పెరుగును ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుంది?
పెరుగును ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఎక్కువ పుల్లగా కాదు. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అందుకే చాలా మంది పెరుగు తిన్న తర్వాత మిగిలిన దాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుందో తెలుసా?

curd
కాలాలతో సంబంధం లేకుండా పెరుగును తినొచ్చు. ఎందుకంటే పెరుగు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటుంది మరి. అయితే ప్రతి ఒక్కరూ పెరుగు అయిన వెంటనే ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. పెరుగును ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పుల్లగా కాదు. టేస్ట్ బాగుంటుంది. ఈ కారణంతోనే ప్రతి ఒక్కరూ పెరుగును ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ పెరుగును ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ లోని చల్లదనానికి పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చనిపోతుంది.
curd
అంతేకాకుండా చలికాలంలో ఫ్రిజ్ లో పెరుగును పెట్టడం వల్ల దాని నుంచి వింత వాసన కూడా వస్తుంది.దీనితో పాటుగా చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చనిపోతుంది
ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. దీనికి పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చనిపోతుంది. దీనివల్ల పెరుగులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి. అలాగే పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పెరుగును గడ్డకట్టించడానికి సహాయపడుతుంది. అయితే పెరుగును ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది సరిగా గడ్డకట్టదు. అందుకే చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టకూడదని నిపుణులు చెప్తారు.
పెరుగు నాణ్యత తగ్గుతుంది
పెరుగును ఫ్రిజ్ లో పెడితే దాని నాణ్యత కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఫ్రిజ్ లో పెడితే దాని రుచి, ఆకృతి మారుతుంది. అంతేకాదు పెరుగులో ఉండే పోషకాలు కూడా తగ్గుతాయి. చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెడితే అది పెరుగు నాణ్యతపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
curd
బ్యాక్టీరియా పెరుగుదల
చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దానిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో పెరుగు తొందరగా పాడవుతుంది. దీన్ని తిన్న మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది పెరుగును చాలా సేపటి వరకు అంటే రెండు మూడు రోజులు కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల పెరుగులో బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దీంతో పెరుగు నుంచి దుర్వాసన వస్తుంది. దీనివల్ల పెరుగును తినలేరు. ఒకవేళ తిన్నా ఆరోగ్యం దెబ్బతింటుంది.
curd
చలికాలంలో పెరుగును నిల్వ చేడయానికి చేయడానికి పెరుగును గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. దీనివల్ల అది పాడవదు. అలాగే పెరుగును గాలి వెళ్లని కంటైనర్ లో కూడా పెట్టొచ్చు. అలాగే పెరుగును ప్రతిరోజూ కలపాలి. పెరుగు చెడిపోకూడదంటే దీన్ని 1 నుంచి 2 రోజుల్లోనే మొత్తం తినేయాలి. ఇంతకు మించి ఎక్కువ రోజులు నిల్ల చేయకూడదు.