జామకాయే కదా ఏం చేస్తుందిలే అనుకోకండి.. ఇది ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుస్తే షాకే?
జామకాయను ఇష్టపడని వారుండరు. నిజానికి ఇది టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవును జామకాయను తినడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామకాయను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే?
మనం ఎక్కువగా తినే పండ్ల లీస్ట్ లో ఆపిల్, బనానా, పైనాపిల్, మామిడి, బొప్పాయి, ద్రాక్షలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ మన చుట్టూ ఉన్నా మనం తినని పండ్లు జామకాయ. అవును ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నా.. వీటిని మాత్రం తినరు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేయవని. కానీ ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి తెలుసా? అసలు ఈ పండును తింటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జామకాయల్లో విటమన్ సి మెండుగా ఉంటుంది. జామకాయలో విటమిన్ సి నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది తెలుసా? ఈ విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీంతో అంటువ్యాధులు, ఇతర రోగాలకు మనం దూరంగా ఉంటాం. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
జామకాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక జామకాయలో 3 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడానికి సహాయపడుతుంది. మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది.
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమస్య మనకు రావొద్దంటే ప్రతిరోజూ శారరీక శ్రమ చేయడంతో పాటుగా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. జామకాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎంతో సహాయపడుతుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగవు.
guava
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
జామకాయ కూడా మన గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం గుండెను సంరక్షిస్తుంది. పొటాషియం ముఖ్యమైన ఖనిజం. ఇది అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది.
Image: Getty Images
యాంటీ క్యాన్సర్ గుణాలు
జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడుతాయి. జామకాయల్లో లైకోపీన్ మెండుగా ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పండు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మన చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అవసరం. ఇది మన చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది.