Muskmelon Seeds: ఖర్బుజా గింజల్లో ఇన్ని పోషకాలున్నాయా?
Muskmelon Seeds: ఎండాకాలంలో ఖర్జుజా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.మరి, ఈ ఖర్బుజా గింజలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాాం..

Muskmelon Seeds: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బటయ ఎండలు మండిపోతాయి. ఆ వేడి తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాతావరణం వేడిగా ఉండటమే కాదు.. మన శరీరంలో కూడా వేడి చేస్తుంది. అందుకే.. ఈ సీజన్ లో చలవ చేసే ఆహారాలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అలా చలవ చేసే ఆహారాల్లో మజ్జిగ, పుచ్చకాయ ఎలానో.. ఖర్జూజా కూడా అంతే. ఇది పుచ్చకాయ కన్నా మరింత ఎక్కువ ప్రభావంతంగా పని చేస్తుంది. శరీరంలో వేడిని చాలా తక్కువ సమయంలో తగ్గించేస్తుంది.
దీని రుచి కూడా చాలా తీయగా ఉంటుంది. కడుపులో హాయి అనుభూతిని కలిగిస్తుంది. ఈ కాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ , విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు మేలు చేస్తాయి. మరి, ఈ ఖర్జుజా గింజల సంగతేంటి? వీటిని తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
కర్బూజ పండు గింజల్లో (seeds of muskmelon) చాలా పోషకాలు ఉన్నాయి. పండు మనకు ఎంత మేలు చేస్తుందో, దాని గింజలు కూడా అంతే మేలు చేస్తాయి. ఈ గింజలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్య, క్యాన్సర్ తో సహా గుండె సంబంధిత సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
కర్బూజ గింజలను ఎలా తినాలి?:
కర్బూజ గింజలను చాలా రకాలుగా తినవచ్చు. కర్బూజ నుండి గింజలను తీసి నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని డైరెక్ట్ గా తినొచ్చు. లేదంటే వాటిని ఎండ పెట్టి రోజూ నట్స్ మాదిరి స్నాక్స్ లా తీసుకోవచ్చు. వేయించుకొని తిన్నా బాగుంటాయి. కర్రీల్లో వాటిల్లో కూడా పేస్టులా చేసి వేసినా రుచి అదిరిపోతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది
ఖర్బూజ గింజల్లో పొటాషియం (Potasium) పుష్కలంగా ఉంటుంది. ఇది నరాలు, కండరాల సంకోచానికి సహాయపడే ఖనిజం. వీటిని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ.
ఊపిరితిత్తుల శుద్దీకరణ
ఖర్బూజ పుచ్చకాయ కుటుంబానికి చెందిన పండు. ఖర్బూజ గింజలను క్షయవ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
మూత్రపిండాలకు విశ్రాంతి
పరిశోధనలో, ఖర్బూజ గింజలను మూత్రవిసర్జనగా అభివర్ణించారు. అంటే ఇది శరీరంలో పెరుగుతున్న నీటి పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదం లేదు
క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఖర్బూజ గింజల్లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని తింటే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
ఖర్బూజ గింజల శక్తి
విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఖర్బూజ గింజలను తినడం చాలా ఆరోగ్యకరం.