MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Food
  • నవరాత్రి ఉపవాసం ఉంటున్నరా? ఇదిగో ఈ జ్యూస్ లను తాగితే అలసట, బలహీనత వంటి సమస్యలేం ఉండవు

నవరాత్రి ఉపవాసం ఉంటున్నరా? ఇదిగో ఈ జ్యూస్ లను తాగితే అలసట, బలహీనత వంటి సమస్యలేం ఉండవు

navratri 2023: నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా మంది ఉపవాసం చేస్తారు. ఈ సమయంలో పండ్లను తినడంతో పాటుగా సాత్విక ఆహార నియమాలను పాటిస్తారు. నవరాత్రి ఉపవాసం సమయంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఈ సమయంలో కొన్ని జ్యూస్ లను తాగాలంటారు నిపుణులు. 
 

R Shivallela | Published : Oct 20 2023, 01:49 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

దుర్గమాతకు అంకితమైన నవరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రుల్లో ఇది ఆరో రోజు. నవరాత్రుల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి భక్తులు పూజలు చేస్తారు. అయితే చాలా మంది తొమ్మిది రోజులు లేదా రెండు రోజులు ఉపవాసం కూడా ఉంటుంటారు. ఈ సమయంలో సాత్విక ఆహారం, పండ్లను తీసుకుంటారు.
 

27
Asianet Image

మీరు కూడా నవరాత్రులకు ఉపవాసం ఉన్నట్టైతే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా, శక్తివంతంగా ఉంచడానికి మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవచ్చు. వీటిని తాగడం వల్ల ఉపవాసం సమయంలో రిఫ్రెష్ గా ఫీలవుతారు. అంతేకాదు మిమ్మల్ని ఎనర్జిటిక్ గా కూడా ఉంచుతాయి. ఇందుకోసం ఎలాంటి పానీయాలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37
Image: Getty Images

Image: Getty Images

కొబ్బరి నీరు

నవరాత్రుల ఉపవాసం సమయంలో మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కొబ్బరి నీటిని తాగండి. ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండే కొబ్బరి నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. 
 

47
Asianet Image

పైనాపిల్ రసం, అల్లం

ఈ జ్యూస్ ను తాగితే ఉపవాసం సమయంలో రిఫ్రెష్ గా ఉంటారు. ఇందుకోసం పైనాపిల్ జ్యూస్ లో ఒకటి లేదా రెండు టీస్పూన్ల అల్లం రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తాగాలి. కావాలనుకుంటే ఈ జ్యూస్ లో ఐస్ ను కూడా కలుపుకోవచ్చు.

57
watermelon juice

watermelon juice

పుచ్చకాయ జ్యూస్

ఉపవాస సమయంలో పుచ్చకాయ జ్యూస్ ను కూడా తాగొచ్చు. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒక గ్లాసు పుచ్చకాయ రసంలో నిమ్మరసం, తులసి ఆకులు, చిటికెడు రాతి ఉప్పును వేసి బాగా కలిపి తాగండి. ఇది మిమ్మల్ని రోజంగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. 
 

67
Asianet Image

పసుపు పాలు

పసుపు పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరం ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఉపవాసం సమయంలో చాలా మంది అలసటగా, బలహీనంగా ఉంటారు. ఈ పానీయాన్ని తాగితే మీకు మంచి అనుభూతి కలుగుతుంది. దీన్ని తయారు చేయడానికి పాలను మరిగించి అందులో ఒక టీస్పూన్ పసుపు, నల్ల మిరియాల పొడిని కలపండి.
 

77
lemon juice

lemon juice

నిమ్మకాయ రసం

నిమ్మరసాన్ని తయారుచేయడం చాలా సులువు. దీనిని ఎండాకాలంలో ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఉపవాస సమయంలో దీన్ని తాగడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం వేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి లేదా కేవలం రాక్ సాల్ట్ మాత్రమే కలుపుకుని తాగొచ్చు. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్ గా చేయడమే కాకుండా మీరు బరతు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

R Shivallela
About the Author
R Shivallela
ఆరోగ్యం
 
Recommended Stories
Cancer: ఇవి తింటే క్యాన్సర్ భయం ఉండదు..!
Cancer: ఇవి తింటే క్యాన్సర్ భయం ఉండదు..!
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Masala Dosa: మసాలా దోశ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
Masala Dosa: మసాలా దోశ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
Top Stories
Telugu news live updates: Jobs: జీతం ఎక్కువ వ‌స్తుంద‌ని సంతోషప‌డ‌కండి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు ఆ కంపెనీ CEO హెచ్చ‌రిక
Telugu news live updates: Jobs: జీతం ఎక్కువ వ‌స్తుంద‌ని సంతోషప‌డ‌కండి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు ఆ కంపెనీ CEO హెచ్చ‌రిక
Trump-Putin: పుతిన్‌తో మాట్లాడిన తరువాత కొంచెం ఫర్వాలేదనిపించింది
Trump-Putin: పుతిన్‌తో మాట్లాడిన తరువాత కొంచెం ఫర్వాలేదనిపించింది
విశాల్‌, సాయి ధన్సిక మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా? ఇది అస్సలు ఊహించరు
విశాల్‌, సాయి ధన్సిక మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా? ఇది అస్సలు ఊహించరు