MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Health Tips: మధ్యాహ్న భోజనంలో పెరుగును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో..!

Health Tips: మధ్యాహ్న భోజనంలో పెరుగును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో..!

 Health Tips: పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి కాపాడటానికి ఎంతగానో సహాయపడుతాయి. రోజూ పెరుగును తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అసలు మధ్యాహ్నం పూట పెరుగును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 22 2023, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నిజానికి పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎన్నో రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం పూట  పెరుగును తింటే ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. పెరుగును తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు పెరుగు ఒత్తిడిని పెంచే కార్టిసాల్ లేదా స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో ఊబకాయం ప్రమాదం తగ్గుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పెరుగు కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆడవాళ్లు పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి.  పెరుగు ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను తగ్గిస్తుంది. అంతేకాదు పెరుగులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

37

రెగ్యులర్ గా పెరుగును తినడం వల్ల కలిగే ప్రయోజనాలలో.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం కూడా ఉంది. అవును రెగ్యులర్ గా పెరుగును తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పెరుగు  కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అలాగే గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. 
 

47
curd

curd

పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన మొత్తంలో కాల్షియం అందుతుంది. దీంతో మన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఇది సయాటికా, ఇతర ఎముక సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

57

పెరుగును కాలాలతో సంబంధం లేకుండా మధ్యాహ్నం పూట తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అసమతుల్య జీవనశైలి, కార్టిసాల్ అనే హార్మోన్ లో అసమతుల్యత వల్ల నడుములో కొవ్వు పేరుకుపోతుంది. పెరుగు కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అందుకే ఇది కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది.

67

పెరుగులో సులబంగా జీర్ణమయ్యే ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. రోజూ పెరుగును తినడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగు ధమనుల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారిస్తుంది.

77
curd

curd

పెరుగులో విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్ వంటి అనేక ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మన స్కిన్ కలర్, చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది వివిధ చర్మ సమస్యలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved