చలికాలంలో నానబెట్టిన అంజీర పండ్లను తింటే ఇంత మంచిదా?
పోషకాలు మెండుగా ఉండే అత్తి పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పండ్లను అలాగే లేదా డ్రైగా చేసుకుని కూడా తినొచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో రోజూ ఉదయాన్నే నానబెట్టిన అత్తి పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మన శరీరాన్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.
చలికాలంలో తరచుగా మన ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. చలికాలంలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఖచ్చితంగా తినాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సీజన్ లో అంజీర పండ్లన తినడం చాలా మంచిది. ఎందుకంటే ఈ పండ్లు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. రాత్రిపూట ఒక కప్పు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అదుతాయి. వీటిని ఇతర డ్రై ఫ్రూట్స్ తో పాటుగా కూడా తినొచ్చు. ఈ పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అసలు చలికాలంలో నానబెట్టిన డ్రై అంజీరలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
anjeer
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా..
మలబద్ధకం సమస్యతో బాధపడుతన్న వారికి అంజీర పండ్లు మెడిసిన్ లాగే పనిచేస్తాయి. అవును దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. ఈ పండ్లను తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. అంతేకాదు అత్తి పండ్లు మన కడుపులో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి.
డయాబెటిక్ రోగులకు..
చలికాలంలో డయాబెటీస్ పేషెంట్లు అంజీర పండ్లను తింటే ఎంతో మంచిదని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగుపడతాయి. వీటిలో ఉండే అబ్సిసిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడతాయి.
హైబీపీ కంట్రోల్..
అధిక రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇది అత్తిపండ్లలో పుష్కలంగా ఉంటుంది. మీరు హైబీపీతో బాధపడుతుంటే ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి అత్తిపండ్లను మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకోండి. వీటిని తింటే బీపీ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి.
figs
ఎముకల ఆరోగ్యానికి..
అత్తి పండ్లను తింటే ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీటిలో కాల్షియం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా.. వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి.
dried figs
మెరిసే చర్మం..
అత్తి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ లు తగిన మొత్తంలో ఉంటాయి. ఇవి మన చర్మానికి చాలా చాలా అవసరం. వీటిని తింటే మన చర్మానికి తగినంత పోషణ అందుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వీటిని తినొచ్చు.