MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Chapati: చపాతీని ఇలా తింటేనే బరువు తగ్గుతారు, లేదంటే పెరుగుతారు

Chapati: చపాతీని ఇలా తింటేనే బరువు తగ్గుతారు, లేదంటే పెరుగుతారు

Chapati: బరువు తగ్గాలనుకునేవారు అన్నం తగ్గించి చపాతీలను ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే అన్నం తింటే బరువు పెరుగుతామని. అయితే బరువు తగ్గాలంటే మాత్రం చపాతీలను ఎలా పడితే అలా అస్సలు తినకూడదు.

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 08 2025, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బరువు తగ్గాలంటే చపాతీని ఎలా తినాలి?
Image Credit : stockPhoto

బరువు తగ్గాలంటే చపాతీని ఎలా తినాలి?

 అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే అన్నాన్ని ఎక్కువగా తినేవారు వెయిట్ బాగా పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు మాత్రం అన్నాన్ని తగ్గించి చపాతీలను ఉదయం, రాత్రి వేళల్లో తింటుంటారు. 

నిజానికి చపాతీ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అయినా చపాతీ తిన్నంత మాత్రానా బరువు తగ్గడమనేది ఉండదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చపాతీని కొన్ని పద్దతుల్లో అస్సలు తినకూడదు. దీనివల్ల మీరు ఏ మాత్రం బరువు తగ్గరు. పైగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చపాతీలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Image Credit : stockPhoto

చపాతీలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గోధుమ పిండితో చేసిన చపాతీలను తింటే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో మన శరీరానికి అవసరమైన జింక్, ఐరన్, మెగ్నీిషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు మెండుగా ఉంటాయి. చపాతీల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతుంది. 

అలాగే జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి తోడ్పడుతుంది. చపాతీలను తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనితో మీరు అనవసరమైన ఆహారాలను తినకుండా ఉంటారు. ఈ విధంగా చపాతీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

వైట్ రైస్ తో పోలిస్తే గోధుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచదు. కాబట్టి చపాతీలు  డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివని ఆరోగ్య నిపుణులు  చెప్తారు. ఇది బరువు తగ్గేవారికి కూడా మంచిది. 

గోధుమల్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎక్కువ సేపు శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. చపాతీలను తిన్న వెంటనే మన శారీరానికి శక్తి అంది అలసట బలహీనత తగ్గుతుంది. అందుకే వీటిని ఉదయం, మధ్యహ్న భోజనంలో తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు.

Related Articles

Related image1
ఇందుకే రోజూ కప్పు పెరుగును తినాలంటారు
Related image2
Kitchen Hacks: గ్యాస్ స్టవ్ బర్నర్లను ఇలా ఈజీగా క్లీన్ చేయండి
35
చపాతీల ప్రయోజనాలు
Image Credit : stockPhoto

చపాతీల ప్రయోజనాలు

గోధుమల్లో  ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ గోధుమల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి. 

గోధుమల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. రోజూ చపాతీలను తినే వారికి కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రావు. 

గోధుమ చపాతీల్లో మెగ్నీషియం, ఐరన్,  జింక్, విటమిన్ బి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, రక్తహీనత సమస్యను తగ్గించడానికి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. 

అంతేకాదు పోషకాలు ఎక్కువగా ఉన్న చపాతీని తింటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. 

45
చపాతీని ఎలా తింటే బరువు పెరుగుతారు?
Image Credit : stockPhoto

చపాతీని ఎలా తింటే బరువు పెరుగుతారు?

కొంతమంది చపాతీని తిన్నా బరువు పెరుగుతారు. కారణం పిండిని కలిపేటప్పుడు, కాల్చేటప్పుడు అందులో నూనె లేదా నెయ్యిని వేయడమే. ఇదే మనం చేసే అతిపెద్ద తప్పు. దీనివల్ల చపాతీలను తిన్నా లాభం ఉండదు. రెండు చపాతీల్లో 140 కేలరీలు ఉంటాయి. 

మీరు  ఈ చపాతీలకు నెయ్యిని లేదా నూనెను యాడ్ చేసినప్పుడు  ఈ కేలరీల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం ఉండదు. పెరగడమే ఉంటుంది. చపాతీలను నూనె లేదా నెయ్యితో కాల్చి తింటే టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని తినడం వల్ల బరువు తగ్గరు.  బరువు తగ్గాలనుకునేవారు చపాతీలను ఇలా మాత్రం తినకూడదు. 

55
బరువు తగ్గడానికి చపాతీలను ఎలా తినాలి?
Image Credit : stockphoto

బరువు తగ్గడానికి చపాతీలను ఎలా తినాలి?

- బరువు తగ్గాలనుకునేవారు చపాతీ పిండిలో లేదా చపాతీలను కాల్చేటప్పుడు నూనె లేదా నెయ్యిని కలపకూడదు. వీటిని అలాగే పెనం మీద వేసి కాల్చండి. దీనివల్ల కేలరీలు పెరగవు. 

- చపాతీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ దీన్ని ఎక్కువగా మాత్రం తినకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు. బరువు తగ్గాలనుకునేవారు ఒక పూటకు రెండు చపాతీలను మాత్రమే తింటే మంచిది. 

- అలాగే చపాతీలను వేయించిన కూరగాయలతో తినకూడదు. ఎందుకంటే వీటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా చపాతీలను తింటే మీరు అస్సలు బరువు తగ్గరు. చపాతీలను ఉడికించిన, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పప్పు కూరలతో తినండి. ఈ విధంగా చపాతీలను తింటే గనుక మీరు ఈజీగా బరువు తగ్గుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Related Stories
Recommended image1
ఇందుకే రోజూ కప్పు పెరుగును తినాలంటారు
Recommended image2
Kitchen Hacks: గ్యాస్ స్టవ్ బర్నర్లను ఇలా ఈజీగా క్లీన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved