ఉప్మా తింటే బరువు తగ్గుతరా?
బరువు తగ్గడం అంత సులువు కాదన్న ముచ్చల టాలా మందికి తెలుసు. కానీ ఖచ్చితంగా ప్రయత్నిస్తే మాత్రం బరువును తగ్గొచ్చంటున్నారు నిపుణులు.
ఊబకాయాన్ని నియంత్రించడానికి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ప్రస్తుతం చాలా మందే కష్టపడుతున్నారు. ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నారు. ఏదేమైనా బరువు తగ్గాలంటే ముందు ఫుడ్ విషయాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏవి పడితే అవి తింటే విపరీతంగా బరువు పెరిగిపోతారు. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు చాలా మందే ఉన్నారు. బెల్లీ ఫ్యాట్ ను, బరువును తగ్గించుకోవాలంటే ముందుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని నిపుణులు అంటున్నారు.
Weight Loss
బరువు తగ్గాలనుకునే వాళ్లు, నూనె, కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. ఎందుకంటే మరింత బరువు పెరిగేలా చేస్తాయి. ఊబకాయం బారిన పడేస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు రాత్రిపూట ఆహారాన్ని కొద్దిగానే తినాలి. అలాగే మధ్యాహ్నం కూడా అన్నం పరిమాణాన్ని తగ్గించాలి.
మీరు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఉప్పు ఉప్మాను తినండి చాలు అంటున్నారు నిపుణులు. అవును ఉప్మా బరువు తగ్గాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సాధారణంగా గోధుమ రవ్వను ఉపయోగిస్తారు. పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉండే రవ్వ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది.
Image: Freepik
100 గ్రాముల రవ్వలో 3 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల ప్రోటీన్, 71 గ్రాముల కార్బోహైడ్రేట్లతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, సోడియం ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
గోధుమలతో తయారైన ఈ రవ్వలో సాధారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది సాధారణంగా జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. దీంతో మీకు అతిగా ఆకలి వేయదు. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ ఆకలిని తగ్గిస్తుంది. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఈ విధంగా మీరు ఉప్మాను తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
ఉప్మాలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను పోగొడుతుంది. అలాగే మన శరీరానికి శక్తిని అందిస్తుంది. రవ్వలో మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలకు, నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. దీనిలో ఉండే సెలీనియం మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఇ, విటమిన్ బి లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అందుకే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మాను తప్పకుండా తినండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.