MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • Vegetable Biryani: కూరగాయల్లేకుండానే అదిరిపోయే వెజిటేబుల్ బిర్యానీ

Vegetable Biryani: కూరగాయల్లేకుండానే అదిరిపోయే వెజిటేబుల్ బిర్యానీ

Vegetable Biryani: ఇంట్లో కూరగాయల్లేనప్పుడు కూడా హోటల్ స్టైల్ రుచితో, ఘుమఘుమలాడే వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా?. ఇది బ్యాచిలర్స్ కి బెస్ట్ ఛాయిస్, టైం లేనప్పుడు క్విక్‍గా వంట ముగించాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఆప్షన్. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Nandini Arava
Published : Apr 18 2026, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
10 నిమిషాల్లో రెడీ అయ్యే వెజిటేబుల్ బిర్యానీ..ఫుల్ రెసిపీ
Image Credit : gemini ai

10 నిమిషాల్లో రెడీ అయ్యే వెజిటేబుల్ బిర్యానీ..ఫుల్ రెసిపీ

బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లేవారు...రోజూ కూరగాయలు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వారానికి సరిపడా తెచ్చుకున్నా వీకెండ్ లో అయిపోతాయి. అప్పటికప్పుడు తెచ్చుకునే ఓపిక ఉండదు. అలాంటప్పుడు కూడా హోటల్ స్టైల్‍లో అదిరిపోయే బిర్యానీ చేయోచ్చు. ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ చూసేయండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కావలసిన పదార్థాలు
Image Credit : Chatgpt

కావలసిన పదార్థాలు

బియ్యం: 2 కప్పులు (బాస్మతీ బెటర్ )

ఉల్లిపాయలు: 2 పెద్దవి, పొడవుగా కోసుకోవాలి.

పచ్చిమిర్చి: 4

అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక స్పూన్

పెరుగు: అర కప్పు

పుదీనా, కొత్తిమీర, కరివేపాకు: కొంచెం కొంచెం

నూనె + నెయ్యి: మీకు కావాల్సినంత

బిర్యానీ దినుసులు

ఉప్పు సరిపడా 

Related Articles

Related image1
Vegetable Price : హైదరాబాద్ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలివే..
Related image2
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
35
తయారీ విధానం
Image Credit : gemini ai

తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని కడిగి ఒక 20-30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్ లేదా మందపాటి గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక.. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయండి. లేదా ఆ 3 కలిపి పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలపండి. 

45
ఇదే ఈ బిర్యానీకి అసలైన టేస్ట్
Image Credit : gemini ai

ఇదే ఈ బిర్యానీకి అసలైన టేస్ట్

తర్వాత కాస్త మంట తగ్గించి పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు నూనె నుండి వేరయ్యే వరకు ఉడికించండి. ఇదే ఈ బిర్యానీకి అసలైన టేస్ట్ ఇస్తుంది. 2 కప్పుల బియ్యానికి, సుమారు 3 నుండి 3.5 కప్పుల నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎసరు మరిగేటప్పుడు ఉప్పు చూస్తే, నీళ్లు కొంచెం ఉప్పగా ఉండాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపండి.

కుక్కర్ అయితే మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మామూలు గిన్నె అయితే నీరు ఇంకిపోయే వరకు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వండి.  

55
రైతా లేదా మిర్చి కా సాలన్‍తో తింటే అద్భుతం
Image Credit : gemini ai

రైతా లేదా మిర్చి కా సాలన్‍తో తింటే అద్భుతం

ఒకవేళ మీ ఇంట్లో బంగాళాదుంప ఉంటే ముక్కలు చేసుకుని తాళింపులో వేసుకుంటే రుచి పెరుగుతుంది. మీల్ మేకర్ ఉంటే వాటిని వేడి నీళ్లలో నానబెట్టి వేయండి, కూరగాయల లోటు తెలియదు.

ఈ వేడి వేడి బిర్యానీని పెరుగు రైతా లేదా మిర్చి కా సాలన్‍తో తింటే అద్భుతంగా ఉంటుంది. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Vegetable Price : హైదరాబాద్ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలివే..
Recommended image2
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved