- Home
- Life
- Food
- Dal Tadka: తాళింపు సీక్రెట్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా, వాసనకే కడుపునిండిపోద్ది
Dal Tadka: తాళింపు సీక్రెట్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా, వాసనకే కడుపునిండిపోద్ది
Dal Tadka: ఇళ్లల్లో పప్పుచారు, సాంబారు, పప్పు రెగ్యులర్ గా చేసే బోరింగ్ డిష్. అదే హోటల్, ధాబాల్లో దొరికే పప్పునైతే లొట్టలేసుకుని తింటాం. కానీ మన ఇంట్లో చేసే వాటికి…రెస్టారెంట్ స్టైల్ కు పొంతనే ఉండదు. దానికి రీజన్ మసాలాలు కాదు. మరెంటో తెలుసా?
తాళింపు ఇలా పెట్టండి అదిరిపోతుంది
ఇళ్లల్లో పప్పుచారు, సాంబారు, పప్పు రెగ్యులర్ గా చేసే బోరింగ్ డిష్. అదే హోటల్, ధాబాల్లో దొరికే పప్పునైతే లొట్టలేసుకుని తింటాం. కానీ మన ఇంట్లో చేసే వాటికి…రెస్టారెంట్ స్టైల్ కు పొంతనే ఉండదు. దానికి రీజన్ మసాలాలు కాదు. కందిపప్పు, పెసరపప్పు, మసూర్ దాల్…ఏ పప్పు అయినా సరే దానికి తడ్కాలోనే అసలైన మ్యాజిక్ ఉంటుంది. తాళింపు పెట్టే పద్ధతిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. అందుకే తాళింపు ఇలా పెట్టండి అదిరిపోతుంది.
1. నూనె లేదా నెయ్యి
తాళింపు పెట్టేటప్పుడు చాలామంది చేసే తప్పు నూనె లేదా నెయ్యిని ఎక్కువగా వేడి చేసేస్తుంటారు. నూనె బాగా వేడెక్కినప్పుడు జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయగానే మాడిపోతాయి. మాడిన మసాలాలు పప్పు రుచిని చేదుగా మార్చేస్తాయి. అందుకే, తాళింపును ఎప్పుడూ మీడియం మంట మీదే రెడీ చేయాలి.
2. జీలకర్ర వేసే సరైన సమయం
తాళింపులో జీలకర్ర ప్రాణం లాంటిది. నూనె వేడెక్కాక ముందుగా జీలకర్ర వేయాలి. జీలకర్ర సరిగ్గా చిటపటలాడినప్పుడే దాని సహజ నూనెలు, సువాసన బయటకు వస్తాయి. జీలకర్ర నల్లగా మాడిపోకుండా చూసుకోండి. అది గోధుమ రంగులోకి మారగానే వెంటనే ఇతర పదార్థాలు వేయాలి.
3. వెల్లుల్లి, ఉల్లిపాయ వేయించే విధానం
తాళింపులో వెల్లుల్లి వేయడం వల్ల అద్భుతమైన రుచిని ఇస్తుంది. వెల్లుల్లిని దంచిన తర్వాత లేదా సన్నగా తరిగిన తర్వాత లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. వెల్లుల్లి సరిగ్గా వేగకపోతే పచ్చి వాసన వస్తుంది, మరీ ఎక్కువగా వేగితే చేదుగా మారుతుంది. ఉల్లిపాయలు కూడా అంతే. అవి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
4. కారం మాడిపోకుండా చూసుకోండి
హోటల్ పప్పులో మంచి ఎర్ర రంగు ఆకర్షణీయంగా ఉండటానికి వాళ్లు ఒక ట్రిక్ వాడతారు. తాళింపు రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి లేదా మంటను బాగా తగ్గించి చివర్లో కారం పొడి వేయాలి. వెంటనే ఈ తాళింపును పప్పులో వేసేయాలి. దీనివల్ల కారం మాడిపోదు, పప్పు రంగు, రుచి రెండూ పాడవ్వవు.
5. మూత పెట్టే ట్రిక్
తాళింపును పప్పులో వేసిన వెంటనే గిన్నెపై కనీసం 2-3 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల తాళింపు వాసన, సువాసన బయటకు పోకుండా పప్పు అంతటికీ పడుతుంది. దీన్నే హోటళ్లలో 'దమ్' పట్టించడం అంటారు. పప్పు రుచి కేవలం ఉప్పు, కారంలోనే ఉండదు; మీరు వాడే పప్పు నాణ్యత, తాళింపు సమతుల్యతలో కూడా ఉంటుంది. నూనెకు బదులు నెయ్యితో తాళింపు పెడితే దాల్ మరింత 'రిచ్'గా, రుచిగా వస్తుంది.

