MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • బ్లడ్ షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. కాకరకాయతో ఎన్ని లాభాలున్నాయో..!

బ్లడ్ షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. కాకరకాయతో ఎన్ని లాభాలున్నాయో..!

చాలా మంది కాకరకాయను తినడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుందని. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 16 2023, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సాధారణంగా కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ కూరగాయలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాకరకాయ మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాకరకాయలో విటమిన్ సి, పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. కాకరకాయను రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

రక్తంలో చక్కెర నియంత్రణ

కాకరకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ కూరగాయ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. కాకరకాయలోని లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. మధుమేహులు కాకరకాయ జ్యూస్ ను తాగితే బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

47
<p>bitter gourd</p>

<p>bitter gourd</p>

క్యాన్సర్

కాకరకాయ కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీనిలో మన చర్మానికి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో శరీర మంటను తగ్గించే, యూవీ కిరణాల వల్ల కలిగే గాయాల నుంచి చర్మాన్ని రక్షించే సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

57

గుండె ఆరోగ్యం

గుండెకు మేలు చేసే ఆహారాల్లో కాకరకాయ ఒకటి. ఎందుకంటే ఇది గుండెను హాని చేసే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కాకరకాయలో ఎక్కువ మొత్తంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. 

67

వెయిట్ లాస్

కాకరకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాకరకాయలోని ఫైబర్ కంటెంట్ కడుపును తొందరగా నింపుతుంది. దీంతో మీరు అతిగా తినే అవకాశం ఉండదు.

77

జీర్ణవ్యవస్థకు మంచిది

కాకరకాయ ఎన్నో జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల విరేచనాలు, మలబద్దకం వంటి అన్ని రకాల జీర్ణ  సమస్యలు తగ్గిపోతాయి.  కాకరకాయ మన జీర్ణవ్యవస్థను, గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved