పిల్లల కోసం హెల్తీ హోమ్‌మేడ్ స్వీట్స్ ఐడియాస్ ఇవిగో..!
పిల్లలు స్వీట్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. చాక్లెట్‌లు, బిస్కెట్లు వారి రోజువారీ ఆహారంలో భాగమైపోయాయి. కానీ ఈ రెడీమేడ్ స్వీట్స్ పిల్లల ఆరోగ్యానికి అంత మంచిదికాదు. పిల్లల తీపి ఇష్టం తీరడంతో పాటు వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హోమ్ మేడ్ స్వీట్స్ ట్రై చేయండి.

పల్లీ పట్టి
భారతీయ వంటకాలలో సహజమైన తీపి పదార్థాలతో చేసే అనేక రకాల స్వీట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పల్లీ పట్టి. బెల్లం పల్లీలతో చేసే ఈ స్వీట్ తినడం వల్ల పిల్లల ఎముకలు, కండరాలు బలపడుతాయి. రక్తహీనతను నివారించవచ్చు. అంతేకాదు ఈ స్వీట్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది . ఇందులోని ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
రాగి లడ్డు
రాగి లడ్డు పిల్లల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. రాగిలో ఉండే కాల్షియం ఎముకల బలానికి సహాయపడుతుంది. ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.
నువ్వుల లడ్డు
నువ్వుల లడ్డు పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది. కండరాల ఎదుగుదలకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
రవ్వ లడ్డు
రవ్వలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పిల్లల శక్తి, ఎదుగుదల, జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. ఇందులో వాడే నెయ్యి మెదడు అభివృద్ధికి, బెల్లం రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. కాజు, బాదం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ విటమిన్లు, మినరల్స్ అందించి ఇమ్యూనిటీని పెంచుతాయి.
డ్రై ఫ్రూట్స్ లడ్డు
డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకు శక్తివంతమైన, ఆరోగ్యకరమైన తీపి వంటకం. బాదం, కాజు, వాల్‌నట్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ E, ఐరన్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి, ఎముకల బలోపేతానికి, రక్తప్రసరణకు సహాయపడతాయి. బెల్లం లేదా తేనెతో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు ఇమ్యూనిటీని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రవ్వ కేసరి
రవ్వ కేసరి పిల్లలకు రుచికరమైన, పోషకమైన స్వీట్. రవ్వలో ఉన్న కార్బోహైడ్రేట్లు, ఐరన్, ప్రోటీన్ పిల్లలకు శక్తిని అందించి ఎదుగుదలకు సహాయపడతాయి. ఇందులో వేసే నెయ్యి మెదడు అభివృద్ధికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. బెల్లం లేదా చక్కెర తీపిని ఇస్తే, కాజు, బాదం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ విటమిన్లు, మినరల్స్ అందించి ఇమ్యూనిటీని పెంచుతాయి. కాబట్టి ప్యాక్డ్ స్వీట్స్‌కి బదులుగా ఇలా ఇంట్లో తయారుచేసిన స్వీట్స్ పెట్టడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.