికే ఎండబెట్టే పద్ధతిని వాడతారు.

25
ఎండలో కూరగాయలు.. సూపర్ ఐడియా!
Image Credit : gemini ai

ఎండలో కూరగాయలు.. సూపర్ ఐడియా!

కూరగాయలు ఎక్కువ కాలం ఫ్రెష్‍గా ఉండాలంటే, వాటిని బాగా ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని తేమ తగ్గిపోతుంది. ఎండకు ఫంగస్ చచ్చిపోతుంది. అందుకే మంచి ఎండలో ఆరబెట్టాలి.

ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా ఆరడానికి 2 నుంచి 4 రోజులు పడుతుంది. ముక్కలు చేత్తో విరిస్తే తేలిగ్గా విరిగితే, తేమ మొత్తం పోయినట్టే. ఆ తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

Related Articles

Related image1
Vegetables : ఈ కూరగాయల్ని ఇంట్లో ఈజీగా పండించొచ్చు
Related image2
Vegetable Biryani: కూరగాయల్లేకుండానే అదిరిపోయే వెజిటేబుల్ బిర్యానీ
35
పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయి!
Image Credit : Getty

పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయి!

ఈ పద్ధతిని పరిశోధనలు కూడా సమర్థిస్తున్నాయి. కూరగాయల పరిరక్షణపై పరిశోధన చేసే 'వరల్డ్ వెజిటబుల్ సెంటర్' ఏం చెబుతోందంటే.., తేమను తగ్గించడానికి ఎండబెట్టడం మంచిదని.  ఇది కేవలం వంటింటి చిట్కా కాదని, 'జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్' వంటి పత్రికలు కూడా గుర్తించాయని ఈ సంస్థ చెబుతోంది. ఫ్రీజింగ్ టెక్నిక్‌లతో పోలిస్తే, ఇలా ఎండబెట్టడం వల్ల ఐరన్, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి.

45
ఎండిన కూరగాయల్ని ఎలా వాడాలి?
Image Credit : Asianet News

ఎండిన కూరగాయల్ని ఎలా వాడాలి?

గాజు సీసాలు, గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ ఉంచిన కూరగాయలను 12 నెలల వరకు వాడుకోవచ్చు. వాడే ముందు 15-20 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. అప్పుడు అవి మళ్లీ ఉబ్బుతాయి. రుచి కోల్పోదు. కరెంట్ కోతలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, కూరగాయలు చౌకగా దొరికినప్పుడు ఈ ట్రిక్ భలే పనిచేస్తుంది.

55
ఇలా చేస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే!
Image Credit : our own

ఇలా చేస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే!

ఇంట్లో మనమే స్వయంగా తయారుచేసుకున్న ఈ ఎండిన కూరగాయల్లో సోడియం గానీ, ఇతర రసాయనాలు గానీ ఉండవు. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అదే మార్కెట్లో దొరికే ఫ్రోజెన్ కూరగాయల్లో సోడియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Boiled water:కోడి గుడ్లు ఉడికించిన నీరు పారబోస్తున్నారా? ఎలా వాడాలో తెలుసా?
Recommended image2
Dosa Batter : రుబ్బిన దోశ పిండి ఎన్ని రోజులు వాడాలో తెలుసా?
Recommended image3
Grapes: నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష.. రెండింటిలో ఏది మంచిది? ఎవరు ఏది తినాలో తెలుసా?
Related Stories
Recommended image1
Vegetables : ఈ కూరగాయల్ని ఇంట్లో ఈజీగా పండించొచ్చు
Recommended image2
Vegetable Biryani: కూరగాయల్లేకుండానే అదిరిపోయే వెజిటేబుల్ బిర్యానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved