Papaya Juice: పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగితే ఏమౌతుంది?
Papaya Juice: బొప్పాయిలో విటమిన్లు ఎ, సి, బి, ఇ, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

Papaya
ఉదయం లేచిన వెంటనే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగితే శరీరానికి ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ A, C, ఫైబర్ శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులోని టాక్సిన్స్‌ను తొలగించి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
జీర్ణక్రియ
ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి జ్యూస్‌ను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ దీనికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి
విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉన్న బొప్పాయి జ్యూస్ తాగడం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
బరువు తగ్గడానికి
ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. అధిక బరువు తగ్గించుకోవాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
బ్లడ్ షుగర్
అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం
పొటాషియం అధికంగా ఉండే బొప్పాయి అధిక రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ ఉన్న బొప్పాయి జ్యూస్ తాగడం కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
విటమిన్లు సి, ఇ పుష్కలంగా ఉన్న బొప్పాయి చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందం పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.