leftover dough: ముందు రోజు కలుపుకున్న పిండితో రోటీలు చేసుకొని తినొచ్చా?
leftover dough: మీకు రోజూ రోటీ తినే అలవాటు ఉందా? రోజూ పిండి కలుపుకోవడం కష్టం అని.. ఒకేసారి కలుపుకొని పెట్టుకుంటున్నారా? ఇలా ముందే కలుపుకున్న పిండితో రోటీలు చేసుకొని తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

dough
దాదాపు అందరు ఇళ్ల ల్లో రోటీ పిండిని ఒకేసారి ఎక్కువగా కలిపి, మిగిలిన దానిని మరుసటి రోజు వాడుతూ ఉంటారు. కానీ, కానీ ఇలా ముందు రోజు కలుపుకున్న పండితో మరుసటి రోజు రోటీ, చపాతీ చేసుకోవచ్చా? అలా పిండిని వాడొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా? లేక ఏవైనా సమస్యలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం....
రాత్రంతా కలిపిన పిండిని అలానే ఉంచితే ఏమౌతుంది..?
రోటీ పిండి తేమగా ఉండటం వల్ల గాలి తగిలి సహజ ఈస్ట్ లు,బాక్టీరియా తయారయ్యే అవకాశం ఉంది.దీని వల్ల పండి ఒక రకమైన ఘాటు వాసన వస్తుంది. రుచి కూడా మారిపోతుంది. పిండి పుల్లగా మారే అవకాశం ఉంది. అలా కాకుండా.. పిండి కలుపుకున్న వెంటనే బయట ఉంచకుండా వెంటనే ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే... పిండి పాడవ్వకుండా తాజాగా ఉండే అవకాశం ఉంది. ఫ్రిజ్ లో పెట్టకుండా బయట ఉంచి.. దానితో రోటీలు చేసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పిండి బయట ఉంచి, అదే పిండితో రోటీ, చపాతీ చేసుకొని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, కడుపులో మంట, విరేచనాలు, వాంతులు, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఫ్రిజ్ లో కూడా పిండి ఒకట్రెండు రోజులకి మంచి నిల్వ చేయకపోవడమే మంచిది. ఎక్కువ రోజులు ఉంచితే.. ఫ్రిజ్ లో ఉన్నా కూడా పిండి పాడైపోతుంది. ఒక్కోసారి బూజు కూడా పట్టే అవకాశం ఉంది.
పిండిని ఎలా నిల్వ చేయాలి..?
మీరు పిండి తాజాగా ఉండాలి అంటే దానికంటూ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సరిగా నిల్వ చేసినప్పుడు మాత్రమే పిండి తాజాగా ఉంటుంది. దాని కోసం.. మనం కలిపి పెట్టుకున్న పిండిని గాలి తగలని కంటైనర్ లో ఉంచి, ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. బయట అయితే... 12 గంటలకు మించి ఉంచకూడదు. ఫ్రిజ్ లో అయితే 48 గంటలకు మంచి నిల్వ చేయకూడదు. మూత లేకుండా అసలే నిల్వ చేయకూడదు. రోటీ చేయడానికి కనీసం 30 నిమిషాల ముందు.. పిండిని ఫ్రిజ్ లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. చల్లదనం తగ్గిన తర్వాత రోటీ చేసుకుంటే సరిపోతుంది.

