ఈ ఐదు పండ్లు మీరు అనుకున్నంత మంచివేమీ కాదు..!
మనం మంచివి అనుకుంటూ తీసుకునే కొన్ని పండ్లు.. మేలు కాదు నష్టాన్ని తీసుకువస్తాయట. ఎలాంటి పండ్లు.. మనం అనుకున్నంత మంచివి కావో.. ఇప్పుడు తెలుసుకుందాం...
fruits
ఆరోగ్యం బాగుండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా పండ్లు కూడా భాగం చేసుకోవాలి. తాజాగా, కలర్ ఫుల్ పండ్లు తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే పండ్లలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే... అందరూ ఏదో ఒక రూపంలో పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే... మీరు ఊహించినట్లు అన్ని పండ్లు ఆరోగ్యానికి మేలు చేయవు. మనం మంచివి అనుకుంటూ తీసుకునే కొన్ని పండ్లు.. మేలు కాదు నష్టాన్ని తీసుకువస్తాయట. ఎలాంటి పండ్లు.. మనం అనుకున్నంత మంచివి కావో.. ఇప్పుడు తెలుసుకుందాం...
1.ఆరెంజ్..
ఆరెంజ్ పండ్లను మనం చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే... వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల... రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక్కడి వరకు నిజమే కానీ.. ఆరెంజెస్ తినడం వల్ల.. కడుపులో ఎసిడిటిక్ రియాక్షన్ వస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్, డిస్ కంఫర్ట్ ఉంటుంది. అందుకే.. ఈ పండ్లు అందరికీ సూట్ అవ్వవు. వీటిని మరీ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
Lychee
2.లిచ్చి..
లిచ్చి పండ్లు రుచి చాలా కమ్మగా ఉంటాయి. మంచిగా జ్యూసీగా, తియ్యగా ఉంటయి. వీటిని తింటుంటే.. డెలిషియస్ ఫీలింగ్ వస్తుంది. వీటిలో మంచి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ.. ఈ పండ్లు తినడం వల్ల కూడా తెలియని ఓ ప్రమాదం దాగి ఉంది. వీటిలో సహజంగానే టాక్సిన్స్ ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ డ్రాప్ అవుతాయి. ముఖ్యంగా... పరగడుపున ఈ పండు తినడం చాలా ప్రమాదం. వీటిని ఎక్కువగా తినడం వల్ల చాలా ప్రమాదం. మితంగా మాత్రమే తినడం బెటర్.
dates
3.డేట్స్..
ఇక మనలో చాలా మంది డేట్స్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. షుగర్ కి బదులుగా డేట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ... డేట్స్ ని ఎక్కువగా తినడం కూడా మంచిది కాదట. ఎందుకంటే... వీటిని ఎక్కువగా తినడం వల్ల.. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయటజ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. షుగర్ తీసుకోకూడదు అనుకునే వాళ్లు డేట్స్ తినడం వల్ల కూడా మీకు తెలీకుండానే షుగర్ తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి.. ఈ పొరపాటు చేయకండి.
4.ఎండు కొబ్బరి..
కొబ్బరి చాలా హెల్దీ. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. ఎండు కొబ్బరిని మనం చాలా రకాల స్వీట్లలో కూడా ఎండు కొబ్బరిని వాడుతూ ఉంటారు. ఎండు కొబ్బరిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే... ఈ ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల .. అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కార్షియో సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
5.షుగర్ ఉండే ఫ్రూట్స్..
సహజంగా పండ్లు తియ్యగా ఉంటాయి. అవి మంచిదే కానీ.. కృత్రిమ స్వీట్నర్స్ కలిపే ఫ్రూట్ జ్యూస్ లు ఏవీ మంచివి కావు. మనం పండ్ల రసమే కదా అనుకుంటూ ఉంటాం. కానీ.... అందులో.. షుగర్స్ కలపడం వల్ల... అవి ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి.. టెట్రా ప్యాకెట్స్, క్యాన్స్ లో అమ్మే జ్యూసులు కూడా తాగకూడదు.