నవరాత్రుల్లో సాత్వికాహారాన్నే ఎందుకు తింటారు?
navratri 2023: సాత్విక ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నవరాత్రుల సమయంలో చాలా మంది ఈ ఆహారాన్నే తింటారు. ఈ భోజనంలో కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు మొదలైనవి ఉంటాయి. సాత్విక ఆహారాన్ని తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎన్నో వ్యాధుల ముప్పు కూడా తప్పుతుంది.
navratri 2023: నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో సాత్వికాహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు ఉంటాయి. ఈ ఆహారంలో వేయించిన, కారంగా ఉండే ఆహారం అసలే ఉండదు.
సాత్వికాహారం తినడం వల్ల మనసు నిర్మలంగా, పరిశుభ్రంగా, శక్తితో నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాన్ని అనుసరించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. సాత్విక ఆహారంలో ముడి కూరగాయలు, పండ్లు ఉంటాయి. ఈ ఆహారంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ డైట్ ను రెగ్యులర్ గా ఫాలో అయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు. సాత్వికాహారాన్ని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
immunity
రోగనిరోధక వ్యవస్థ
నవరాత్రులలో సాత్విక ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నవరాత్రి ఉపవాసం సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చిక్కుళ్లు, పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే పండ్లు, కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా శరీరాన్ని రక్షిస్తాయి.
బరువు తగ్గడానికి
సాత్విక ఆహారంలో.. సీజనల్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా తింటారు. దీనిలో పిండి పదార్థాలు తక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే సాత్విక ఆహారం ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ కేలరీల ఆహారాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. సాత్విక ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
శరీరం శక్తివంతం
సాత్విక ఆహారాన్ని క్రమం తప్పకుండా తింటే రోజంతా రిఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు. సాత్విక ఆహార నియమాలను పాటించడం వల్ల అలసట, సోమరితనం సమస్యలు కూడా పోతాయి.
శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది
సాత్విక ఆహారాన్ని తినడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. దీంతో ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. వాపు, తలనొప్పి, చర్మపు దద్దుర్లు, అలసట, మొటిమలు మొదలైన సమస్యలు ఉంటే ఖచ్చితంగా సాత్వికాహారాన్ని తినండి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి.. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, తేనె కలుపుకుని తాగండి. దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వస్తాయి.