MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • మొలకెత్తిన పెసరపప్పు మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

మొలకెత్తిన పెసరపప్పు మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

పెసరపప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ పప్పును తింటే మనం ఎన్నో రకాల రోగాలకు దూరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పును ఎంచక్కా తినొచ్చు. మరి ఈ పప్పును తింటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓ లుక్కేద్దాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 12 2023, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అలసటను పోగొట్టేందుకు, హాయిగా నిద్రపోయేందుకు పెసరపప్పు ఎంతగానో సహాయపడుతుంది. సాధారణంగా మనం ఈ పప్పును పప్పు చారుగా, కిచిడీలో ఎక్కువగా తింటుంటాం. వీటితో పాటుగా మొలకెత్తిన పెసరపప్పును కూడా తినొచ్చు. ఎందుకంటే ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పును తింటే మన  ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పుల్లో మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి.  మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పెసరపప్పు

పెసరపప్పు

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మొలకెత్తిన పెసరపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్, విటమిన్-సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పప్పులను తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ పప్పు మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది.
 

37
పెసరపప్పు

పెసరపప్పు

జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది

ఫైబర్ కంటెంట్ మెండుగా ఉండే పెసరపప్పు మొలకలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ పప్పును తింటే ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పులు వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది.
 

47
sprouts

sprouts

చర్మానికి మేలు చేస్తుంది

ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పు తింటే మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పప్పు చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. 
 

57
green gram sprouts

green gram sprouts

కంటి చూపును పెంచడానికి

మొలకెత్తిన పెసరపప్పులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఈ విటమిన్ మన కళ్లకు మేలు చేస్తుంది. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కంటిచూపు పెరుగుతుంది. 
 

67
పెసరపప్పు

పెసరపప్పు

రక్త ప్రసరణ మెరుగ్గా.. 

మొలకెత్తిన పెసరపప్పును తింటే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా వీటిని మోతాదులోనే తినాలి. 
 

77
green gram sprouts

green gram sprouts

రక్తహీనత సమస్య

మొలకెత్తిన పెసరపప్పులో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. ఈ పప్పులను తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య పోతుంది. అయితే ఆహారాలను తినే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మర్చిపోకండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved