మీకు కిడ్నీ వ్యాధులున్నయా? అయితే వీటిని తినడం మానేయండి
మూత్రపిండాల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ప్రాసెస్ చేసిన మాంసాలు, సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్, అరటిపండ్లు, బంగాళాదుంపలను తినకూడదు. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలకు కూడా దూరంగా ఉండాలి.
kidney health
మూత్రపిండాల వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత తినే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు మూత్రపిండాల వ్యాధులను మరింత ఎక్కువ చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. మూత్రపిండాల్లో రాళ్లు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సికెడి) తో సహా వివిధ మూత్రపిండాల వ్యాధులను తగ్గించడానికి ఆహారం, జీవనశైలి మార్పులు సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
processed meat
ప్రాసెస్ చేసిన మాంసం
సాసేజ్లు, హాట్ డాగ్స్, డెలి మాంసాలు వంటి ప్రాసెస్ చేసిన మాంసాల్లో ఎక్కువ మొత్తంలో ఉప్పుతో పాటుగా ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి వాటి రుచిని పెంచడమే కాకుండా షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి. అయినప్పటికీ మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేని వారు జంతు ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటే హైపర్ ఫిల్టరేషన్ కు దారితీస్తుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. జంతువుల ఆధారిత ప్రోటీన్లతో పోలిస్తే మూత్రపిండాల పనితీరుకు తక్కువ హాని కలిగించే మొక్కల వనరుల ప్రోటీన్ తీసుకోవడం మంచిది. చిక్కుళ్లు, కాయధాన్యాలు, టోఫు వంటి ఆహారాలను తీసుకోవచ్చు.
garlic
ఊరగాయలు
ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం దీన్ని ఎట్టిపరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే దీనిలో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుంది.
ఉప్పు
ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మరింత దిగజారుతుంది. మీ ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉండటం ద్రవం నిలుపుదల, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఇది మీ మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన, ప్యాకేజీ చేసిన ఆహారాలు, ఉప్పు కంటెంట్ ఎక్కువున్న మసాలా దినుసులకు దూరంగా ఉండండి. వీటికి బదులుగా వెల్లుల్లి, అల్లం, పసుపు, తులసి, ఒరేగానో, థైమ్ వంటి వివిధ మూలికలను తీసుకోండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image: Getty Images
ప్రోటీన్
ప్రోటీన్ మన మొత్తం ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. కానీ ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ను తీసుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ప్రోటీన్ విచ్ఛిన్నం, జీవక్రియ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయవలసిన వ్యర్థ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారు బీన్స్, కాయధాన్యాలు, ఇతర ఎక్కువ ప్రోటీన్ మొక్కల ఆహారాన్ని తీసుకోవడాన్ని తగ్గించాలి.
banana
అరటిపండ్లు
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది. పొటాషియం ద్రవ సమతుల్యత, నరాల పనితీరును నియంత్రించడానికి సహాయపడుతుంది. కానీ మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేని వారికి ఎక్కువ మొత్తంలో పొటాషియం అంత మంచిది కాదు. కిడ్నీ రోగులు అరటిపండ్లు తినకపోవడమే మంచిది. బదులుగా పైనాపిల్స్ వంటి ప్రత్యామ్నాయాలను తినొచ్చు.
Image: Freepik
బంగాళాదుంపలు
బంగాళాదుంపలలో కూడా పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు. బంగాళాదుంపలను వంట కోసం ఉపయోగించే ముందు రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల కొంత పొటాషియం బయటకు పోతుంది. ఈ ప్రక్రియ ద్వారా అన్నింట్లో పొటాషియాన్ని బయటకు పంపలేమని గుర్తుంచుకోవాలి. అందుకే బంగాళాదుంప తీసుకోవడం గురించి ఇంకా జాగ్రత్తగా ఉండాలి.