MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Chicken : స్కిన్డ్ చికెన్ vs స్కిన్ లెస్ చికెన్.. ఏది తినడం హెల్త్ కి బెటరో తెలుసా?

Chicken : స్కిన్డ్ చికెన్ vs స్కిన్ లెస్ చికెన్.. ఏది తినడం హెల్త్ కి బెటరో తెలుసా?

మీరు ఎలాంటి చికెన్ ఇష్టంగా తింటారా..? స్కిన్ తో కూడినదా లేక స్కిన్ లేకుండా ఉండేదా..? చాలామంది స్కిన్ లెస్ చికెన్ తింటుంటారు .. కొందరు మాత్రమే స్కిన్డ్ చికెన్ ఇష్టపడతారు. మరి దేనివల్ల ఆరోగ్యానికి ఎక్కువ లాభమో తెలుసా?  

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 29 2026, 07:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 స్కిన్ చికెన్ vs స్కిన్ లెస్ చికెన్
Image Credit : Gemini AI

స్కిన్ చికెన్ vs స్కిన్ లెస్ చికెన్

నాన్-వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం… దీంతో అనేక పదార్థాలు చేసుకుని లొట్టలేసుకుని తింటారు. తెలుగు ప్రజలయితే చికెన్ అంటే పడిచస్తుంటారు… ఇక హైదరాబాదీలు ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్ తో బిర్యానీ, కర్రీ, ప్రై, కబాబ్, పకోడీలు… ఇలా అనేక రకాల ఐటమ్స్ చేసుకుతింటారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో చికెన్ ఉడకాల్సిందే. 

అయితే చికెన్ తినడం ఒకే… కానీ కొనేటప్పుడు చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. స్కిన్ చికెత్ తినాలా, స్కిన్ లెస్ చికెన్ తినాలా? అని.  చాలామంది చికెన్ స్కిన్ ఆరోగ్యానికి హానికరం అనుకుని ధర ఎక్కువైనా సరే ‘స్కిన్ లెస్ చికెన్' తీసుకుంటారు. కానీ మనం ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు చికెన్ స్కిన్‌లో ఉన్నాయంటున్నారు నిపుణులు. అసలు చికెన్ స్కిన్ వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చికెన్ స్కిన్ తో హెల్త్ బెనిఫిట్స్
Image Credit : gemini ai

చికెన్ స్కిన్ తో హెల్త్ బెనిఫిట్స్

చికెన్ స్కిన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది హానికరమైనది కాదు. ఇందులో 'అన్‌శాచురేటెడ్ ఫ్యాట్' (Unsaturated Fat) అనే ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే 'ఒలీక్ యాసిడ్' (Oleic Acid) మనం ఆరోగ్యానికి మంచిదని వాడే ఆలివ్ ఆయిల్‌లో ఉండే కొవ్వు లాంటిదే. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. అంతేకాదు విటమిన్ B12, జింక్, సెలీనియం వంటి పోషకాలు కూడా ఈ స్కిన్‌లో పుష్కలంగా ఉన్నాయి.

చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో చికెన్ స్కిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో 'కొల్లాజెన్' (Collagen), 'జెలాటిన్' (Gelatin) అనే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ముడతలు లేకుండా యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఈ చికెన్ స్కిన్ జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.. వెంట్రుకల పెరుగుదలకు సాయపడతాయి. 

చికెన్ స్కిన్ లోని కొల్లాజెన్ వయసు పెరిగాక వచ్చే కీళ్ల నొప్పులను, కీళ్ల అరుగుదలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అందుకే కీళ్ల సమస్యలు రాకుండా ఉండటానికి స్కిన్‌తో చేసిన చికెన్ సూప్ తాగమని వైద్యులు సలహా ఇస్తుంటారు.

35
స్కిన్డ్ చికెన్ వండితే ఆ టేస్టే వేరు
Image Credit : Getty

స్కిన్డ్ చికెన్ వండితే ఆ టేస్టే వేరు

చాలామంది కేవలం రుచి కోసమే స్కిన్‌తో చికెన్ తింటారనుకోవడం పొరపాటు. వంట చేసేటప్పుడు మాంసం నాణ్యతను కాపాడటంలో చికెన్ స్కిన్‌ది కీలక పాత్ర. స్కిన్‌తో కలిపి చికెన్‌ను వండినప్పుడు, అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మాంసంలోని సహజమైన తేమ (Moisture) బయటకు పోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల చికెన్ డ్రైగా అవ్వకుండా, జ్యూసీగా, మెత్తగా ఉంటుంది. ముఖ్యంగా గ్రిల్, రోస్ట్, పాన్-ఫ్రై, తందూరీ వంటివి చేసేటప్పుడు స్కిన్‌తో వండితే రుచి అదిరిపోతుంది.

నిజానికి సమస్య చికెన్ స్కిన్‌తో కాదు, మనం దాన్ని 'ఎలా వండుతున్నాం' అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చికెన్‌ను నీళ్లలో ఉడకబెట్టినా, ఓవెన్‌లో బేక్ చేసినా, లేదా గ్రిల్, తందూరీ పద్ధతుల్లో వండినా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అదే చికెన్‌ను స్కిన్‌తో పాటు నూనెలో డీప్ ఫ్రై చేస్తే, దానిలోని కేలరీలు, కొవ్వు మూడు రెట్లు పెరుగుతాయి. కాబట్టి తప్పుడు వంట పద్ధతే ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది కానీ చికెన్ స్కిన్ కాదు.

45
చికెన్ స్కిన్ ఎక్కువ తింటే ఏమవుతుంది?
Image Credit : pinterest

చికెన్ స్కిన్ ఎక్కువ తింటే ఏమవుతుంది?

శాస్త్రీయంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ 100 గ్రాముల చికెన్ స్కిన్‌లో దాదాపు 200 కేలరీలు ఉంటాయి. కాబట్టి కొందరు దీన్ని మితంగానే తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు స్కిన్‌తో ఉన్న చికెన్‌ను తరచుగా తినకపోవడమే మంచిది. వీళ్లు కొవ్వు తక్కువగా, ప్రొటీన్ ఎక్కువగా ఉండే స్కిన్‌లెస్ చికెన్ (ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్) తినొచ్చు. సాధారణ వ్యక్తులు కూడా దీన్ని రోజూ తినకుండా, వారానికి ఒకసారి తింటే ఆరోగ్యానికి, రుచికి రెండింటికి బాగుంటుంది.

55
స్కిన్డ్ చికెన్ ప్రెష్ గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
Image Credit : vismaifood/youtube

స్కిన్డ్ చికెన్ ప్రెష్ గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

స్కిన్‌తో ఉన్న చికెన్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఆ మాంసం తాజాగా ఉండటం చాలా ముఖ్యం. షాపుల్లో చికెన్ కొనేటప్పుడు అది తాజాగా ఉందా, దుర్వాసన వస్తుందా, దాని రంగు సాధారణ లేత గులాబీ రంగులో ఉందా అని చూసి కొనాలి. ప్యాకెట్లలో అమ్మే చికెన్ కొన్నప్పుడు కూడా, కవర్ తెరిచాక చెడు వాసన వస్తుందేమో గమనించాలి. ఎందుకంటే పాత మాంసాన్ని స్కిన్‌తో వండుకుని తింటే తీవ్రమైన జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవు. 

కాబట్టి చికెన్ స్కిన్‌ను 'ఆరోగ్యానికి మంచిది కాదు' అని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో గుండెకు మేలు చేసే కొవ్వులు, యవ్వనాన్ని కాపాడే కొల్లాజెన్ ఉన్నాయి. అదే సమయంలో దీన్ని ఎక్కువగా తినడం లేదా నూనెలో వేయించి తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఆరోగ్యం ముఖ్యమనుకునేవారు స్కిన్‌లెస్ చికెన్, రుచితో పాటు పోషకాలు కావాలనుకునేవారు స్కిన్‌తో ఉన్న చికెన్ ఎంచుకోవచ్చు. ఏదైనా సరే సరైన వంట పద్ధతి పాటిస్తూ, మితంగా తినడమే తెలివైన పని.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image2
Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved