వీటిని తింటే వెంటనే బలం వస్తుంది
కొంతమంది నీరసంగా, బలం లేకుండా ఉంటారు. ఇలాంటి వారు ఏ చిన్న పనిచేసినా పూర్తిగా అలసిపోతారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మీకు వెంటనే బలం వస్తుంది. ఎనర్జిటిక్ గా మారిపోతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
మనం తినే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అయితే కొంతమంది తినాల్సిన దానికంటే చాలా తక్కువగా తింటారు. లేదా ప్రోటీన్లను చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటారు. దీనివల్ల ఒంట్లో శక్తి ఉండదు. శరీరం నీరసంగా, బలహీనంగా మారిపోతుంది. ఇలాంటి వారు ఏ పనిచేయలేరు.
ఏ చిన్న పనిచేసినా వెంటనే అలసిపోతారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మీ శరీరం తిరిగి బలంగా అవుతుంది. అలాగే వెంటనే మీకు శక్తి అందుతుంది. వీటిని రోజూ తింటే మీ శరీరం బలంగా మారుతుంది. ఎలాంటి రోగాలు లేకుండా ఉంటారు. ఇందుకోసం ఏం తినాలంటే?
అరటిపండు
అరటిపండ్లు ఏ సీజన్లో అయినా సరే మార్కెట్ లో దొరుకుతాయి. ఈ పండ్ల ధర ఎక్కువ కాకపోయినా.. వీటిని తింటే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండ్లలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ లు మీ శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. వీటిని తింటే తక్షణమే ఎనర్జీ అందుతుంది.
గుడ్డు
గుడ్డు మంచి పోషకాహారం. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాయి. గుడ్లలో ప్రోటీన్లు, కోలిన్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీర స్టామినాను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మీరు హెల్తీగా ఉండటంతో పాటుగా మీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ ను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది బలహీనంగా ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్లో థియోబ్రోమైన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కెఫిన్ లాగే మంచి ఎనర్జీని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
almond
బాదం పప్పు
బాదం పప్పుల్లో కూడా మన శరీరానికి ప్రయోజనకరంగా ఉండే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరానికి మంచి స్టామినాను అందిస్తాయి. అలాగే బాదం పప్పులు పోషకాల లోపాలను కూడా పోగొడుతాయి.
ఓట్ మీల్
ఓట్ మీల్ కు మించిన మంచి బ్రేక్ ఫాస్ట్ ఉండదు. ఎందుకంటే ఇది మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. అలాగే రోజుకు అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఓట్స్ లో విటమిన్ బి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు స్థిరమైన స్టామినాను అందిస్తాయి.
peanut
పల్లీలు
పల్లీలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు,ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందించి స్టామినాను పెంచుతాయి.
పుల్లని పండ్లు
నిమ్మకాయ, నారింజ, ఉసిరి వంటి పుల్లని పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో విటమిన్ బి 6, కాల్షియం, ఫైబర్, ఫోలేట్, థయామిన్ లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీర స్టామినాను బాగా పెంచుతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడతాయి. వీటిని తింటే రోగాలొచ్చే ముప్పు తగ్గుతుంది.