MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Meal Maker Curry: చపాతీ, రైస్ దేనికైనా బెస్ట్ కాంబినేషన్ రెస్టారెంట్ స్టైల్ మీల్ మేకర్ కర్రీ.. 10 నిమిషాల్లో రెసిపీ రెడీ

Meal Maker Curry: చపాతీ, రైస్ దేనికైనా బెస్ట్ కాంబినేషన్ రెస్టారెంట్ స్టైల్ మీల్ మేకర్ కర్రీ.. 10 నిమిషాల్లో రెసిపీ రెడీ

Meal Maker Curry: ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు, బద్ధకంగా ఉండి వండుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నోటికి రుచిగా తినాలి, నాన్ వెజ్ టేస్ట్ తో, రెస్టారెంట్ స్టైల్‍లో కావాలంటే ఈ కర్రీ మస్ట్ గా ట్రై చేయాల్సిందే. ప్లేట్ కడగాల్సిన పని లేదింకా..

2 Min read
Author : Nandini Arava
Published : Jun 10 2026, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మీల్ మేకర్ కర్రీ
Image Credit : chatgpt

మీల్ మేకర్ కర్రీ

ఆఫీస్ నుంచో, షాపింగ్ నుంచో, బయట నుంచో ఇంటికొచ్చాక కాస్త బద్ధకంగా ఉంటుంది. కానీ ఆకలేస్తుంది. అలాంటప్పుడు వంట చేయాలంటే ...అమ్మో నా వల్ల కాదు, అంత శ్రమ పడలేను అని వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటారు. అది తింటే కడుపు నిండదు సరికదా...దానికి తోడు డబ్బు వృథా. అందుకే ఆర్డర్ పెట్టుకునేముందు ఈ మీల్ మేకర్ కర్రీ ట్రై చేయండి. ప్లేట్ ఖాళీ చేయాల్సిందే. ఒక్క మెతుక్కూడా వదలరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కావాల్సిన పదార్థాలు
Image Credit : chatgpt

కావాల్సిన పదార్థాలు

మీల్ మేకర్ కూరకు కావాల్సిన పదార్థాలు: కప్పు మీల్ మేకర్ ఆయిల్, పోపు దినుసులు, కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, రెండు టమాటాలు. అంతే చాలు. 10 నిమిషాల్లో మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు కూర రెడీ. వేడివేడి అన్నంతో లాగించేయొచ్చు.

Related Articles

Related image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Related image2
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
34
తయారీ విధానం
Image Credit : chatgpt

తయారీ విధానం

ముందుగా మీల్ మేకర్ నానబెట్టుకోవాలి. పోపు వేగి టమాటాలు మగ్గే టైంలో అవి నానబెట్టేస్తే సరి. ఇప్పుడు పాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకుని వేయించాలి. ఇప్పుడు అందులో కప్పు ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది పచ్చివాసన పోయాక కొత్తిమీర, కరివేపాకు వేసి జస్ట్ మెత్తబడ్డాక...అందులో టమాటాలు వేసి మగ్గించాలి. కాస్త ఉప్పు, పసుపు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. ముందే కొత్తిమీర, కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ కూరకు అంటుకుంటుంది. టమాటాలు మగ్గాక దాంట్లో నానబెట్టుకున్న కప్పు మీల్ మేకర్ వేసుకుని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని వాటికి పట్టేదాకా కలుపుతూ ఉండాలి. అవి వేగాక నూనె తేలుతుంటే అప్పుడు 2 కప్పుల నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. అంతే..

44
ఘుమఘుమలాడే మీల్ మేకర్ కర్రీ రెడీ
Image Credit : chatgpt

ఘుమఘుమలాడే మీల్ మేకర్ కర్రీ రెడీ

xరుచిగా, ఘుమఘుమలాడే మీల్ మేకర్ కర్రీ రెడీ. ఒక్క ముద్దకే మీరు ఫట్. అంత బాగుంటుంది. కాస్త నెయ్యి వేసుకుని తింటే ఇంకా అదిరిపోద్ది. ఈసారి మీ ఇంట్లో కూరగాయలు ఉన్నా కూడా ఈ కర్రీ ట్రై చేయండి. ఇకపై కూరగాయలు తినరింక.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Locket: హార్ట్ షేప్‌ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!
Recommended image2
Rice: అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకాలంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి చాలు
Recommended image3
రాధా-కృష్ణుల బంధం నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది
Related Stories
Recommended image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved