MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Tea Seller: టీ కొట్టుతో నెలకు రూ.9లక్షల సంపాదన.. ఈ ఓనర్ బిజినెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు

Tea Seller: టీ కొట్టుతో నెలకు రూ.9లక్షల సంపాదన.. ఈ ఓనర్ బిజినెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు

Tea Seller: పెద్ద రెస్టారెంట్ కాదు, స్టార్టప్ అంతకన్నా కాదు. 55 ఏళ్లుగా నడిపిస్తున్న ఓ టీ కొట్టు ఓనర్..నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంత సక్సెస్ ఎలా అయ్యారు? దాని వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్ ఏంటి? ఆ యజమాని చెబుతున్న టిప్స్ ఏంటో మీరు చూసేయండి.

3 Min read
Author : Nandini Arava
Published : Oct 26 2026, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెలకు రూ.9లక్షల ఆదాయం
Image Credit : AI Generated Image

నెలకు రూ.9లక్షల ఆదాయం

మామూలుగా టీ దుకాణంలో ఒక టీ రూ.10 ఉంటుంది. అయితే కేవలం పది రూపాయలతో ఇంత బిజినెస్ చేయొచ్చా? ఈ సందేహం మీకూ వచ్చిందా? కచ్చితంగా చేయొచ్చు అంటున్నాడు 'శర్మ కేఫ్ రెస్టారెంట్' (Sharma Cafe Restaurant) ఓనర్. ఈ టీ కొట్టు ద్వారా నెలకు సుమారు రూ.9 లక్షల ఆదాయం వస్తోందని ఆయన చెబుతున్నాడు.

గత 55, 56 ఏళ్లుగా ఈ కేఫ్ నడుస్తోంది. ఇక్కడ రోజుకు దాదాపు 3,000 కప్పుల టీ అమ్ముతారు. ఒక్కో టీ ధర రూ.10 వేసుకున్నా.. రోజుకు రూ.30,000 వరకు వ్యాపారం జరుగుతుంది. అయితే, రోజువారీ ఆదాయం రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుందని ఓనర్ చెబుతున్నారు. దీని ప్రకారం 30 రోజులకు చూసుకుంటే రూ.7.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు కలెక్షన్ వస్తుంది.

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇది కేవలం మొత్తం ఆదాయం మాత్రమే. ఇందులో టీ పొడి, పాలు, చక్కెర, పనివాళ్ల జీతాలు, అద్దె, కరెంటు బిల్లులు అన్నీ పోను మిగిలిందే అసలైన లాభం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
55, 56 ఏళ్లుగా నడుస్తున్న శర్మ కేఫ్
Image Credit : AI Generated Image

55, 56 ఏళ్లుగా నడుస్తున్న శర్మ కేఫ్

ఒక టీ కొట్టు పెట్టడం చాలా ఈజీనే. కానీ, దాన్ని ఏళ్ల తరబడి నడపడం కష్టం. కస్టమర్ల నమ్మకం, రుచిలో మార్పు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇన్నేళ్లుగా షాపును ఎలా నడుపుతున్నారని అడిగితే.. కస్టమర్లకు ఎప్పుడూ మంచి క్వాలిటీ టీ ఇవ్వడమే తమ సీక్రెట్ అని ఆయన అన్నాడు. ఒక షాపు సక్సెస్‌ను కేవలం వచ్చే ఆదాయంతోనే కొలవలేం. రెగ్యులర్‌గా కస్టమర్లను రప్పించుకోవడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, పనివాళ్లను చూసుకోవడం కూడా బిజినెస్‌లో చాలా ముఖ్యం. చిన్న వ్యాపారమైనా సరే, కరెక్ట్‌గా చేస్తే ఏళ్ల తరబడి సక్సెస్‌ఫుల్‌గా నడపొచ్చని ఈ టీ కొట్టు ఓనర్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

35
30-35 మంది వరకు పనివాళ్లు ఉన్నారు
Image Credit : AI Generated Image

30-35 మంది వరకు పనివాళ్లు ఉన్నారు

ఈ టీ కొట్టులో ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే.. ఇక్కడ పనిచేసే వాళ్ల సంఖ్య. ఈ షాపులో సుమారు 30 నుంచి 35 మంది వరకు పనివాళ్లు ఉన్నారని ఓనర్ చెబుతున్నారు. రోజుకు వేల కొద్దీ టీలు అమ్మాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు. టీ పెట్టడం, కస్టమర్లకు ఇవ్వడం, సరుకులు తెచ్చుకోవడం, గల్లా పెట్టె చూసుకోవడం, షాపును శుభ్రంగా ఉంచుకోవడం.. ఇలా చాలా పనులు ఉంటాయి. అందుకే ఇంత పెద్ద బిజినెస్‌ను ఒక్కరే మేనేజ్ చేయడం కష్టం. పనివాళ్లను కలుపుకుపోతూ, రోజువారీ పనులను చక్కగా ప్లాన్ చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. అయితే, షాపు మొత్తం ఆదాయం, పనివాళ్ల జీతాలు, ఇతర ఖర్చులూ ఉంటాయి. కాబట్టి, ఈ షాపు అసలు లాభం ఎంత అనేది కచ్చితంగా చెప్పలేం.

45
మోదీ, ఎలాన్ మస్క్ ఆదర్శమట
Image Credit : AI Generated Image

మోదీ, ఎలాన్ మస్క్ ఆదర్శమట

తక్కువ పెట్టుబడితో పెద్ద బిజినెస్ చేయొచ్చా అని ఈ టీ కొట్టు ఓనర్‌ను అడిగితే.. నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ తనకు ఆదర్శం అని ఆయన బదులిచ్చాడు. ప్రధాని మోదీ తన చిన్నతనంలో టీ అమ్మిన విషయాన్ని, అలాగే ఎలాన్ మస్క్ చిన్న చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి ప్రపంచంలోనే పెద్ద బిజినెస్‌మెన్‌గా ఎదిగిన తీరును ఆయన ఉదాహరణగా చెప్పాడు. తాతల నాటి ఆస్తులు లేకపోయినా, కింది స్థాయి నుంచి కష్టపడి పైకి రావొచ్చు అనేది ఆయన మాటల సారాంశం.

అయితే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మోదీ, మస్క్ జీవిత ప్రయాణాలు వేరు. వాళ్ల సక్సెస్‌ను ఒకేలా చూడలేం. కానీ, చిన్నగా మొదలుపెట్టి అనుభవం సంపాదించాలనే ఈ ఓనర్ ఆలోచనా విధానం మాత్రం మెచ్చుకోదగినదే.

55
అప్పు చేసి వ్యాపారంలో రాకూడదు
Image Credit : AI Generated Image

అప్పు చేసి వ్యాపారంలో రాకూడదు

బిజినెస్ చేయాలనుకునే కుర్రాళ్లకు ఈ టీ కొట్టు ఓనర్ ఒక మంచి సలహా ఇచ్చాడు. మొదట్లోనే లక్షలు పెట్టుబడి పెట్టే బదులు.. రూ.10,000, రూ.20,000 లేదా రూ.50,000 లాంటి చిన్న మొత్తాలతో వ్యాపారం మొదలుపెట్టి అనుభవం సంపాదించాలని ఆయన చెప్పాడు.

తక్కువ పెట్టుబడితో మొదలుపెడితే బిజినెస్ ఎలా నడుస్తుందో అర్థమవుతుంది. కస్టమర్లకు ఏం కావాలో తెలుస్తుంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకవేళ నష్టం వచ్చినా, ఆ అనుభవం భవిష్యత్తులో పనికొస్తుందని ఆయన అన్నాడు. అయితే, ఏ బిజినెస్ అయినా మొదలుపెట్టే ముందు ఖర్చులు, కస్టమర్లు, పోటీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పు చేసి మరీ వ్యాపారంలోకి దిగకూడదు. ఈ టీ కొట్టు ఓనర్ చెప్పిన రూ.9 లక్షలు అనేది కేవలం నెలవారీ మొత్తం ఆదాయం మాత్రమే.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 3 Wealthy Countries: ప్రపంచంలో పేదరికం లేని 3 దేశాలు.. ఇక్కడ ప్రతీ మూడో వ్యక్తి కోటీశ్వరుడే ! అసలు సీక్రెట్ ఇదే
Recommended image2
Gold Silver Price Crash: దివాళి ధమాకా.. 4 రోజుల్లోనే వెండి రూ. 16,000 క్రాష్.. గోల్డ్ ఎంతకు పడిపోయిందో తెలుసా?
Recommended image3
Ticket Booking: ట్రైన్ టికెట్ ఎలా తీస్తే త్వరగా కన్ఫర్మ్ అవుతుంది?
Related Stories
Recommended image1
Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్
Recommended image2
Inspiring Story: కలియుగంలోనూ ఇలాంటి కొడుకులున్నారా? తల్లి కోసం చెప్పుల్లేకుండా జ్యోతిర్లింగాల యాత్ర!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved