మధుమేహులు స్వీట్లను తినొద్దు.. కానీ వీటిని ఎంచక్కా తినొచ్చు
డయాబెటీస్ పేషెంట్లు స్టార్చ్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. అంతేకాదు మధుమేహులు వీలైనంత వరకు షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు.
Diabetes Diet
డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. మీకు తెలుసా? రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్టార్చ్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. అలాగే మధుమేహులు వీలైనంత వరకు చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే తీపి పదార్థాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లకు బదులుగా ఎలాంటి వాటిని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
digestion
బెర్రీలు
బెర్రీలు మధుమేహులకు మంచి మేలు చేస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు, బ్లూబెర్రీస్ వంటి పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు ధైర్యంగా తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
Avocado
అవొకాడో
అవొకాడోలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి.
గింజలు
రోజూ గుప్పెడు గింజలను తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. బాదం, వాల్ నట్స్, పిస్తాపప్పుల్లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని ఎంచక్కా తినొచ్చు.
Image: Getty Images
దాల్చిన చెక్క
బరువు తగ్గించడం నుంచి నోటి దుర్వాసనను పోగొట్టడం వరకు దాల్చిన చెక్క ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కను తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
Image: Getty Images
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి.
Image: Pexels
బచ్చలికూర
బచ్చలి కూర మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే బచ్చలికూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి మేలు చేస్తుంది.
Sweet Potato
చిలగడదుంప
తీపి బంగాళాదుంపలు కూడా మధుమేహులకు మంచి మేలు చేస్తాయి. ఫైబర్, విటమిన్లతో పాటుగా మరెన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
సాల్మన్ ఫిష్
సాల్మన్ ఫిష్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.