MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Appam Recipe: మెత్తటి కేరళ అప్పాలు ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా!

Appam Recipe: మెత్తటి కేరళ అప్పాలు ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా!

Appam Recipe: దక్షిణ భారత దేశంలో.. ముఖ్యంగా కేరళలో బాగా ఫేమస్ అయిన బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ అప్పాలు. వీటిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి. మీరు ప్రతి రోజు వీటిని అల్పాహారంగా తయారు చేసి మీ పిల్లలకు పెడితే చాలా హ్యాపీగా తింటారు.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 16 2025, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అప్పాలు.. ఈ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ కేరళ వంటకమే అయినా పిల్లలు, పెద్దలు బాగా ఇష్టపడే ఒక రకమైన పాన్ కేక్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో దిబ్బరొట్టెలాంటిది అన్న మాట. దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్ ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

అప్పాలు ఎలా తయారు చేయాలి?

1. ముందుగా 1.5 కప్పుల రెగ్యులర్ తెల్ల బియ్యం (సోనా మసూరి, పర్మాళ్, సుర్తి కోలం లేదా పొన్ని బియ్యం) నీటిలో వేసి బాగా కడగాలి. తర్వాత ఆ బియ్యాన్ని 2 కప్పుల నీటిలో 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. గిన్నెను మూతతో కప్పి ఉంచడం మర్చిపోవద్దు. మీరు కావాలంటే సాధారణ పచ్చి బియ్యం, ఉడికించిన బియ్యం రెండింటినీ సమానంగా కలపవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2. నీటిని వంపేసి, నానబెట్టిన బియ్యాన్ని బ్లెండర్ లేదా గ్రైండర్ జార్‌లోకి మార్చండి. అర కప్పు తాజాగా తురిమిన కొబ్బరి, పావు కప్పు అటుకులు, అర టీస్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేయండి.

అటుకులకు బదులుగా మీరు ఉడికించిన అన్నం, ఆవిరి మీద ఉడికించిన అన్నం లేదా మరమరాలు కూడా వాడవచ్చు.

మీరు అటుకులను వాడాలనుకుంటే బియ్యంతో పాటు లేదా విడిగా 30 నిమిషాలు నానబెట్టాలి. లేదంటే మీరు వాటిని నీటితో కడిగి నేరుగా బ్లెండర్‌కు వేయవచ్చు.

 

35

3. తర్వాత అవసరమైనంత నీరు పోసి మిశ్రమాన్ని మెత్తగా, జారుడుగా ఉండేలా కలపండి. పిండి మరీ పలుచగా ఉంటే కొన్ని టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కలిపి చిక్కగా చేయవచ్చు.

4. పిండిని ఒక మీడియం లేదా పెద్ద మిక్సింగ్ గిన్నెలోకి పోయాలి. ఈ పిండిని పులియబెట్టడానికి ఈస్ట్ కలపండి. దీని వల్ల పిండి త్వరగా పులుస్తుంది. 

5. ఈస్ట్ పూర్తిగా కరిగేలా పిండిని బాగా కలపండి. తర్వాత గిన్నెపై మూత వేసి 1 నుండి 2 గంటల పాటు పులియబెట్టండి. 

6. పిండి పులిసిన తర్వాత తేలికగా మారి రెట్టింపు అవుతుంది. అందులో బుడగలు లేదా గాలి పాకెట్లు కనిపిస్తాయి. 

45

అప్పాలు తయారు చేయడం ఇలా..

పాన్ లేదా కడాయిని తీసుకొని వేడి చేయండి. పాన్‌లో అర టీస్పూన్ నూనె వేసి అంతటా సమానంగా స్ప్రెడ్ చేయండి. మీరు నాన్‌స్టిక్ కడాయిని ఉపయోగిస్తుంటే నూనె వేయొద్దు. పాన్ వేడెక్కిన తర్వాత గరిటెడు పిండిని పాన్ మధ్యలో వేయండి. గుండ్రంగా పలుచని అంచులు, కొద్దిగా మందంగా ఉండేలా పాన్‌ను వృత్తాకారంలో తిప్పండి. అవసరమైన విధంగా వేడిని అడ్జెస్ట్ చేస్తూ అప్పం తయారు చేయండి. 
 

55

పిండిని ఒక రోజులోనే ఉపయోగించాలి

అప్పాలు తయారు చేసే పిండిని ఒక రోజులోనే ఉపయోగించాలి. లేదంటే పాడైపోతుంది. 

కేరళలో అయితే అప్పాలను వెజిటబుల్ స్టూ, తీపి కొబ్బరి పాలతో కలిపి తింటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వెజ్ కూర్మా లేదా బంగాళదుంప కూరతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.. ఎందుకో తెలుసా?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image2
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Recommended image3
Milk Cake: కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు..నోట్లో కరిగిపోయే మిల్క్ కేక్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved