వీటిని నానబెట్టి తింటే మీ పొట్ట, వెయిట్ తగ్గడం ఖాయం
పొట్ట కొవ్వును కరిగించడానికి, కొన్ని రకాల ఆహారాలను నానబెట్టి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.
మనం తినే ఆహారం ఆరోగ్యంగా ఉంటే మన గుండె ఆరోగ్యంతో పాటుగా మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు పొట్ట చుట్టూ కొవ్వును పెంచితే.. మరికొన్ని ఆహారాలు మాత్రం పొట్ట కొవ్వు కరగడానికి సహాయపడతాయి
బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి మీరు పెద్దగా తిప్పలు పడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును కొన్ని ఆహారాలను నానబెట్టి తింటే మీ పొట్ట చాలా తొందరగా కరిగిపోతుంది. అలాగే ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. అవేంటంటే?
చియా విత్తనాలు: చియా విత్తనాలను నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని నీళ్లలో లేదా ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలలో నానబెట్టి తింటే మీ జీర్ణక్రియ ఈజీ అవుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును రోజంతా నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని తగ్గించి పొట్ట కొవ్వును ఈజీగా తగ్గిస్తుంది.
అవిసె గింజలు : ఈ గింజల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపునే తింటే జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. దీనిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపును నిండుగా ఉంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ కరగడంతో పాటుగా బరువు కూడా అదుపులో ఉంటుంది.
బాదం: బాదం పప్పులో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తింటే మీ కడుపు నిండుగా ఉంటుంది. మీ బరువు కూడా అదుపులో ఉంటుంది. కానీ వీటిని ఎక్కువగా తినకూడదు.
ఓట్స్: ఓట్స్ మన ఆరోగ్యానికి మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. వీటిని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తింటే శరీరంలోని పోషకాల స్థాయి పెరుగుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కవగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్‌ను నెమ్మదిస్తుంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది.