MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Leftover Rice: అన్నం మిగిలిందని పులిహోర చేస్తున్నారా? పిల్లలు మెచ్చే ఈ క్రేజీ స్నాక్ ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!

Leftover Rice: అన్నం మిగిలిందని పులిహోర చేస్తున్నారా? పిల్లలు మెచ్చే ఈ క్రేజీ స్నాక్ ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!

 Leftover Rice: మిగిలిపోయిన అన్నాన్ని చాలా మంది పులిహార చేస్తారు లేదంటే.. పాడేస్తారు. కానీ, ఆ అన్నంతోనే ఇంటిల్లిపాదికీ నచ్చేలా క్రేజీ స్నాక్స్ చేయచ్చు. అది కూడా పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసేయచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 02 2026, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిగిలిపోయిన అన్నం..
Image Credit : Getty

మిగిలిపోయిన అన్నం..

రాత్రి వండిన అన్నం.. ఉదయానికి మిగిలిపోవడం సాధారణంగా అందరి ఇళ్లల్లో జరిగేదే. తింటాం కదా అని వండుతాం. కానీ, ఇంట్లో ఒక్కరు సరిగా తినకపోయినా అది మిగిలిపోయింది. మిగిలిపోయిన చద్దన్నం తినడం చాలా కష్టంగా ఉంటుంది. అలా అని ఎప్పుడూ చేసే బోరింగ్ పులిహోర తినాలన్నా కష్టంగానే ఉంటుంది. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఆ అన్నంతో ఎలాంటి స్నాక్స్ చేయచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ కష్టపడకుండా, కేవలం పది నిమిషాల్లో కరకరలాడే రైస్ పొటాటో చీజ్ బాల్స్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. మిగిలిపోయిన అన్నం, ఉడికించిన రెండు బంగాళదుంపలు ముఖ్యంగా ఉంటే సరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలా తయారు చేయాలంటే...
Image Credit : Youtube

ఎలా తయారు చేయాలంటే...

వీటిని ఎలా తయారు చేయాలంటే... మిగిలిపోయిన అన్నాన్ని ఒక కప్పు తీసుకోవాలి. దానిలో ఉడికించిన రెండు బంగాళదుంపల తురుము వేయాలి. ఈ రెండిటినీ చేతులో చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. ఆ రుచిని మరింత పెంచుకోవడానికి తరిగిన ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు కూడా వేయాలి. వీటిని వేయడం వల్ల పోషకాలు కూడా అందుతాయి. కారం కోసం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసుకోవచ్చు. చివరగా పావు స్పూన్ దనియాల పొడి, మొక్క జొన్న పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు.. సిద్ధం చేసుకున్న మిశ్రమం నుండి ఒక చిన్న ఉండను తీసుకుని, మీ అరచేతిలో పరచి, మధ్యలో మొజారెల్లా చీజ్‌ను ఉంచండి. దానిని అన్ని వైపులా మూసివేసి, ఉండ లేదా టిక్కీలా చేయండి. వేయించేటప్పుడు చీజ్ లోపల సురక్షితంగా కరిగేలా, అది బయటకు రాకుండా టిక్కీని పూర్తిగా మూసివేయాలి.

33
నూనెలో వేయించే విధానం..
Image Credit : our own

నూనెలో వేయించే విధానం..

ఇప్పుడు మరో గిన్నెలో మైదా పిండి, మొక్క జొన్న పిండి వేసి కలపాలి. దీనిలో కొద్దిగా ఉప్పు, కారం కూడా వేయాలి. వీటిని కలిపిన తర్వాత నీటిని పోసి.. పల్చటి మిశ్రమంలా కలపాలి. తర్వాత.. ముందుగా తయారు చేసుకున్న టిక్కీలను ఈ మైదా పిండి మిశ్రమంలో ముంచి.. తర్వాత బ్రెడ్ క్రంబ్ర్ తో పూత వేయాలి. అలా అన్నింటినీ సిద్ధం చేసుకొని వాటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు.. ఒక పాన్‌లో నూనె పోసి, మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టిక్కీలను ఒక్కొక్కటిగా ఈ నూననెలో వేయించుకుంటే సరిపోతుంది. కమ్మనైనా రైస్ పొటటో చీజ్ బాల్స్ రెడీ అయినట్లే. ఇవి బయటకు క్రంచీగా.. లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Soft Chapati: చపాతీలు మెత్తగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image2
Millet Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. మిల్లెట్ ఇడ్లీ కూడా మెత్తగా రావాలా? ఈ చిన్న చిట్కా వాడితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved